ఎదిరించే శక్తి | Anagana oka Durga film show | Sakshi
Sakshi News home page

ఎదిరించే శక్తి

Published Mon, Aug 28 2017 1:13 AM | Last Updated on Tue, Oct 2 2018 3:16 PM

ఎదిరించే శక్తి - Sakshi

ఎదిరించే శక్తి

ప్రియాంకా నాయుడు ప్రధాన పాత్రధారిగా ప్రకాష్‌ పులిజాల దర్శకత్వంలో రాంబాబు నాయక్‌ నిర్మించిన చిత్రం ‘అనగనగా ఒక దుర్గ’. గడ్డంపల్లి రవీందర్‌ సమర్పకుడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రప్రదర్శనకు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అతిథిగా హాజరయ్యారు.

ప్రకాష్‌ పులిజాల మాట్లాడుతూ– ‘‘ప్రతిఘటన, ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రాల స్ఫూర్తితో మా చిత్రాన్ని రూపొందించాం. మహిళలపై జరిగే దాడులను ఎదిరించే శక్తిలా దుర్గ పాత్ర ఉంటుంది. సినిమాను త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఆడపిల్లలను రక్షించుకోవాలనే సందేశం ఇచ్చాం. మా సినిమా చూసేందుకు వచ్చిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గారికి కృతజ్ఞతలు’’ అన్నారు రాంబాబు నాయక్‌. ‘‘ఈ చిత్రం స్ఫూర్తితో మరిన్ని చిత్రాలు రావాలి’’ అన్నారు అతిథిగా హాజరైన దర్శకుడు ఎన్‌. శంకర్‌. ఈ చిత్రానికి సంగీతం: విజయ్‌ బాలాజీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement