Woman Delivery
-
శభాష్ భారతి.. కండక్టర్‌కు సజ్జనార్ అభినందనలు
మహబూబ్ నగర్, సాక్షి: రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తరపున ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిజేశారు. ‘ కండక్టర్ సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం’అని ఎక్స్‌లో పేర్కొన్నారు.రాఖీ పండుగ రోజు తెలంగాణ ఆర్టీసి బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. రాఖీ పండుగ నాడు #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి… pic.twitter.com/nTpfVpl5iT— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) August 19, 2024 -
ట్రైన్లో గర్భిణీకి పురిటి నొప్పులు.. ప్రసవం చేసిన హిజ్రాలు..
రోజూ బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాఫిక్ కూడళ్ల వద్ద అనేక మంది హిజ్రాలు(ట్రాన్స్‌జెండర్స్్) తారసపడుతుంటారు. వారిని చూసినప్పుడు చాలా మంది అసహ్యించుకుంటూ దూరంగా వెళ్తుంటారు. చాలా వరకు హిజ్రాలు జనాలను ముఖ్యంగా అబ్బాయిలను వేధించి మరీ డబ్బులు లాక్కుంటారు. ఇవ్వకుంటే దౌర్జన్యానికి పాల్పడుతుంటారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. వారిలో మంచివారు కూడా ఉంటారు. అంతేగాక హిజ్రాలు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుందని నమ్మేవారూ లేకపోలేదు. అంటే హిజ్రాలు ప్రవర్తించే తీరును బట్టే వారిని చూసే కోణం మారుతుంటుంది. తాజాగా ట్రాన్స్జెండర్లు ఓ మంచి పని చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ట్రైన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు హిజ్రాల బృందం ప్రసవం చేసి ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. షేక్‌పనురా జిల్లాకు చెందిన ఓ గర్భిణి తన భర్తతో కలిసి హౌరా నుంచి లఖిసరాయ్‌కు హల్వారా-పాట్నా జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తోంది. రైలు జాసిదిహ్ రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన వెంటనే మహిళకు పురిటి నొప్పులు రావడం ప్రారంభించాయి. గర్భిణి నొప్పులతో అవస్థలు పడుతున్న భార్య పరిస్థితిని గమనించిన భర్త.. సాయం కోసం కోచ్‌లోని ఇతర మహిళలను ప్రదేయపడ్డాడు. అయితే ప్రవస వేదనతో బాధపడుతున్న మహిళకు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. సమయం గస్తున్న కొద్దీ బాధితురాలి పరిస్థితి మరింత క్షీణించడం ప్రారంభించింది. ఇంతలో అదే సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది హిజ్రాలు గర్భిణీ పరిస్థితిని చూసి స్పందించారు. వెంటనే గర్భిణీని రైలులోని విశ్రాంతి గదిలోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. సదరు మహిల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కోచ్‌లోని ప్రతి ఒక్కరూ హిజ్రాలను అభినందించారు. చదవండి: విక్రమార్కుడు.. రత్న ప్రభాకరన్..104 సార్లు ఫెయిల్..105వ సారి శభాష్ అనిపించుకున్నాడు -
వీడియోకాల్‌లో డాక్టర్ సూచనలు.. గర్భిణికి ప్రసవం చేసిన నర్సులు.. శిశువు మృతి
సాక్షి, చెన్నై: ఆస్పత్రిలో విధులకు రాకుండా వీడియో కాల్ ద్వారా నర్సుల సాయంతో ఓ గర్భిణికి డాక్టర్ ప్రసవం చేయించే ప్రయత్నం చేశాడు. శిశువు మరణించడం, తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆగమేఘాలపై పెద్దాస్పత్రికి తరలించారు. మధురాంతకంలో ఈ ఘటన మంగళవారం పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాలు.. మదురాంతకం సునాంబేడు అండార్ కుప్పం గ్రామానికి చెందిన మురళి(36) ఎలక్ట్రిషియన్. ఆయన భార్య పుష్ప (33) రెండోసారి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వీరు ఇల్లిడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. పురిటి నొప్పులు రావడంతో పుష్పను సోమవారం సాయంత్రం ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ వైద్యులు లేరు. ఉన్న ముగ్గురు నర్సులో ఆమెను అడ్మిట్ చేశారు. గంట తర్వాత క్రమంగా నొప్పులు అధికం కావడంతో ప్రసవం చేయడానికి నర్సులు సిద్ధమయ్యారు. అయితే, బిడ్డ తల బయటకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో వైద్యుడిని సంప్రదించగా వీడియో కాల్ సాయంతో ప్రసవం చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రక్తస్రావం అధికం కావడంతో 108 ద్వారా పుష్ప, శిశువును మధురాంతకం ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలో శిశువు మరణించింది. పుష్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో శిశువు మరణించిన సమాచారం అందించడం, వీడియో కాల్ ద్వారా నర్సులు ప్రసవం చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పుష్ప బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం మధురాంతకం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పోలీసులు రంగంలోకి దిగి సముదాయించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. చదవండి: ‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని -
విమానంలో పుట్టి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు!
న్యూఢిల్లీ : విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఓ గర్భిణీ మార్గమధ్యంలో ప్రసవించింది. తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు ఇండిగో విమాన సంస్థ పేర్కొంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరిన 6 ఈ 122(6E 122 ) అనే విమానంలో ఓ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని, తమ సిబ్బంది ఆమెకు తోడుగా నిలిచారని ఇండిగో సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే రాత్రి 7.30 గంటలకు బెంగళూరులో విమానం ల్యాండ్ అయిన వెంటనే తల్లీ బిడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్లు ఇండిగో పేర్కొంది. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో తల్లీబిడ్డలకు గొప్ప స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండిగో సిబ్బంది తల్లీబిడ్డలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలానే పుట్టిన బిడ్డకు ఇండిగో సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విమానంలో పుట్టాడు కాబట్టి అతనికి జీవితాంతం ఫ్లైట్ టికెట్ ఉచితంగా అందినట్లు సమాచారం. అయితే దీనిపై ఇండిగో సంస్థ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. A baby boy was born in an IndiGo Delhi- Bangalore flight Both mother & child are doing fine #aviation pic.twitter.com/9hlCh0f9zy — Arindam Majumder (@ari_maj) October 7, 2020 -
అదృష్టమంటే ఇదే.. పుట్టగానే లైఫ్‌టైం ఆఫర్!
అమెరికాలో అనుకోకుండా రెస్టారెంట్లో పుట్టిన పాప జీవితాంతం సరిపడేలా భారీ ఆఫర్ కొట్టేసింది. ఆమెకు రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించిన ఆఫర్‌పై చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయగా లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. వాషింగ్టన్ : టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకి చెందిన రాబర్ట్ గ్రిఫిన్, మాగీలు భార్యాభర్తలు. మాగీ 9 నెలల గర్భవతి. ఈ జంట హాస్పిటల్‌కు చెకప్ కోసం వెళ్లాలనుకుంది. హాస్పిటల్‌కు వెళ్తుండగా మార్గం మధ్యలో మ్యాగీకి నొప్పులు మొదలయ్యాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో తలుపులు మూసివేసి లైట్స్ ఆఫ్ చేస్తున్న రెస్టారెంట్ డోర్‌ను మ్యాగీ భర్త కొట్టారు. రెస్టారెంట్‌ను తెరచిన సిబ్బంది విషయాన్ని గుర్తించి.. మ్యాగీని రెస్ట్రూమ్(బాత్రూమ్)లోకి తీసుకెళ్లారు. కొన్ని నిమిషాలు ఎలాగోలా కష్టపడి చిక్ ఫిల్ ఏ రెస్టారెంట్ సిబ్బంది మ్యాగీకి డెలివరీ చేశారు. మ్యాగీ ఓ పండంటిపాప గ్రేస్లైన్ మే వయోలెట్ గ్రిఫిన్‌కు జన్మనిచ్చింది. డబుల్ బొనాంజా! మేనేజర్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్చేసి రెండు టవల్స్ తెప్పించి, వాటిని కాస్త వేడి చేయించి మ్యాగీకి అందించారు. పాప చాలా అందంగా, ఆరోగ్యంగా ఉందని ఆనందంలో మునిగితేలుతున్న ఆ జంటకు రెస్టారెంట్ వారి ఆనందాన్ని రెట్టింపు చేసింది. తమ రెస్టారెంట్ ఆహారాన్నే కాదు పిల్లలను డెలివరీ చేస్తుందని చమత్కరించిన మేనేజర్.. చిన్నారి గ్రేస్లైన్కు జీవితాంతం ఉచితంగా ఆమెకు నచ్చిన ఆహారాన్ని అందిస్తామని ప్రకటించారు. దాంతోపాటుగా చిన్నారికి ఉద్యోగం చేసే వయసొచ్చాక తనకు ఇష్టం ఉంటే ఇక్కడే ఉద్యోగం కల్పిస్తామని మేనేజర్ చెప్పగానే.. ఆ పాప వారికి చాలా లక్కీ అని గ్రిఫిన్, మ్యాగీ హర్షం వ్యక్తం చేశారు. -
వాట్సాప్ సాయం..రైళ్లో ప్రసవం
