thagubothu ramesh
-
రెండోసారి తండ్రైన కమెడియన్ తాగుబోతు రమేష్..
Comedian Thagubothu Ramesh Blessed with a Baby Girl: టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ మరోసారి తండ్రి అయ్యారు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్ పేర్కొన్నాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. కాగా సినిమాల్లో తాగుబోతు పాత్రలతో ఫేమస్ అయిన తాగుబోతు రమేష్ 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. View this post on Instagram A post shared by Thagubothu Ramesh (@thagubothramesh) -
గజదొంగల నవ్వులు
‘‘హౌస్ అరెస్ట్’ సినిమా స్టార్ట్ కావడానికి కారణం అనూప్ రూబెన్స్. చిన్నపిల్లల సినిమా ఫుల్ కామెడీతో చేయాలని చెప్పాడు. అలా ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. పిల్లల దృష్టి కోణంలో సాగే ఈ చిత్రంలో ఆరంభం నుంచి చివరి వరకు నవ్వులు ఉంటాయి. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ఇది’’ అని డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, తాగుబోతు రమేష్, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో ‘90ఎంఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకులు చంద్రమహేష్, ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని, ‘హౌస్ అరెస్ట్’ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘హౌస్ అరెస్ట్’ సినిమాని అందరూ చూసి ఎంజాయ్ చేయాలి’’ అన్నారు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇందులో సప్తగిరి, నేను, రఘు, రమేష్ గజదొంగలుగా నటించాం. కడుపుబ్బా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ‘‘లాక్డౌన్ తర్వాత నేను ఒప్పుకున్న తొలి చిత్రమిది. కచ్చితంగా హిట్ సాధిస్తాం’’ అన్నారు సప్తగిరి. -
దసరా సరదాలు
-
కామెడీ కామెడీగా...
బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ‘తాగుబోతు’ రమేశ్ ముఖ్య తారలుగా శ్రీకర్ బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. క్లీన్ యు సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉంది. కామెడీ మేజర్ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు శ్రీకర్ బాబు. ‘‘ఫస్ట్ కాపీ రెడీ అయింది. డైరెక్టర్ శ్రీకర్ బాబు సినిమాను చాలా చక్కగా చిత్రీకరించారు’’ అన్నారు నిర్మాత మాధవి. -
ఇప్పుడు తెలుగు సినిమాలే సెంటరాఫ్ ఎట్రాక్షన్!
‘‘హారర్ సినిమాలను అంతగా ఇష్టపడను. మాములుగా దెయ్యాలంటే మనుషులు భయపడుతుంటారు. కానీ, మా ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంలో మాత్రం మనుషులకు దెయ్యాలు భయపడతాయి. డైరెక్టర్ మహి చెప్పిన ఈ పాయింట్ ఎగై్జటింగ్‌గా అనిపించింది’’ అన్నారు తాప్సీ. ఆమె ప్రధాన పాత్రలో వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్, తాగుబోతు రమేశ్ కీలక పాత్రల్లో మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆనందోబ్రహ్మ’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా తాప్సీ చెప్పిన విశేషాలు... ► స్టార్టింగ్ టు ఎండింగ్ ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో నటించడంతోనే నా పనైపోయిందనుకోను... ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాను. అది నటిగా నా బాధ్యత. ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు. అందుకే నా వంతుగా మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. సినిమా చేసేటప్పుడు నా సలహాలను డైరెక్టర్ మహి.వి. రాఘవ్ గౌరవించారు. నేను కూడా ఆయన దగ్గర కొన్ని దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నా. ► ఒకప్పుడు నేను చేసిన తమిళ, తెలుగు చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. అందుకే క్యారెక్టర్, స్క్రిప్ట్ పరంగా రాజీపడకూడదనుకున్నాను. హిందీలో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేస్తూ కొంత కాలం తీరిక లేకుండా ఉన్నాను. అలా అని హిందీలోనే యాక్ట్ చేస్తానని కాదు.. అక్కడ సినిమాల పరంగా నాకు కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. తెలుగు సినిమాలను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు తెలుగు సినిమాలు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ► ప్రస్తుతం హిందీలో ‘జుడ్వా 2’ చేస్తున్నాను. తమిళంలో ఓ సినిమా చేద్దామనుకుంటున్నాను. ‘ఆనందోబ్రహ్మ’ సినిమా ఫలితం కోసం ఎగై్జట్‌గా ఎదురు చూస్తున్నాను. తెలుగులో మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. నాకు క్రీడలంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో ఎవరైనా క్రీడాకారుల జీవిత చరిత్రలో నటించే అవకాశం వస్తే వదులుకోను. -
హాస్యానికి నంది
► తాగుబోతు రమేశ్‌కు అవార్డు ► అమ్మానాన్నలే మొదటి గురువులు ► ఉత్తమ హాస్యనటుడిగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ► 150 చిత్రాల్లో ప్రతిభ చాటుకున్న నటుడు కోల్‌సిటీ(రామగుండం) : సర్.. ఒక్క ఛాన్సివ్వండి.. నేనేంటో చూపిస్తా అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోదావరిఖనికి చెందిన తాగుబోతు రమేశ్... నంది అవార్డుకు ఎంపికయ్యాడు. ఒక్కఛాన్స్ సర్... అంటూ స్టూడియోల చుట్టూ తిరిగిన సింగరేణి గని కార్మికుడి కొడుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు... చుక్క మందు కూడా తీసుకోని అతను ఒక్క సన్నివేశమైనా పెడితే బాగుండని డైరెక్టర్లు ఫోన్ చేసి పిలిపించుకునే స్థాయికి ఎదిగాడు... చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో... కాలే కడుపుతో కళను నమ్ముకుని ఎలాగైనా నటిస్తాను... నా నటనతో నవ్విస్తానని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో తాగుబోతు రమేశ్ పండించిన హాస్యానికి అబ్బురపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఉత్తమ హాస్యనటుడిగా గుర్తిస్తూ నంది అవార్డుకు ఎంపిక చేసింది. ఇదీ ఫ్యామిలీ... రామిళ్ల చినవెంకటి ఉరఫ్ పొట్లరాములు–రాజమ్మ దంపతులు ఉద్యోగరీత్యా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని హనుమాన్‌నగర్‌లో నివాసం ఉన్నారు. వీరికి నలుగురు కుమారులు, కూతురు సంతానం. వెంకటయ్య ఆర్జీ–1 పరిధిలోని 2వ గనిలో మెకదామ్గా పని చేసి రిటైర్ అయ్యాడు. పెద్ద కుమారుడు కుమార్ తండ్రి వారసత్వ ఉద్యోగాన్ని శ్రీరాంపూర్‌లో