
టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి మరోసారి తండ్రి అయ్యారు. గురువారం ఆయన సతీమణి మనీషారెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో సందీప్‌రెడ్డి కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా, సందీప్‌రెడ్డి 2014లో మనీషాను వివాహంచేసుకున్నారు. సందీప్, మనీషా దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. తన తొలి చిత్రం అర్జున్‌రెడ్డి పేరునే ఆయన తన కుమారుడికి పెట్టుకోవడం విశేషం.
టాలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన సందీప్.. అర్జున్‌రెడ్డి చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే సందీప్ సంచలనాలు సృష్టించారు. ఆ తర్వాత అర్జున్‌రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్‌లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
Comments
Please login to add a commentAdd a comment