
రాయికల్: అహంకారంతో సీఎం ప్రధాని పర్యటనలో పాల్గొనకపోవడం.. రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆయన జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా పార్టీలకు అతీతంగా స్వాగతం పలకడం సంప్రదాయమ ని ఆయన స్పష్టం చేశారు.
విపక్ష సీఎంలు స్టాలిన్, మమతబెనర్జీలు సైతం తమ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించినప్పుడు స్వాగ తం పలికి.. రాష్ట్రాభివృద్ధిపై నిలదీస్తారని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరై రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 9 మండలాలు ఆంధ్రలో కలిసినప్పుడు సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment