governor
-
‘కూటమి’ కుట్రలు.. గవర్నర్‌కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరింది. అనంతరం రాజ్‌భవన్ బయట పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.ఇటీవల గంగాధర నెల్లూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని పనులు తెలుగుదేశం వారికే చేయాలి.. వైఎస్సార్సీపీ వారికి ఏ పనీ చేయకూడదు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లేనంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ సమదృష్టితో పాలనను అందిస్తానంటూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు, దానికి విరుద్దంగా చేసిన వ్యాఖ్యలపై తక్షణం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రజాస్వామిక స్పూర్తికి వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో సంక్షేమాన్ని అందుకునే లబ్దిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాలతో అర్హతను బట్టి పథకాలను వర్తింపచేస్తారని, కానీ చంద్రబాబు మాత్రం ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని, కొందరి పట్ల వివక్ష చూపించాలంటూ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చంద్రబాబులా మాట్లాడలేదన్నారు.రాష్ట్రంలోని ఏ రాజకీయపార్టీ అయినా వారి సిద్ధాంతాలు, విధానాల ప్రకారం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మొత్తం ప్రజలకు మేలు చేసేలా పనిచేయాలన్నదే వారి లక్ష్యంగా పెట్టుకుంటారని అన్నారు. ఏ పార్టీ అయినా వ్యక్తిగత ఏజెండాతో పనిచేయవని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు దానికి భిన్నంగా చేసిన వ్యాఖ్యలు, ఆయన అనుసరిస్తున్న విధానాలపై తక్షణం స్పందించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. సామాన్యుల అవసరాలకు కూడా రాజకీయ పార్టీ రంగు పులమడం దారుణమన్నారు.ప్రతిపక్ష పార్టీగా ప్రజల ప్రయోజనాల కోసమే వైఎస్సార్సీపీ.. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ మెడలు వంచి ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, చివరికి జర్నలిస్ట్‌లపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగు నాగార్జున, విడదల రజనీ, కారుమూరు వెంకట నాగేశ్వరరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు వున్నారు. -
రాజ్యాంగ ఉలంఘనకు పాల్పడిన చంద్రబాబు
-
ఫైటింగేల్ ఆఫ్ ఇండియా..! ఆ ముగ్గురే..
కోకిల పాడుతుందని అంటారు. మరి, కోకిల పాటలు వింటుందా? 1949 మార్చి 1 రాత్రి సరోజినీ నాయుడు తనకు చికిత్స చేస్తున్న నర్సును పిలిచి పాట పాడమని కోరారని అంటారు. ఆ పాటే ఆమెను నిద్రపుచ్చిందట! సరోజినిని గాంధీజీ ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అన్నారు. సరోజిని ఎప్పుడైనా పాటలు కూడా పాడారేమో! గాంధీజీ అన్నది మాత్రం ఆమె కవిత్వం గురించి! ఆ కవిత్వంలోని భావయుక్తమైన లాలిత్యం ఆయనకు ఉద్యమ పోరాట గానంలా అనిపించి ఉండాలి. అలాగైతే ఆమెను ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు.సరోజినీ నాయుడుకి, ఈ ఏడాదికి ఒక ‘చారిత్రకత’ ఉంది. అలాగే ఈ యేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి, సరోజినీ నాయుడి ఆశయానికి ఒక ‘సారూప్యం’ ఉంది. ఇక నేడైతే (2, మార్చి) సరోజినీ నాయుడు ఈ లోకానికి ‘వీడ్కోలు’ చెప్పిన రోజు. రాజకీయ కార్యకర్తగా, మహిళా హక్కుల ఉద్యమ నేతగా, అంతిమ క్షణాల వరకు జీవితాన్ని ప్రేమించిన మనిషిగా ఆమె నుంచి స్ఫూర్తిగా తీసుకోవలసినవి ఈ మూడు సందర్భాలూ! చారిత్రకత (1925–2025)ఈ ఏడాది డిసెంబర్ 28కి, భారత జాతీయ కాంగ్రెస్‌కు 140 ఏళ్లు నిండుతాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి సరిగ్గా 100 ఏళ్ల క్రితం 1925లో అధ్యక్షురాలయ్యారు సరోజినీ నాయుడు. స్వాతంత్య్రోద్యమాన్ని నడుపుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు అప్పటివరకు ఒక భారతీయ మహిళ అధ్యక్షురాలిగా లేరు. తొలి మహిళా అధ్యక్షురాలు అనీబిసెంట్ (1917) అయితే, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆ తర్వాత నెల్లీ సేన్‌గుప్తా (1933) అధ్యక్షురాలయ్యారు. మొత్తం మీద స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులు అయింది ముగ్గురే మహిళలు.సరోజినీ నాయుడుకు ముందరి ఏడాది 1924లో మహాత్మా గాంధీ జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఇద్దరి మధ్య వయసులో పదేళ్ల వ్యత్యాసం. ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ల స్నేహం. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ఇద్దరిదీ దాదాపుగా సమానమైన భాగస్వామ్యం. గాంధీజీని తొలిసారిగా 1914లో లండన్‌లో చూశారు సరోజిని. తనే ఆయన్ని వెదుక్కుంటూ వెళ్లి కలిశారు. ఆయన్ని చూసీ చూడగానే ఆమెకు నవ్వొచ్చింది. ‘‘బక్కపల్చని మనిషి, నున్నటి గుండు. నేల మీద కూర్చొని.. చిదిపిన టమాటా ముక్కలు, ఆలివ్ నూనె కలిపి తింటూ కనిపించారు. ఒక ఉద్యమ నాయకుడు ఇలా వినోదాత్మకంగా కనిపించడంతో పగలబడి నవ్వాను..’’ అని సరోజిని ఆ తర్వాత ఒక చోట రాసుకున్నారు. తనను చూసి ఆమె నవ్వగానే : ‘‘అయితే నువ్వు సరోజినీ నాయుడివి అయుండాలి. ఇలా ప్రవర్తించే ధైర్యం వేరే ఎవరికుంటుంది?’’ అంటూ ఆమెను నవ్వుతూ పలకరించారు గాంధీజీ! అప్పటికే ఈ జాతీయవాద ఉద్యమ యువ నాయకురాలి గురించి ఆయన విని ఉన్నారు. 1917 తర్వాత ఆమె గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో చేరారు. సారూప్యం (1930 ఉప్పు సత్యాగ్రహం–2025 విమెన్స్ డే థీమ్)ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన థీమ్.. ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్ : రైట్స్. ఈక్వాలిటీ. ఎంపవర్ మెంట్ (మహిళలు, బాలికలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత). ఈ థీమ్‌కు, జాతీయవాద ఉద్యమంతో సమాంతరంగా సరోజినీ నాయుడు నడిపిన మహిళా హక్కుల పోరాటానికీ చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. సరోజిని కవయిత్రి. స్త్రీవిద్యను ప్రోత్సహించే క్రమంలో ఆమె మంచి వక్తగా కూడా అవతరించారు. ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం.. రెండూ, మహిళా ఉద్యమానికి పదును పెట్టాయి. విద్యతోనే హక్కులు, సమానత్వం, సాధికారత సిద్ధిస్తాయని ఆమె ప్రబోధించారు. మహిళల చురుకైన సహకారం లేకుండా జాతీయవాద ఉద్యమం ముందుకు సాగలేదని ధైర్యంగా గాంధీజీకే చెప్పారు! ఇందుకొక ఉదాహరణ : ఉప్పు సత్యాగ్రహం లాంటి కార్యక్రమాలలో పాల్గొనడం మహిళలకు కఠినంగా ఉంటుందని భావించిన గాంధీజీ సుమారు 70 మంది మగవాళ్లతో కలిసి దండి యాత్రకు వెళుతున్నారు. ఈలోపు సరోజినీ నాయుడు నాయకత్వంలో కొందరు మహిళలు ఆ ఊరేగింపులోకి వచ్చి చేరారు! అనుకోని ఆ పరిణామానికి గాంధీజీ ముచ్చట పడ్డారు తప్ప ఆశ్చర్యపోలేదు. అసలు మహిళలు వాడే ఉప్పుకు సంబంధించిన సత్యాగ్రహాన్ని మగవారికి వదిలేయడం ఏమిటన్నది సరోజినీ నాయుడు ప్రశ్న. వీడ్కోలు (2, మార్చి 1949)దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఆమె ఉత్తరప్రదేశ్ (నాటి యునైటెడ్ ప్రావిన్సెస్) గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్‌గా ఉండగానే 1949లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ముందు రోజు రాత్రి ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. తీవ్రమైన తలనొప్పి. ఉపశమన చికిత్స చేశారు. ఆ కొద్ది సేపటికే కుప్పకూలి పోయారు. మర్నాడు కన్నుమూశారు. మరణానంతరం గోమతి నది ఒడ్డున సరోజిని అంత్యక్రియలు జరిగాయి. ‘‘జీవితం ఒక పాట. పాడండి. జీవితం ఒక ఆట. ఆడండి. జీవితం ఒక సవాలు. ఎదుర్కొండి. జీవితం ఒక కల. నిజం చేసుకోండి. జీవితం ఒక త్యాగం. అర్పించండి. జీవితం ఒక ప్రేమ. ఆస్వాదించండి..’’ అంటారు సరోజిని. అయితే వీటన్నిటికీ కూడా పోరాట పటిమ అవసరం అని కూడా తన కవితల్లో చెబుతారు ఈ ‘ఫైటింగేల్’ ఆఫ్ ఇండియా. (చదవండి: నెస్ట్..ఆర్కిటెక్చర్లో బెస్ట్..!) -
గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఆయనను ఒహియో గవర్నర్ అభ్యర్థిగా బలపరుస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో వివేక్‌ను కొనియాడుతూ పోస్టు చేశారు. ‘గొప్ప రాష్ట్రమైన ఒహియో గవర్నర్ పదవికి వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. నాకు వివేక్ బాగా తెలుసు. అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అధ్యక్ష అభ్యర్థిగా నాతో పోటీ పడ్డాడు. అమెరికాను ప్రేమించే వ్యక్తి వివేక్. అతడు ఒహియోకు గొప్ప గవర్నర్ అవుతాడు. వివేక్‌కు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా’అని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. VIVEK RAMASWAMY is running for Governor of the Great State of Ohio. I know him well, competed against him, and he is something SPECIAL. He’s Young, Strong, and Smart! Vivek is also a very good person, who truly loves our Country. He will be a GREAT Governor of Ohio, will never…— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) February 25, 2025వచ్చే ఏడాది జరగనున్న ఒహియో గవర్నర్ ఎన్నికల కోసం వివేక్ రామస్వామి సోమవారం సిన్సినాటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిలియనీర్ ఇలాన్ మస్క్ కూడా వివేక్‌కు మద్దతు ప్రకటించి గుడ్‌లక్ చెప్పడం విశేషం. అయితే వివేక్ ఒహియో గవర్నర్‌గా రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయాలంటే ముందు పార్టీ ప్రైమీరీల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రైమరీల్లో వివేక్‌తో ఇద్దరు రిపబ్లికన్ నేతలు పోటీ పడుతున్నారు. Thank you Elon. Let’s roll! https://t.co/2QDheoUSVj— Vivek Ramaswamy (@VivekGRamaswamy) February 25, 2025 -
ప్రతిపక్షంగా గుర్తించేంత దాకా పోరాటం ఆగదు: YSRCP
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఇటు గవర్నర్ నుంచి, అటు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్ ప్రసంగాన్ని(Governor Speech) వైఎస్సార్సీపీ బాయ్‌కాట్ చేసింది.సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం మొదలైన కాసేపటికే వైఎస్సార్సీపీ(YSRCP) సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైఎస్ జగన్(YS Jagan) నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా బయటకు వచ్చేశారు.సభలో ఉండేది ఒకటి అధికార పక్షం, మరోకటి ప్రతిపక్ష పక్షం. ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుంది. ప్రజల గొంతుక వినపడాలంటే.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వా ల్సిందే. ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం అని వైఎస్సార్సీ ఎమ్మెల్సీ బొత్స అన్నారు.రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. కేంద్రంతో మాట్లాడుతున్నాం.. ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు. మిర్చికి వెంటనే మద్ధతు ధర ప్రకటించాలి. మేం రైతుల తరఫున పోరాడితే కేసులు పెడుతున్నారు. కూటమి గ్యారెంటీ అంటేనే మోసం అని అర్థం అవుతుంది. తొమ్మది నెలలు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీల అమలు నోచుకోలేదు. అందుకే ప్రజా సమస్యలపై ప్రజా క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం అని బొత్స అన్నారు. అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వానికి తాలిబన్లకు పెద్ద తేడా లేదు. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని సీనియర్ నేత పెద్దిరెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా?: MLC వరుదుకల్యాణిఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?నిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారునిత్యావసర ధరలు 60% పెంచారుప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుతొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారుచంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలిపథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారువైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేహోదా ఇచ్చే వరకూ పోరాడుతాం కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోందిప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారునోటీసులు కూడా ఇవ్వకుండా ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?: ఎమ్నెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అసెంబ్లీ సమావేశాల కవరేజ్‌కు సాక్షి(Sakhi TV) సహా పలు ఛానెల్స్‌పై కూటమి ప్రభుత్వం నిషేధం విధించడాన్ని YSRCP సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. -
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన YSRCP నేతలు
-
జగన్ భద్రతపై గవర్నర్ కు ఫిర్యాదు
-
గవర్నర్ తో అసత్యాలు, అబాద్ధాలు చదివించింది కూటమి సర్కార్
-
ఆర్బీఐ కొత్త గవర్నర్.. ఎవరీ 'సంజయ్ మల్హోత్రా'?
-
మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్కర్
ముంబై: బీజేపీ సీనియర్ నేత కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. కొలాంబ్కర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాళిదాస్ కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో సెంబ్లీకి శాశ్వత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. త్వరలో నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.#WATCH | Mumbai: BJP leader Kalidas Kolambkar takes oath as the Maharashtra Assembly Protem Speaker at Maharashtra Raj Bhawan administered by state Governor CP Radhakrishnan in the presence of Maharashtra CM Devendra Fadnavis. pic.twitter.com/IHSA6Ube6z— ANI (@ANI) December 6, 2024కాగా మహారాష్ట్రలో ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మోంశాఖమంత్రి అమిత్ షా సహా బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. -
ఇవాళ సత్యసాయి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
-
రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
గవర్నర్ కుటుంబ సభ్యుల వివరాలను సేకరించిన అధికారులు
-
కేటీఆర్‌పై కేసుకు అనుమతినివ్వండి... గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ బుధవారం అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం వెంట ఉప ముఖయమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నేటి నుంచి ప్రారంభమైన కులగణన వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, సర్వే తీరు, పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు అందించారు.కులగణన అంశంతో తెలంగాణ దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను రేవంత్ ఆహ్వానించారు. -
తొలిసారిగా గవర్నర్ ప్రతిభా అవార్డులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ‘గవర్న ర్ ప్రతిభా అవార్డులు’ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ నిర్ణయించారు. ఈ అవార్డులను వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘గవర్నర్ ఎట్ హోం’కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రదానం చేస్తారని గవర్నర్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఒక్కో అవార్డుకు రూ.2 లక్షలతో పాటు ఒక మెడల్ కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.రాజ్భవ న్లో శుక్రవారం బుర్రా వెంకటేశం విలేకరులతో మాట్లాడుతూ...అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సొసైటీలు, ట్రస్టుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో పనిచేసిన వారు, తెలంగాణేతరులైనా దరఖాస్తు చేసుకోవచ్చని అయితే రాష్ట్రంలో కనీసం ఐదేళ్లు పని చేస్తూ ఉండాలని చెప్పారు. ఈ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 2 నుంచి ఈనెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.నాలుగు విభాగాల నుంచి ఆహ్వానం...దరఖాస్తులను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని బుర్రా వెంకటేశం వెల్లడించారు. https://governor.telangana.gov.in లేదంటే గవర్నర్ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్ – 500041 కు స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా వ్యక్తిగతంగా అన్ని డాక్యుమెంట్లతో పాటు సమర్పించాలని కోరారు. గవర్నర్ ఎంపిక చేసిన కమిటీ అన్ని దరఖాస్తులను పరిశీలించి అవార్డులను ఎంపిక చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటల విభాగం, సాంస్కృతిక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తున్నారు. ఇందులో ఎనిమిది మందికి అవార్డులు ఇవ్వనున్నారు. -
గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నేతలు..
సాక్షి, విజయవాడ: ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వరద బాధితులకు జరిగిన అన్యాయం మీద గవర్నర్‌కు వైఎస్సార్సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వెస్ట్ నియోజకవర్గ ఇంఛార్జి ,మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు,సెంట్రల్ నియోజకవర్గ ఇంఛార్జి మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా,మేయర్ రాయన భాగ్యలక్ష్మి,డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లందుర్గ, వైఎస్సార్సీపీ నేత పూనూరు గౌతమ్ రెడ్డి ఉన్నారు. -
డ్రగ్స్‌కు హబ్‌గా గుజరాత్: తమిళనాడు మంత్రి
అహ్మదాబాద్:గుజరాత్‌పై తమిళనాడు మంత్రి రేగుపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గుజరాత్ డ్రగ్స్‌కు హబ్‌గా మారిందన్నారు.డ్రగ్స్ రవాణాను అదుపు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారన్న గవర్నర్ రవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేగుపతి ఈ వ్యాఖ్యలు చేశారు.గవర్నర్‌కు గుజరాత్ కనిపించడం లేదా ప్రశ్నించారు.నిజానిజాలు తెలియకుండా తమిళనాడు గురించి గవర్నర్ మాట్లాడుతున్నారన్నారు.అసలు గవర్నర్‌కు డ్రగ్స్ కేసులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అన్నాడీఎంకే నేతలను డ్రగ్స్ కేసుల్లో విచారించేందుకుగాను అనుమతివ్వడానికి ఏడాదికిపైగా సమయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఇదీ చదవండి: జిలేబీ నచ్చిందా నాయనా -
‘హైడ్రా’కు చట్టబద్ధత.. ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ గవర్నర్
-
హైడ్రా ఆర్డినెన్స్ అధికారిక ఉత్తర్వులు జారీ
-
గవర్నర్‌ను కలిసిన హీరో నాగార్జున
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం వైజాగ్‌లో ఉన్నారు. అనారోగ్యంతో ఉన్న మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆయన పరామర్శించారు. ఇటీవల ఆయన అస్వస్థకు గురయ్యారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న హరిబాబును కలిసి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ఓ మూవీ షూటింగ్ కోసం విశాఖ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే మీడియాతో మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు.(ఇది చదవండి: మీ హెడ్‌లైన్స్ కోసం మా జీవితాలే దొరికాయా?: నాగచైతన్య)కాగా.. ఇప్పటికే నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సమంత- నాగచైతన్య విడాకులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఈ విషయంపై టాలీవుడ్ సినీ ప్రముఖులంతా మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి వాటిని ఊపేక్షించేది లేదని చిరంజీవి, మంచువిష్ణు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, అల్లు అర్జున్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు.విశాఖ: మిజోరాం గవర్నర్ ను కలిసిన సినీ హీరో అక్కినేని నాగార్జున ఆనారోగ్యంతో బాధపడుతున్న గవర్నర్ హరి బాబుకు నాగార్జున పరామర్శ అనారోగ్యం నుంచి కోలుకుంటున్న హరిబాబుఅక్కినేని తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న హరిబాబు@iamnagarjuna #Vizag #Nagarjuna #Meets #MizoramGovernor pic.twitter.com/fcndH5nFNu— Akhil Raj (@RRajkumar135192) October 3, 2024 -
అప్పుడు ఒకలా.. ఇప్పుడు మరోలా ఎందుకు?: హెచ్డీ కుమారస్వామి
