
కామెడీ కామెడీగా...
బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ‘తాగుబోతు’ రమేశ్ ముఖ్య తారలుగా శ్రీకర్ బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై దగ్గుబాటి వరుణ్ సమర్పణలో మాధవి అద్దంకి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘అవుట్‌పుట్ బాగా వచ్చింది. క్లీన్ యు సర్టిఫికెట్ రావడం ఆనందంగా ఉంది. కామెడీ మేజర్ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు శ్రీకర్ బాబు. ‘‘ఫస్ట్ కాపీ రెడీ అయింది. డైరెక్టర్ శ్రీకర్ బాబు సినిమాను చాలా చక్కగా చిత్రీకరించారు’’ అన్నారు నిర్మాత మాధవి.