నాగ్‌పూర్: ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి రైలులో మహిళ ప్రసవించడానికి సాయపడ్డాడు. ఇందుకోసం వాట్సాప్ ద్వారా సీనియర్ డాక్టర్ల సాయం తీసుకున్నాడు. 24 ఏళ్ల విపిన్ ఖడ్సే ప్రస్తుతం నాగ్‌పూర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో శిక్షణలో ఉన్నాడు. అహ్మదాబాద్ నుంచి రాయ్‌పూర్ వెళ్లడానికి రోజు కూలీలైన చిత్రలేఖ, ఆమె భర్త శుక్రవారం అహ్మదాబాద్–పూరీ రైలెక్కారు. నిండు గర్భిణి అయిన చిత్రలేఖకు రైల్లోనే నొప్పులొచ్చాయి. ఆ రైళ్లోనే విపిన్ ప్రయాణిస్తుండటం, ఇతర సీనియర్ వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో విపిన్ ఖడ్సేనే ఆమెకు కాన్పు చేశారు. ప్రయాణికుల్లోని ఓ నర్సు కూడా అతనికి సాయం చేశారు. సాధారణ కాన్పు జరగక, ప్రసవంలో సమస్య తలెత్తడంతో ఖడ్సే వాట్సాప్ ద్వారా సీనియర్ డాక్టర్ల సలహాతో చికిత్స నిర్వహించారు. -
108లో మహిళ ప్రసవం
మనూరు: 108లో మహిళ ప్రసవించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఇకర్పల్లి గ్రామానికి చెందిన షాజిబేగానికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను అంబులెన్స్‌లో కరస్‌గుత్తి పీహెచ్‌సీకి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మోర్గి మోడ్ దగ్గరకు రాగానే మహిళ 108 లోనే ప్రసవించిందని పైలెట్ జగన్నాథం, ఈఎంటీ కాశీనాథ్‌లు తెలిపారు. కాగా తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. -
చెట్టు కిందే గొత్తికోయ మహిళ ప్రసవం
* కవలలు జననం.. ఒకరు మృతి.. చికిత్స పొందుతున్న మరొకరు * రోడ్డుమార్గం లేక ఆస్పత్రికి చేరుకోలేకపోయిన గర్భిణి ఏటూరునాగారం: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి రోడ్డుమార్గం లేక కావడిపై మోసుకొస్తుండగా.. నడిరోడ్డుపైనే ఓ చింతచెట్టు కింద ప్రసవించిన ఘటన మంగళవారం జరిగింది. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం శివాపురం పరిధిలోని లింగాపురం గొత్తికోయగూడేనికి చెందిన మాడవి పోసమ్మకు మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. గూడేనికి సరైన రోడ్డు లేక 108, ఇతర వాహనాలు కానీ వచ్చే పరిస్థితి లేదు. దీంతో భర్త భద్రయ్యతో పాటు మరికొందరు మంచానికి తాళ్లు కట్టి పోసమ్మను మోసుకుం టూ 2 కి.మీ. దూరం వచ్చారు. అప్పటికే ఓ ఆటోను పిలిపించారు. కానీ, ఆ ఆటో కూడా మార్గమధ్యలో బురదలో కూరుకుపోయింది. అంతా కలసి ఆటోను బయటకు లాగినా.. పోసమ్మకు నొప్పులు ఎక్కువ కావడంతో గోగుపల్లిలోని ఓ చింత చెట్టుకింద నిలిపివేశారు. దీంతో ఆ చెట్టు కిందే స్థానిక మహిళలంతా కలసి చుట్టూ చీరలు కట్టి.. తమకు తెలిసిన విధంగా పురుడు పోశారు. పోసమ్మకు ఇద్దరు మగ శిశువులు జన్మించగా, అందులో ఒక బాబు మృతి చెందాడు. గోగుపల్లి సబ్‌సెంటర్ ఏఎన్ ఎం ధనలక్ష్మీ ఈ నెల మొదటి వారంలోనే గొత్తికోయగూడేనికి వెళ్లి పోసమ్మను సామాజిక ఆస్పత్రిలో చేరాలని సూచించింది. అరుునా, ఆమె వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పోసమ్మకు రక్తస్రావం అవుతుండడంతో గోగుపల్లి నుంచి 108లో ఆస్పత్రికి తరలించారు. అనార్యోగంతో ఉన్న మరో బిడ్డను పిల్లల ఆస్పత్రికి తరలించగా, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. -
మతిస్థిమితం లేని మహిళ ప్రసవం
జనగాం క్రాస్‌రోడ్డు(సూర్యాపేటరూరల్) :మానవత్వం మరిచి హీనంగా ప్రవర్తించారు..మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యురాలిని ఓ కా మాంధుడు గర్భవతిని చేశాడు.. అభం శుభం తెలి యని ఆ మహిళ పట్ల అనాగరికంగా ప్రవర్తించాడు.. ఫలితంగా ఆ దీనురాలు రోడ్డుపక్కనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సూర్యాపేట పట్టణ శివారు జనగాం క్రాస్‌రోడ్డులో ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల శ్రీనువాస్‌రెడ్డి రోజు మాదిరిగానే విధులకు వెళ్తూ టిఫిన్ చేసేందుకు జనగాం క్రాస్‌రోడ్డులో హోటల్ వద్ద ఆగాడు. ఇదే సమయంలో హోటల్ పక్కనే ఓ చెట్టు కింద చిన్నపిల్లను చేతులో పట్టుకుని ఒంటరిగా కూర్చొని ఉంది. దీంతో స్థానికుల సహకారంతో ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా....