రాయికల్ (జగిత్యాల): రైతు సమస్యలు, సింగరేణి కార్మికుల ఇబ్బందులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్ ఎంపీలు విఫలమయ్యారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోనే ప్రధానమైన రైతాంగం, సింగరేణి కార్మికుల సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన ఎంపీలు శీతాకాల సమావేశాలను బహిష్కరించడం ఏమిటని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్..ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పదం చేసుకుని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ప్రతీబిల్లుకు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు రైతాంగ, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment