
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గాయని సైంధవి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో వారి కుటుంబంలో ఆనందం నెలకొంది. పలువురు ప్రముఖులు జీవీ ప్రకాష్, సైంధవి దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, జీవీ ప్రకాష్.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఆయన 2013లో తన చిన్ననాటి స్నేహితురాలైన.. గాయని సైంధవిని వివాహం చేసుకున్నారు. పలు హిట్ మూవీలకు సంగీతం అందించిన జీవీ ప్రకాష్.. నటుడిగా కూడా మెప్పించారు. తెలుగులో వచ్చిన ప్రేమ కథా చిత్రం.. తమిళ రీమేక్ ‘డార్లింగ్’తో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఓ వైపు మ్యూజిగ్ డైరక్టర్ కొనసాగుతూనే.. నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
చదవండి : జీవీ సోదరి బిజీబిజీ
Comments
Please login to add a commentAdd a comment