ఇన్నాళ్లుగా అందరినీ తన తాగుబోతు పాత్రలతో అలరిస్తున్న తాగుబోతు రమేష్.. ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భిక్కనూర్ ప్రాంతానికి చెందిన గోసు సత్యనారాయణ చిన్న కుమార్తె స్వాతిని అతడు గురువారం పెళ్లి చేసుకుంటున్నాడు. రమేష్ కూడా తమ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు కావడం గమనార్హం. తన పెళ్లికి అందరూ రావాలని ఫేస్బుక్లోని తన అఫీషియల్ పేజి ద్వారా అందరినీ ఆహ్వానించాడు. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ముద్రించిన శుభలేఖలను కూడా అందరికీ ఫేస్బుక్ ద్వారా పంచాడు.
రామిళ్ల వెంకటయ్య, రాజమ్మలకు చిన్న కుమారుడైన రమేష్.. సినిమాల్లో ఎప్పటినుంచో ఉన్నా, 'అలా మొదలైంది' సినిమాలో తాగుబోతు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రతో బాగా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి దాదాపు ప్రతి సినిమాలో తాగుబోతు పాత్రలే పోషించాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీ వరలక్ష్మి గార్డెన్స్లో ఉదయం 8.22 గంటలకు రమేష్, స్వాతిల పెళ్లి జరగనుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో శనివారం రాత్రి 7.30 గంటల నుంచి రిసెప్షన్ ఇస్తున్నారు.
రేపే నా పెళ్లి.. మీరంతా రండి!
Published Wed, May 27 2015 3:35 PM | Last Updated on Thu, Jul 26 2018 12:31 PM
Advertisement
Advertisement