సింగరేణి కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు సదానందం హాస్టల్ వార్డెన్‌గా పని చేస్తున్నాడు. మూడో కొడుకు వెంకటస్వామి గోదావరిఖనిలో ఉంటున్నాడు. నాలుగో కొడుకైన రమేశ్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీస్‌లో తాగుబోతు రమేశ్గా ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. ఇటీవలనే స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అమ్మా, నాన్నలే గురువులు... సింగరేణి బొగ్గుబాయిలో పనిచేసే రమేశ్ తండ్రి వెంకటి అలిసిపోయి మద్యం తాగి ఇంటికి వస్తే... తండ్రిని అనుసరిస్తూ తల్లిని ఆటపట్టించడానికి, రమేశ్ చేసిన అల్లరి చేష్టలకు రాజమ్మ మురిసిపోయేది. భలే చేసినవురా కొడుకా... ఇంకోసారి సెయ్యిబిడ్డ సూత్త అంటూ ప్రోత్సహించేది. రమేశ్‌లో తెలియకుండానే ఈ నటన నాటుకుపోయింది. ఎక్కడ స్టేజీ ఫోగ్రాం ఉంటే అక్కడ రమేశ్ ప్రత్యక్ష్యమయ్యేవాడు. తాగుబోతు నటనకు అందరూ చప్పట్లతో అభినందించేవారు. కానీ రమేశ్ చుక్క మందు తీసుకోడు. మిత్రుల ప్రోత్సాహంతో ఈ నటననే సినిమా ఇండస్ట్రీ వైపు రమేశ్‌ను నడిపించింది. పదేళ్ల క్రితం ఇండస్ట్రీ వైపు... సినిమా పిచ్చే రమేశ్‌ను ఇండస్ట్రీకి నడిపించింది. ఈ పిచ్చితోనే ఎలాగైనా సినిమాలో ఛాన్స్ కొట్టాలని 2006లో హైదరాబాద్‌కు వెళ్లాడు. రాత్రిళ్లు పార్ట్‌టైం పనులు చేస్తూ... పగలంతా ఫిలిం ఇండస్ట్రీలలో తన నటనను డైరెక్టర్లకు చూపించడానికి కాలిబాటలో తిరిగాడు. రోడ్ల పక్కన తాగుబోతులు, మానసిక రోగులు పడుతున్న ఇబ్బందులు చూసిన రమేశ్... రూంకెల్లాక వారిని అనుసరిస్తూ ప్రాక్టిస్ చేసేవాడు. మిత్రుల ముందు వాటిని ప్రదర్శిస్తూ వారెలా ఫీలవుతున్నారో గమనించేవాడు. అక్కినేని ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఎన్నో కష్టాలు పడి చివరికి డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన మహాత్మ చిత్రం ద్వారా తన నటనను రంజిపజేయడంతో, ప్రపంచానికి కొత్త అనుభూతిని పంచే హాస్యనటుడిగా పరిచయమయ్యాడు. సుమారు 150కు పైగా సినిమాల్లో ప్రతిభ తాగుబోతు రమేశ్గా ఇప్పటికీ సుమారు 150కు పైగా తెలుగు సినిమాల్లో నటించాడు. జగడం, మహాత్మ, భీమిలి కబడ్డి జట్టు, అలా మొదయ్యింది, పిల్లజమిందార్, ఈగ, రచ్చ, రొటీన్లవ్ స్టోరీ, చిత్రాలు బెస్ట్ హాస్యనటుడిగా గుర్తింపు వచ్చింది. అలాగే జగడం, గొడవ, నామనసుకు ఏమైంది, ఈ వయసులో, అప్పలరాజు, వాంటెడ్, అహానాపెళ్లంట, ఎస్ఎంఎస్, కెమెరామెన్ గంగతో రాంబాబు, డమరుకం, 100% లవ్, సుడిగాడు, ఇష్క్, షాడో, శ్రీనువైట్ల దర్శకత్వంలో బాద్షా, అరుపు, దశమి, దళం, చదువుకోవాలి, కూల్బాయ్స్ హాట్గాళ్స్, జీనియస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తదితర అనేక సినిమాల్లో రమేశ్ నవ్వులు కురిపించాడు. పవన్‌కళ్యాణ్, రాంచరణ్, శ్రీకాంత్, నానీ, రామ్ తదితర నటులు, కృష్ణవంశీ, రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకుల సినిమాల్లో రమేశ్ నటించాడు. హాస్యం, మిమిక్రీతోపాటు పాటలుకూడా పాడుతున్నాడు. ఇష్క్ సినిమాలో కోడివాయ లచ్చమ్మదీ...,అతడు ఆమె ఓ స్కూటర్ సినిమాలో.. బస్టాప్ శరణం గచ్ఛామి... అనే పాటలు పాడాడు. -
రేపే నా పెళ్లి.. మీరంతా రండి!
ఇన్నాళ్లుగా అందరినీ తన తాగుబోతు పాత్రలతో అలరిస్తున్న తాగుబోతు రమేష్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భిక్కనూర్ ప్రాంతానికి చెందిన గోసు సత్యనారాయణ చిన్న కుమార్తె స్వాతిని అతడు గురువారం పెళ్లి చేసుకుంటున్నాడు. రమేష్ కూడా తమ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కావడం గమనార్హం. తన పెళ్లికి అందరూ రావాలని ఫేస్‌బుక్‌లోని తన అఫీషియల్ పేజి ద్వారా అందరినీ ఆహ్వానించాడు. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ముద్రించిన శుభలేఖలను కూడా అందరికీ ఫేస్బుక్ ద్వారా పంచాడు. రామిళ్ల వెంకటయ్య, రాజమ్మలకు చిన్న కుమారుడైన రమేష్.. సినిమాల్లో ఎప్పటినుంచో ఉన్నా, 'అలా మొదలైంది' సినిమాలో తాగుబోతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రతో బాగా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమాలో తాగుబోతు పాత్రలే పోషించాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీ వరలక్ష్మి గార్డెన్స్‌లో ఉదయం 8.22 గంటలకు రమేష్, స్వాతిల పెళ్లి జరగనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్లో శనివారం రాత్రి 7.30 గంటల నుంచి రిసెప్షన్ ఇస్తున్నారు. -
తాగుబోతు రమేశ్ హీరోగా...
తాగుబోతు పాత్రలకు చిరునామా అనిపించుకున్న తాగుబోతు రమేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తాగుబోతు ఆర్జీవీ’. రమేశ్ సరసన మేఘనా పటేల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో త్రిశూల్ దర్శకత్వంలో ఎన్.ఎం. కాంతారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా తాగుబోతు రమేశ్ మాట్లాడుతూ - ‘‘తాగుబోతు పాత్రల ద్వారా పేరు తెచ్చుకున్న నేను ‘ఏకే రావు పీకే రావు’ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఇప్పుడు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కన్నడంలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించాననీ, తెలుగులో ఇది తొలి చిత్రమని దర్శకుడు తెలిపారు. కథ నచ్చి, ఈ చిత్రం నిర్మిస్తున్నానని ఎన్.ఎం. కాంతారావు తెలిపారు. అలీ, పృధ్వీ, పోసాని, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఓంకార్ త్యాగరాజ్, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: సినీటెక్ సూరి, ఎడిటింగ్: నాగేంద్ర. -
తాగుబోతు... నా పేరుకి ట్యాగ్‌లైన్ మాత్రమే
తాగుబోతు రమేష్.. సినీ నటుడు అనే ట్యాగ్‌లైన్ అవసరంలేని వ్యక్తి. నిజ జీవితంలో మద్యానికి దూరంగా ఉండే రమేష్ తెరపై మాత్రం తాగుబోతుగా నటనను అదరగొట్టేస్తాడు. తాగుబోతునే ఇంటిపేరుగా మార్చుకున్న ఈ కరీంనగర్ కుర్రోడి స్పెషల్ ఇంటర్వ్యూ.. - సాక్షి, సిటీప్లస్ మా ఊళ్లో వినాయక చవితి వేడకలకు వేదికలపై నేను చేసిన మిమిక్రీ, నాటకాలను చూసి మా ‘ఘంటసాల సింగర్’ శంకరన్న- ‘రమేష్ నువ్వు చేసే తాగుబోతు యాక్షన్ అచ్చం హిందీ నటుడు కేస్టో ముఖర్జీ చేసినంత సహజంగా ఉంది. నువ్వు సినిమాల్లోకి వెళ్తే ‘కిక్’ అవ్వడం ఖాయం’ అనేవాడు. శంకరన్న అంటే ఘంటసాల పాటలు పాడడంలో ఫేమస్. ఆయన మాటలే నన్నిక్కడి వరకూ నడిపించాయి. లేకపోతే...ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని ఏడవ తరగతి కుర్రాడు ఈరోజు ఇన్ని సినిమాల్లో నటించే అవకాశాన్ని పొందడం చిన్న విషయం కాదు. నాన్నను చూసి... ఇప్పటికీ కనిపించిన ప్రతి ఒక్కరూ ‘మీకు తాగుడు అలవాటు లేదు కదా! మరి అంత సహజంగా ఎలా నటిస్తున్నారు?’ అని అడుగుతారు. ఈ నటనకు మా నాన్నే గురువు. ఆయన బాగా తాగేవాడు. ఆయన స్థానంలో ఉంటే ఎవరైనా ఆ పనే చేస్తారేమో. ఎందుకంటే నాన్న సింగరేణి ఉద్యోగి. ఇప్పుడంతా పెద్దపెద్ద మిషన్లు వచ్చాయి కాబట్టి బొగ్గుబావుల్లో పని కాస్త తేలికైంది. అప్పుడలా కాదు.. 300 మంది తట్టలు పట్టుకుని ఒకేసారి బావిలోకి దిగేవారు. పది కిలోమీటర్లు లోపలికి నడుచుకుంటూ వెళ్లేవారు. అక్కడి నుంచి తట్టలతో బొగ్గుని మోసుకొచ్చేవారు. చాలా రిస్కీ జాబ్. బొగ్గుబావుల్లో పనిచేసే వారు, బార్డర్లో పనిచేసే వారు నా దృష్టిలో ఒకటే. బావిలో దిగేవారు పైకి, బోర్డర్లో ఉండేవారు ఇంటికి వచ్చేవరకు డౌటే. బావిలోకి దిగాక నాన్న చేసే పని చాలా కష్టమైంది. ఆ శ్రమను మరిచిపోయేందుకే తాగేవాడు. నాన్న రోజూ తాగొచ్చి ఇంట్లో ప్రవర్తించే తీరుని నేను బాగా గమనించేవాడ్ని. అదే నా నటనకు ట్రైనింగ్ అనుకోండి. అమ్మను నవ్విస్తూ... నాన్న ఇంట్లో లేనపుడు ఆయన తాగినపుడు ప్రవర్తనను ఇమిటేట్ చేసి అమ్మకు, అన్నయ్యలను చూపించేవాడ్ని. అందరూ సూపర్‌గా చేశావంటూ మెచ్చుకునేవారు. అలా సరదాగా చేసిన నటనే ఈ రోజు నాకు నట జీవితాన్నిచ్చింది. మేం నలుగురం అన్నదమ్ములం. ఒక చెల్లి. నేను నాలుగోవాడ్ని. చెల్లి పెళ్లి చేశాక హైదరాబాద్ వచ్చేశాను. వస్తూనే బతకడం కోసం కొన్నాళ్లు సెక్యురిటీగార్డ్గా పనిచేశాను. తర్వాత అక్కినేని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందాను. కొన్నాళ్లు స్టిల్ ఫొటోగ్రాఫర్ వెంకీ దగ్గర పనిచేశాను. మెల్లగా చిన్న చిన్న పరిచయాలతో జగడం సినిమాలో.. ఆపై మహాత్మ చిత్రంలో చాన్స్‌లు దక్కాయి. బాగా గుర్తింపు వచ్చింది మాత్రం ‘అలా మొదలైంది’ సినిమాతో. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. తాగుబోతు రమేష్ అంటే ఇండస్ట్రీలో, తెలుగు ప్రేక్షకుల్లో తెలియని వారు లేరు. కేవలం ఒక క్యారెక్టర్‌తో ఫేమస్ అయిన నటులు చాలామంది ఉన్నారు కానీ, ఒక్కటే క్యారెక్టర్ని నమ్ముకుని బతుకుతున్న యాక్టర్‌ని నేనొక్కడినే!. మొదట్లో నాకు మద్యం అలవాటు లేదంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ నేను ఇంట్లో నాన్నను చూశాక మద్యం జోలికి వెళ్లకూడదనుకున్నాను. అమ్మ కోరికా అదే. తాగి నడపొద్దు భయ్యా.. అన్నట్టు- ఈ రోజు ఇయరెండ్ కదా.. రాత్రికి ఫుల్ ఎంజాయ్మెంట్.. ఓకే.. ఎంజాయ్ చేయడం తప్పుకాదు. కానీ దానివల్ల మనకు, మనవల్ల ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. డ్రింక్ చేసి వాహనాలు అసలు నడపొద్దు. వామ్మో...దొరికితే రెండు నెలలు జైలుశిక్ష. అవసరమా భయ్యా! జైఆలోచించండి. డ్రైవర్ని పెట్టుకోండి. లేదంటే...ఇంటి దగ్గరే సెలబ్రేషన్ చేసుకోండి. -
ఏకే రావ్ పీకే రావ్ ప్రేస్ మీట్
-
ఎకె రావ్ - పికె రావ్ మూవీ స్టిల్స్