ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య?  | Telangana: 2 of 3 Missing Woman Found Dead In River In Jagtial District | Sakshi
Sakshi News home page

Jagtial Crime News: ముగ్గురు స్నేహితురాళ్ల ఆత్మహత్య? 

Published Fri, Oct 29 2021 4:18 AM | Last Updated on Fri, Oct 29 2021 7:41 AM

Telangana: 2 of 3 Missing Woman Found Dead In River In Jagtial District - Sakshi

మల్లిక, గంగాజల, వందన (ఫైల్‌)  

జగిత్యాలక్రైం: ఒకే రోజు ముగ్గురు స్నేహితురాళ్లు మృత్యువాత పడటం జగిత్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. జగిత్యాల శివారులోని ఉప్పరిపేటకు చెందిన గంగాజల(19), మల్లిక (19), వందన (16) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులే కాక బంధులు కూడా. వీరిలో గంగాజల, మల్లికలకు ఈ ఏడాది ఆగస్టులో వివాహం కాగా, వందన ఇంటర్‌ చదువుతోంది. ఏం జరిగిందో తెలియదుకాని, ఈ ముగ్గురు గురువారం ఉదయం పట్టణ శివారులోని చెరువులో విగత జీవులుగా తేలారు.

వివరాలిలా ఉన్నాయి.. కొద్దిరోజులుగా మల్లిక అనారోగ్యంగా ఉండటంతో తండ్రి రాజం 10 రోజుల క్రితం ఆమెను పుట్టింటికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలోనే గంగాజల కూడా వారం క్రితం తల్లిగారింటికి వచ్చింది.  బుధవారం సాయంత్రం మల్లిక, గంగాజల, వందన షాపింగ్‌కు వెళుతున్నామని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లారు. రాత్రయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు.
(చదవండి: ప్రతి వెయ్యికి 23 మంది)

గురువారం ఉదయం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే క్రమంలో ధర్మసముద్రం చెరువులో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి చూడగా మొదట మల్లిక, గంగాజల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో రెండు గంటల తర్వాత వందన మృతదేహం కూడా దొరికింది.

కాగా, ముగ్గురూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారా, లేదా ఎవరైనా ఒకరు ఆత్మహత్య చేసుకోబోతుండగా రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లిక, గంగాజల వివాహమైన రెండు నెలలకే మృతిచెందడంతో వారి తల్లిగారింటితో పాటు అత్తగారింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

అనారోగ్యమంటూ ఫిర్యాదులు: అనారోగ్యంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మల్లిక తండ్రి రాజం ఫిర్యాదు చేయగా.. గంగాజల తండ్రి భూమ య్య కూడా కొద్దిరోజులుగా తన కూతురు ఆరోగ్యం బాగా లేదని బాధపడుతూ ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్నేహితులు ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో రక్షించే ప్రయత్నంలో నీటిలో పడి తన కూతురు మృతిచెంది ఉండొచ్చని వందన తండ్రి కొమురయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
(చదవండి: నాకిక ఓపిక లేదు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement