NREGA workers
-
మండుటెండలోనూ తప్పని పని.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు కూలీలను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే వేసవి భృతి, మజ్జిగ పంపిణీ వంటి అదనపు సౌకర్యాల్లో కోత పెట్టిన కేంద్రం తాజాగా మరో ఇబ్బందికర నిర్ణయం తీసుకుంది. ఇకపై రెండు పూటల పని విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రాష్ట్రాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీనిని కూలీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాగైతే పనికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: కలెక్టర్ చెట్టు కింద కూర్చోలేరుగా: సుప్రీంకోర్టు ఇప్పటికే వేసవి భృతి రద్దు జిల్లా వ్యాప్తంగా ఉపాధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కూలీలు చేసిన పనిని కొలతలు ఆధారంగా లెక్కించి రోజుకు రూ.245 వేతనం చెల్లించాలి. అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నాలుగైదు గంటల పాటు కష్టపడుతున్నా సగటు కూలి రూ.150 నుంచి రూ.190 మధ్యనే లభిస్తోంది. ఎండాకాలంలో పనులు చేసే కూలీలకు వేసవి భత్యం కింద మూడు నెలల పాటు సగటున 25 శాతం వేతనం అదనంగా చెల్లించాలి. అయితే ఈ పథకం కేంద్రం అ«దీనంలోకి వెళ్లినప్పటి నుంచీ వేసవి భృతిని రద్దు చేశారు. దీంతో వేతనం గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. రెండు పూటలా సాధ్యమా? ఉపాధి పనులు ప్రస్తుతం ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జాబ్ కార్డు కలిగిన కూలీల కుటుంబాల వారికి కేటాయించిన 100 రోజుల పని దినాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విధిగా పనులకు హాజరు కావాలి. ఎంత మంది పనులకు వచ్చారనే విషయాన్ని ఉపాధి హామీ పథకం మేట్లు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం మరోసారి మస్టర్లో నమోదు చేయాలి. ఇప్పటికే స్థానికంగా పనులు లేక కొన్ని గ్రామాల్లోని కూలీలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. చదవండి: జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ కీలక ఆదేశాలు రెండు పూటల పని విధానంతో గ్రామం నుంచి మండల పరిధిలోని నాలుగు కిలోమీటర్ల వరకూ రెండుసార్లు తిరగలేక కూలీలు పని ప్రదేశంలోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పటి వరకూ ఉదయం ఉపాధి పనికి వెళ్లినా.. మధ్యాహ్నం నుంచి వ్యవసాయ పనులు, పశువుల పెంపకం ద్వారా వారు కొంత ఆదాయం పొందేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదని కూలీలు వాపోతున్నారు. ఈ పరిణామం ఉపాధి పనులకు వచ్చే కూలీలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విస్తృతంగా పనులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో కేంద్రం విధించిన ఇటువంటి నిబంధనలు కూలీలకు శరాఘాతంగా మారనున్నాయి. కేంద్రం కొత్తగా ఇచ్చిన ఈ జీఓను రద్దు చేయాలని కూలీలు డిమాండు చేస్తున్నారు. కేంద్ర నిబంధనలు పాటిస్తున్నాం ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో నడుస్తోంది. కొత్త ఉత్తర్వులను ఏప్రిల్ 1 నుంచి తప్పకుండా అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ఇక నుంచి రెండు పూటలా పని చేయాలి. అప్పుడే కూలీల ఖాతాల్లో పూర్తి వేతనం జమ అవుతుంది. కచ్చితంగా పని చేయాలని మేం బలవంతం చేయడం లేదు. ఉదయం, సాయంత్రం మస్టర్ అంటే కొంత ఇబ్బందే. భవిష్యత్తులో కూలీల సంఖ్య తగ్గే అవకాశం కూడా ఉంటుంది. – ఎ.ముఖలింగం, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
ఎస్సీ, ఎస్టీ ఉపాధి కూలీలకు వేరుగా వేతనాలు
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. వీరిని ఎస్సీ, ఎస్టీ, ఇతర తరగతుల వారీగా విభజించి, వారు చేసిన పనికి ఎప్పటికప్పుడు వేతనాలను వేర్వేరుగా విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా ఒకేరోజు.. ఓ గ్రూపులో ఉంటూ, ఒకే పనిచేసిన కూలీలందరికీ ఒకేసారి కాకుండా ఎస్సీ కూలీలకు ఒకసారి, ఎస్టీ సామాజికవర్గం వారికి మరోసారి, ఇతరులకు ఇంకో విడతలో కూలీ డబ్బులు విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఇతరుల వారీగా పే ఆర్డర్లను తయారుచేసి కేంద్రానికి పంపుతున్నాయి. ఆ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ ఉత్తర్వులు పేదల మధ్య చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు, అధ్యక్షులు దడాల సుబ్బారావులు ఓ ప్రకటనలో తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుని పాత పద్ధతిలోనే అందరికీ ఒకేసారి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ సంఘం ప్రతినిధులు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి వినతిపత్రం అందజేశారు. చదవండి: వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస ‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’ -
వేసవిలో ఉపాధి కూలీలకు ‘డ్రై సీజన్ అలవెన్స్’
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ఎండల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ‘డ్రై సీజన్ అలవెన్స్’చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జూన్ 30 వరకు ఉపాధి కూలీలు ఈ అలవెన్స్‌ను పొందనున్నారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి 25 శాతం, ఏప్రిల్/మేలలో 30 శాతం, జూన్‌లో 20 శాతం మేర ఈ అలవెన్స్ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎండా కాలంలో వేడి పెరగడం వల్ల చేసే పని తగ్గి ఆ మేరకు వారికొచ్చే కూలీ తగ్గే అవకాశాలున్నందున ఈ అలవెన్స్‌ను వర్తింపజేస్తారు. వేసవిలో ప్రధానంగా పైన పేర్కొన్న కాలంలో ఇచ్చే కూలీకి అనుగుణంగా చేయాల్సిన పని శాతాన్ని ఈ అలవెన్స్‌లో పేర్కొన్న మేర తగ్గిస్తారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ప్రతులను http:// www. rd. telangana. gov. in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఉపాధికి రూ.139.59 కోట్ల అదనపు నిధులు.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద అయిన ఖర్చుల కోసం రూ.139.59 కోట్ల మేర అదనపు నిధులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. ఇదివరకే ఇచ్చిన బడ్జెట్ విడుదల ఉత్తర్వులకు కొనసాగింపుగా అదనపు నిధులకు పాలనపరమైన అనుమతినిస్తూ సందీప్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఉపాధి’కి భరోసా..‘హరితహారం’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ఉపాధి హామీ కూలీలకు ధీమాను కల్పిస్తోంది. వచ్చేనెలలో చేపట్టనున్న ఐదో విడత హరితహారంలో భాగంగా 83.30 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. తద్వారా ఉపాధి కూలీలకు తగినంతగా పనులు కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ పథకం కింద కూలీలకు వందరోజుల పనిదినాలు కల్పించి పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో వాటి సంరక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. కిలోమీటరు దూరానికి ఒక్కో ఉపాధి కూలి... ఐదో విడతలో దాదాపు 10 లక్షల మంది ఉపాధి కూలీలకు మొక్కల పెంపకంలో వందరోజుల పనిదినాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల వ్యవసాయ భూముల్లో నాటే ఒక్కో మొక్కకు నెలకు రూ.5 వంతున ఇచ్చి వాటి సంరక్షణకు బాటలు వేయాలని నిర్ణయించారు.. రహదారి వెంట నాటిన మొక్కల రక్షణకు ఒక్కో ఉపాధి కూలీకి కిలోమీటరు దూరం చొప్పున బాధ్యతలు అప్పగించి, రోజుకు రూ. 211 సగటు వేతనంగా చెల్లిస్తారు. మొక్కల పెంపకంతో ఉపాధి కూలీలకు కావాల్సినంత పని కల్పించడంతో పాటు హరితహారం లక్ష్యాన్నీ సాధించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతదాకా 19.4 లక్షల కుటుంబాలకు చెందిన 31.2 లక్షల మంది కూలీలకు పని కల్పించారు, ఈ ఏడాదికి గాను 12 కోట్ల పని దినాల కల్పనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాది రాష్ట్రంలో ఎక్కువ పని రోజులు కల్పించిన నేపథ్యంలో ఈ మేరకు కేంద్రం పని రోజులను పెంచింది. 2019–20 లో భాగంగా జూన్ 4వ తేదీ వరకు 5.7 కోట్ల పని దినాలు రూ. 147 సగటు వేతనంతో పని కల్పించి, మొత్తం రూ. 947.2 కోట్లు వెచ్చించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి గత ఆర్థిక సంవత్సరంలోనే అ«ధిక పనులు చేసిన రికార్డు రాష్ట్రంలో నమోదైంది.గతేడాది కూలీలకు రూ. 148.4 సగటు వేతనంతో 11.2 కోట్ల పని దినాలు కల్పించారు. 25.2 లక్షల కుటుంబాలకు చెందిన 42.4 లక్షల మంది కూలీలకు పని దొరికింది. రూ. 3,027 కోట్లు ఖర్చు చేశారు. కూలీలకు వేతనాలుగా రూ. 1706.1 కోట్లు, రూ. 1042.9 కోట్లు పరికరాల కోసం కేటాయించారు. -
‘ఉపాధి’లో అక్రమాలు
సాక్షి,రేగులచెలక(ప్రకాశం) : కూలీలకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకులు చేతివాటం చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. మండలంలోని రేగులచెలకలో యంత్రాలతో పనులు చేయించి కూలీలు పనులకు రాకున్నా మస్టర్లు వేసి కూలి నగదు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు కూలీలు ఒక్కొక్కరు ముందుగా రూ.100 వంతున చెల్లిస్తే ఆరు రోజుల కూలీగా రూ.600 ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. పనికి రాకుండా కూలీ చెల్లించడంతో ఎన్నికలలో ఓటు పరంగా కూడా లబ్ధి పొందొచ్చనేది టీడీపీ నాయకుల ఆలోచన. ఈ ఒప్పందంలో భాగంగా రేషన్ షాపు బినామీ డీలర్ అడియారం తిరుమలకొండయ్య కూలీల నుంచి నగదు వసూలు చేశారు. దాదాపు రూ.25 వేల నగదు కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఆపై గ్రామానికి తూర్పు వైపున రాళ్లవాగు సమీపంలో ఉన్న చిట్టోడి కుంటలో యంత్రాల ద్వారా పనులు చేయించారు. పొక్లెయిన్‌తో నేలనుతవ్వి, ఆపై చదును చేసి మట్టిని కువ్వగా పోసి కూలీలతో పనులు చేయించినట్లు చూపించే ప్రయత్నం చేశారు. యంత్రాలతో తీసుకెళ్లి కుప్పగా పోసిన మట్టి యంత్రాల ద్వారా పని చేయించినందుకు రూ.6 వేలు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన నగదు టీడీపీ నాయకులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అధికార పార్టీ నాయకుల అక్రమాలను నియంత్రించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీఓ జి.రాంబాబును స్థానిక ‘సాక్షి’ విలేకరి వివరణ కోరగా యంత్రాలతో పనులు చేపడితే బిల్లులు చెల్లింపులు నిలిపేస్తామని వివరించారు. -
మట్టిపెళ్లలు పడి ముగ్గురి మృతి
సాక్షి, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌లో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. దీంతో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కూలీలను చికిత్స నిమిత్తం మెట్పల్లి సామాజిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముత్తమ్మ(45), రాజు(55), జెల్లా పోషాని(50) అనే ముగ్గరు కూలీలు మృతి చెందారు. మిగతా ఇద్దరు కూలీలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కూలీల మృతిలో గ్రామంలో విషాదం నెలకొంది. -
నరేంద్ర మోదీకో ఐదు రూపాయలు
రాంచి: జార్ఖండ్‌లోని లతేహార్ ప్రాంతంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న 300 గ్రామీణ కుటుంబాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మే ఒకటవ తేదీన వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈసారి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మున్నెన్నడూ లేని విధంగా బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిపామని చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకం కింద రోజుకు చెల్లించే దినసరి వేతనాన్ని కేవలం ఐదు రూపాయలు పెంచడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. ‘మీ వద్ద నిధులు లేక కేవలం ఐదు రూపాయలను పెంచినట్టున్నారు. ఇదిగో మేము తలా ఓ ఐదు రూపాయలను మీకు విరాళంగా అందజేస్తున్నాము. ఇవి తీసుకోని ఉపాధి హామీ పథనం నిధులు పెంచుకోండి’ అని కార్మిక కుటుంబాలు వ్యంగ్యంగా విమర్శిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖకు ఐదు రూపాయల నోటును జతచేసి పంపించాయి. ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని ఏ నెలంతా కొనసాగిస్తామని కార్మిక కుటుంబాలు తెలిపాయి. ఉపాధి హామీ పథకం కింద గతేడాది వరకు ఇచ్చిన దినసరి వేతనాన్ని 162 రూపాయల నుంచి 167 రూపాయలకు కేంద్ర ప్రభుత్వం పెంచింది. జార్ఖండ్‌తోపాటు బీహార్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో దినసరి వేతనాన్ని 162, 159 రూపాయల నుంచి 167కు పెంచుతూ గత మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జార్ఖండ్‌లో కనీస కార్మిక వేతనం 212 రూపాయలు ఉండగా, దానికన్నా 45 రూపాయలు తక్కువగా ఉపాధి హామీ పథకం కింద చెల్లిండం ఏమిటని కార్మికలోకం ప్రశ్నిస్తోంది. కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో ఈ సొమ్ము ఏ మూలకు సరిపోతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో 11 లక్షల మంది కార్మికులు ఉపాధి హామీ పథకం కింద రోడ్డు, చెరువులు, బావుల నిర్మాణపు పనుల్లో పాల్గొంటున్నారు. వారికి ఏడాదికి వంద రోజుల పని దినాల్ని కల్పిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 43 శాతం మంది మహిళలు ఉండగా, 37 శాతం మంది గిరిజనులే ఉన్నారు. 2014లో ఈ పథకం కింద 20 రూపాయలు పెంచగా, గతేడాది 4 రూపాయలు, ఈ ఏడాది ఐదు రూపాయలు పెంచారని, ఈ పెంపులో ఎలాంటి తర్కం లేదని నరేగ సహాయత కేంద్రానికి చెందిన కార్యకర్త జేమ్స్ హెరెంజ్ వ్యాఖ్యానించారు. ఒడిశా రాష్ట్రంలోనైతే ఈ సారి ఒక్క పైసా కూడా పెంచలేదని, వారికి ఇప్పటికే ఇస్తున్న డబ్బులు ఎక్కువని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉందని జేమ్స్ విమర్శించారు. తమ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇతర జిల్లాల నుంచి ఐదు రూపాయలు జత చేసిన లేఖలను మోదికి పంపిస్తామని కార్మికులు తెలిపారు.