ఆమె ఖమ్మం జిల్లా నెమలి గ్రామం అని చెప్పడంతో పాటు తన పేరు విజయలక్ష్మి అని, తాను తన భర్తతో గొడవ పడి ఆరు సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నట్టు సమాచారం. ఇంతకు ముందు మరొకరు సంతానం ఉన్నట్లు చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పిన ఆమె పూర్తి స్థాయి వివరాలు చెప్పలేకపోతుంది. ఆమె సంవత్సర కాలంగా జనగాం క్రాస్‌రోడ్డులో గల హోటల్ల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కార్యదర్శి శ్రీనువాస్‌రెడ్డి పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మతిస్థిమితం లేని మహిళను, ఆమె కూతురును వైద్యసేవలు అందించేందుకు 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యసేవలు అందించిన అనంతరం పూర్తి వివరాలు తెలిసేంత వరకూ ఏదైనా అనాథాశ్రమంలో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.ఆమెను గమనించిన స్థానికులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఆమె కూతురును పెంచుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. తాను తన పిల్లను ఇవ్వనంటూ కూతురిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. -
రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
అన్నవరం : నిత్యం రైళ్ల రాకపోకలతో.. ప్రయాణికుల రణగొణ ధ్వనులతో దద్దరిల్లే అన్నవరం రైల్వేస్టేషన్ శనివారం సాయంత్రం ఆస్పత్రిగా మారింది. ఓ మహిళకు పురుడుపోసింది. రైల్వేస్టేషన్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఆస్పత్రి సిబ్బందిగా మారారు. ప్రయాణికులు, ఇతర ఉద్యోగులు అవసరమైన వస్తువులను సమకూర్చారు. వీరి సహకారంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నిండు గర్బిణి అన్నవరం రైల్వేస్టేషన్లో దిగింది. రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి ఓవర్‌బ్రిడ్జి మీదుగా నడుస్తూ వచ్చి అక్కడ సిమెంట్ బెంచీ మీద కూర్చుంది. సాయంత్రం 4:30 గంటల సమయానికి ఆమెకు నొప్పులు రావడంతో గట్టిగా కేకలు వేసింది. రైల్వేస్టేషన్ మహిళా సిబ్బంది, ప్రయాణికులు ఆమెను గమనించి దగ్గరలోని రైల్వేక్వార్టర్ల నుంచి దుప్పట్లు, చీరలు తెచ్చి ఆమెకు కప్పి దగ్గరలోని వెయిటింగ్ రూమ్ బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లారు. వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో ఆమె పాపకు జన్మనిచ్చింది. అదే సమయంలో అంబులెన్సు కూడా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అంబులెన్సు సిబ్బంది సుధాకర్, అప్పలరాజు తదితరులు ఆమెను, పాపను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రీనివాసరెడ్డి, నాయుడు, జీఆర్పీ జి.లోవరాజు, ప్రయాణికులు రూ.వేయి నగదు, రెండు దుప్పట్లు, పది చీరలు, జాకెట్లను ఆ మహిళకు అందచేశారు. ఆమె స్వస్థలం ఉప్పాడ మండలం పల్లిపేట ఈసందర్భంగా ఆ మహిళ తన పేరు గోనె దుర్గాభవానీ అని, తనది ఉప్పాడ కొత్తపల్లి మండలం పల్లిపేట గ్రామమని, తన అత్త వారి ఊరు ధవళేశ్వరమని చెప్పినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. భర్త పేరు సాయి అని రాజమండ్రి రైల్వేస్టేషన్లో పళ్లు అమ్ముతాడని, ప్రస్తుతం భర్త తనతో ఉండడం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమెకు కుడి చేయి, మోచేయి వరకు మాత్రమే ఉంది. ఓ ప్రమాదంలో ఆ చెయ్యి సగం వరకూ తెగిపోయినట్లు చెప్పిందని వివరించారు. సత్యదేవుని దర్శనార్థం అన్నవరం వచ్చానని చెప్పినట్టు రైల్వేస్టేషన్ సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.