
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కూలీలను చికిత్స నిమిత్తం మెట్‌పల్లి సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముత్తమ్మ(45), రాజు(55), జెల్లా పోషాని(50) అనే ముగ్గరు కూలీలు మృతి చెందారు. మిగతా ఇద్దరు కూలీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కూలీల మృతిలో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment