![Vadinamma Serilal Actress Priyanka Naidu Blessed With baby Girl - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/24/priyanka.jpg.webp?itok=h6CWJt_e)
టాలీవుడ్ బుల్లితెర నటి ప్రియాంక నాయుడు పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. వదినమ్మ సీరియలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక.. బుల్లితెర నటుడు మధుబాబును ప్రేమ వివాహం చేసుకున్నారు. మంగమ్మ గారి మనవడు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మధుబాబు.. ఆ తర్వాత అక్కాచెల్లెల్లు, అభిషేకం సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. గతంలో సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
(ఇది చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!)
ఇన్‌స్టాలో రాస్తూ..' మా హృదయాలను ఆనందంతో నింపడానికి ఒక సరికొత్త చిన్న పాప వస్తోంది. దివి నుంచి మా జీవితాలలోకి పంపబడిన స్వర్గంలోని చిన్న తార. మీ అందరి ప్రేమ, మద్దతు పట్ల మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. మీ ప్రార్థనలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విలువైన సమయాన్ని మన ఎంజెల్‌తో అస్వాదిస్తాం' అంటూ షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందలు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment