
Comedian Thagubothu Ramesh Blessed with a Baby Girl: టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ మరోసారి తండ్రి అయ్యారు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్ పేర్కొన్నాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.
కాగా సినిమాల్లో తాగుబోతు పాత్రలతో ఫేమస్ అయిన తాగుబోతు రమేష్ 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.