మానవ మృగం.. ఆరేళ్ల చిన్నారిపై | Molestation on Six Years old Baby Girl in Karnataka | Sakshi
Sakshi News home page

మానవ మృగం

Dec 13 2019 8:03 AM | Updated on Dec 13 2019 8:03 AM

Molestation on Six Years old Baby Girl in Karnataka - Sakshi

దేశంలో అత్యాచారాలపై సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో రాష్ట్రంలోనూ అటువంటి దారుణాలు సంభవిస్తున్నాయి. పసిమొగ్గ అనే కనికరం లేకుండా చిదిమేశాడో మృగాడు. ఈదారుణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

బనశంకరి/ హుబ్లీ: అభంశుభం ఎరుగని ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి ఒడిగట్టాడు. బెళగావి జిల్లాలోని కాకతి పోలీస్‌స్టేషన్‌ పరి«ధిలో జరిగింది. అకృత్యంతో ఆగ్రహం చెందిన ప్రజలు కోర్టు వద్ద కామాంధున్ని చితక్కొట్టారు. వివరాలు.. బెళగావి తాలూకా కడోలి గ్రామంలో బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికను సునీల్‌ బాలు బాలనాయక్‌  (26) అనే యువకుడు ఆడిస్తానని తన వెంట తీసుకెళ్లాడు. సమీపంలోని పొలంలో నిర్మానుష్యంగా ఉన్న ఇంట్లోకి తీసుకువెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దుండగునిపై అనుమానం వచ్చిన బాలిక తండ్రి ఆ ఇంటికి వెళ్లగా ఘోరం బయటపడింది. పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే గ్రామానికి చేరుకున్న కాకతి పోలీసులు కామాంధుడు సునీల్‌ను అరెస్ట్‌ చేసి, బాలికను జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతోచికిత్సనందిస్తున్నారు. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

నిందితునిపై ప్రజల దాడి  
కాగా, నిందితునిపై గురువారం బెళగావి నగర కోర్టు ఆవరణలో గ్రామప్రజలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకొస్తుండగా ప్రజలు ఆగ్రహంతో దాడి చేశారు. పోలీసులు ప్రజలను అదుపు  చేయడానికి కొంచెం కష్టపడ్డారు. కొందరిని అదుపులోకి కూడా తీసుకొన్నారు. దీనిపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో కూడా చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement