
హైదరాబాద్,సాక్షి: సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ల నిర్ణయాలకు కాలపరిమితిని నిర్ధేశించిన సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆదివారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
పాలనలో అడ్డంకులు సృష్టించడానికి బీజేపీ,కాంగ్రెస్ జాతీయ పార్టీలు లెక్కలేనన్ని సార్లు గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశాయి. అసెంబ్లీ స్పీకర్లచే రాజ్యాంగ దుర్వినియోగాన్ని కూడా.. సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి నిర్ణయించాలని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Welcome the Hon’ble Supreme Court’s decision to set a timeline for decisions of Governors
Countless times, both BJP and Congress have abused the institution of Governor to create hindrances in Governance
Supreme Court should also take into cognisance the rampant abuse of… https://t.co/Oj2hTA2hWd— KTR (@KTRBRS) April 13, 2025