మనూరు: 108లో మహిళ ప్రసవించిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఇకర్‌పల్లి గ్రామానికి చెందిన షాజిబేగానికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమెను అంబులెన్స్‌లో కరస్‌గుత్తి పీహెచ్‌సీకి తరలించగా అక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మోర్గి మోడ్ దగ్గరకు రాగానే మహిళ 108 లోనే ప్రసవించిందని పైలెట్ జగన్నాథం, ఈఎంటీ కాశీనాథ్‌లు తెలిపారు. కాగా తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు.
108లో మహిళ ప్రసవం
Published Sat, Oct 8 2016 6:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
Advertisement
Advertisement