అదృష్టమంటే ఇదే.. పుట్టగానే లైఫ్‌టైం ఆఫర్‌! | Baby Girl Born InTexas Restaurant Gets Super Offer | Sakshi
Sakshi News home page

అదృష్టమంటే ఇదే.. పుట్టగానే లైఫ్‌టైం ఆఫర్‌!

Published Thu, Jul 26 2018 12:19 PM | Last Updated on Thu, Jul 26 2018 12:44 PM

Baby Girl Born InTexas Restaurant Gets Super Offer - Sakshi

అమెరికాలో అనుకోకుండా రెస్టారెంట్‌లో పుట్టిన పాప జీవితాంతం సరిపడేలా భారీ ఆఫర్‌ కొట్టేసింది. ఆమెకు రెస్టారెంట్‌ యాజమాన్యం ప్రకటించిన ఆఫర్‌పై చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి.

వాషింగ్టన్‌ : టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోకి చెందిన రాబర్ట్‌ గ్రిఫిన్‌, మాగీలు భార్యాభర్తలు. మాగీ 9 నెలల గర్భవతి. ఈ జంట హాస్పిటల్‌కు చెకప్‌ కోసం వెళ్లాలనుకుంది. హాస్పిటల్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో మ్యాగీకి నొప్పులు మొదలయ్యాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో తలుపులు మూసివేసి లైట్స్‌ ఆఫ్‌ చేస్తున్న రెస్టారెంట్‌ డోర్‌ను మ్యాగీ భర్త కొట్టారు. రెస్టారెంట్‌ను తెరచిన సిబ్బంది విషయాన్ని గుర్తించి.. మ్యాగీని రెస్ట్‌రూమ్‌(బాత్రూమ్‌)లోకి తీసుకెళ్లారు. కొన్ని నిమిషాలు ఎలాగోలా కష్టపడి చిక్‌ ఫిల్‌ ఏ రెస్టారెంట్‌ సిబ్బంది మ్యాగీకి డెలివరీ చేశారు. మ్యాగీ ఓ పండంటిపాప గ్రేస్‌లైన్‌ మే వయోలెట్‌ గ్రిఫిన్‌కు జన్మనిచ్చింది. 

డబుల్‌ బొనాంజా!
మేనేజర్‌ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్‌చేసి రెండు టవల్స్‌ తెప్పించి, వాటిని కాస్త వేడి చేయించి మ్యాగీకి అందించారు. పాప చాలా అందంగా, ఆరోగ్యంగా ఉందని ఆనందంలో మునిగితేలుతున్న ఆ జంటకు రెస్టారెంట్‌ వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది. తమ రెస్టారెంట్‌ ఆహారాన్నే కాదు పిల్లలను డెలివరీ చేస్తుందని చమత్కరించిన మేనేజర్‌.. చిన్నారి గ్రేస్‌లైన్‌కు జీవితాంతం ఉచితంగా ఆమెకు నచ్చిన ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. దాంతోపాటుగా చిన్నారికి ఉద్యోగం చేసే వయసొచ్చాక తనకు ఇష్టం ఉంటే ఇక్కడే ఉద్యోగం కల్పిస్తామని మేనేజర్‌ చెప్పగానే.. ఆ పాప వారికి చాలా లక్కీ అని గ్రిఫిన్‌, మ్యాగీ హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement