100 మంది ప్రయాణికులకు తప్పిన ముప్పు
జగిత్యాల క్రైం: వందమందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఉన్నట్టుండీ ఊడిపోయిన సంఘటనలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా రాయికల్ ప్రధాన రహదారిపై శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడంతో.. ఒకేసారి రెండు వెనుక టైర్లు ఊడిపోయాయి. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జగిత్యాల నుంచి ఖానాపూర్ వెళ్తోంది.
సుమారు 100 మంది ప్రయాణికులున్న బస్సు జగిత్యాల రూరల్ మండలం చల్గల్–మోరపల్లి శివారు చేరగానే.. బస్సు వెనుక కుడివైపు రెండు టైర్లు ఊడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బస్సు కుదుపునకు గురికావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు. ఎవరికేమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరో బస్సును రప్పించి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment