Priyanka Naidu
-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి!
టాలీవుడ్ బుల్లితెర నటి ప్రియాంక నాయుడు పండంటి బిడ్డకు జన్మినిచ్చింది. వదినమ్మ సీరియలతో గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక.. బుల్లితెర నటుడు మధుబాబును ప్రేమ వివాహం చేసుకున్నారు. మంగమ్మ గారి మనవడు సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన మధుబాబు.. ఆ తర్వాత అక్కాచెల్లెల్లు, అభిషేకం సీరియల్స్‌తో ఫేమ్ తెచ్చుకున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. గతంలో సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రియాంక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. (ఇది చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి.. కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి చార్లీ!) ఇన్‌స్టాలో రాస్తూ..' మా హృదయాలను ఆనందంతో నింపడానికి ఒక సరికొత్త చిన్న పాప వస్తోంది. దివి నుంచి మా జీవితాలలోకి పంపబడిన స్వర్గంలోని చిన్న తార. మీ అందరి ప్రేమ, మద్దతు పట్ల మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. మీ ప్రార్థనలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విలువైన సమయాన్ని మన ఎంజెల్తో అస్వాదిస్తాం' అంటూ షేర్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by G madhu (@actor__madhubabu) -
దుర్గ పోరాటం
ప్రస్తుతం సమాజంలో మహిళలపై ఎటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. దుర్గ అనే ఓ మహిళ వాటిని ఎలా అరికట్టారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక దుర్గ’.ప్రియాంకా నాయుడు టైటిల్ రోల్లో ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ–‘‘మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను దుర్గ ఎలా ఎదుర్కొన్నారు. వాటి నిర్మూలనకు ఏ విధంగా కృషి చేశారన్నది ఆసక్తికరం.ప్రివ్యూ చూసినవారందరూ సినిమా బాగుందని అభినందించడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మేం చేసిన మంచి ప్రయతాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని చిత్ర సమర్పకుడు గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, నిర్మాత రాంబాబు నాయక్ అన్నారు. -
ఎదిరించే శక్తి
ప్రియాంకా నాయుడు ప్రధాన పాత్రధారిగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్ నిర్మించిన చిత్రం ‘అనగనగా ఒక దుర్గ’. గడ్డంపల్లి రవీందర్ సమర్పకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రప్రదర్శనకు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అతిథిగా హాజరయ్యారు. ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ– ‘‘ప్రతిఘటన, ఒసేయ్ రాములమ్మ’ చిత్రాల స్ఫూర్తితో మా చిత్రాన్ని రూపొందించాం. మహిళలపై జరిగే దాడులను ఎదిరించే శక్తిలా దుర్గ పాత్ర ఉంటుంది. సినిమాను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఆడపిల్లలను రక్షించుకోవాలనే సందేశం ఇచ్చాం. మా సినిమా చూసేందుకు వచ్చిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు’’ అన్నారు రాంబాబు నాయక్. ‘‘ఈ చిత్రం స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు రావాలి’’ అన్నారు అతిథిగా హాజరైన దర్శకుడు ఎన్. శంకర్. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ. -
ఓ యువతి పోరాటం
సమాజంలో జరుగుతున్న అఘాయిత్యా లపై ఓ సామాన్య యువతి ఎలాంటి పోరు చేసిందనే కథాంశంతో రూపొం దిన చిత్రం ‘అనగ నగా ఒక దుర్గ’. ప్రకాశ్ పురిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్, అంజి యాదవ్ నిర్మించిన ఈ చిత్రంలో క్రాంతికుమార్, ప్రియాంకా నాయుడు నటిం చారు. సమకాలీన అంశానికి వాణిజ్యపంథా జోడించి చిత్రం తీసినట్లు దర్శకుడు చెప్పారు.