బెంగళూరు: ముడా కుంభకోణంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంపై కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి శనివారం విమర్శలు గుప్పించారు. గవర్నర్ విషయంలో సీఎం సిద్దరామయ్య రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. ‘గతంలో సిద్ధరామయ్య అధికారంలో ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించినందుకు గవర్నర్‌ను ప్రశంసించారు.అదే గవర్నర్ ఇప్పుడు తనపై(సీఎం) ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే సిద్ధరామయ్యతో సహా పార్టీ నేతలందరూ గవర్నర్‌ను అగౌరవపరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో దివంగత హన్సరాజ్ భరద్వాజ్ గవర్నర్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒకలా వ్యవహరించిందని..ప్రస్తుతం థావర్‌చంద్ గెహ్లాట్‌తో భిన్న వైఖరితో ఉందని విమర్శలు గుప్పించారు.‘ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలు అత్యంత అవమానకరంగా ప్రవర్తించారు. గవర్నర్ చిత్రపటానికి చెప్పులు వేసి, దిష్టిబొమ్మలను తగులబెట్టి అవమానించారు. ఇప్పుడు ఎవరిపైకి చెప్పులు విసిరి, ఎవరి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రే తప్పు చేశారు. గతంలో సిద్ధరామయ్య స్వయంగా చెప్పినట్లుగా ప్రభుత్వం నుండి వివరణ కోరడం గవర్నర్ హక్కు. ఆయన ఇప్పుడు తన మాటలను మరచిపోయినట్లున్నారు. అప్పట్లో ఆయన చేసిన సొంత ప్రకటనలను ఆయనకు చూపించాలి’ అని కుమారస్వామి పేర్కొన్నారు.చదవండి: కశ్మీర్లో బీజేపీదే గెలుపు: ప్రధాని మోదీ -
రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
హైదరాబాద్: యువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వ్యక్తుల సౌశీల్యంపై దేశ సౌశీల్యం ఆధారపడి ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రజతోత్సవ వేడుక సభ కు గవర్నర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. నిరంతర అభ్యాసంతోనే పరిపూర్ణత సాధ్యమవుతుందని కార్య్రక్రమానికి హాజరైన విద్యార్థులకు సూచించారు. 1893 సెప్టెంబర్ 11 న చికాగో విశ్వవేదిక సాక్షిగా స్వామి వివేకానంద హిందూ ధర్మ గొప్పతనాన్ని చాటిచెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడవాలని విద్యార్థులకు జిష్ణు దేవ్ వర్మ సూచించారు. ఇరవై ఐదేళ్ళ క్రితం సెప్టెంబర్ 11 న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో నాటి రామకృష్ణ మఠం, మిషన్ జాతీయ సర్వాధ్యక్షుడు స్వామి రంగనాథానంద వివేకానంద ఇన్స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విభాగాన్ని ప్రారంభించారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద చెప్పారు. ఇప్పటివరకు ఇరవై లక్షల మందికి పైగా యువత కు వ్యక్తిత్వ వికాసం, శీల నిర్మాణం, యోగ, ధ్యానం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చామన్నారు. యువతకు విలువలను, నైపుణ్యాలను అందించేందుకు వి.ఐ.హెచ్.ఈ ఇరవై ఐదు ఏళ్లుగా పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమం లో రామకృష్ణ మిషన్, మఠం జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి సుహితానంద, డెక్స్ టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు శరద్ సాగర్, వి.ఐ.హెచ్.ఈ ఫాకల్టీ సభ్యులు, వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూచిపూడి నృత్యకళాకారిణి రాచర్ల నవ్య నేతృత్వంలో బాల్ వికాస్ విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
అభయ కేసు : సీఎం దీదీకి గవర్నర్ హుకుం జారీ
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రి అభయ ఘటన కేసుతో పశ్చిమ బెంగాల్ ఆందోళనతో అట్టుడికిపోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ సీఎం మమతా బెనర్జీకి ఆదేశాలు జారీచేశారు. వెంటనే అత్యవసర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి, సమస్యపై చర్చించాలని ఆదేశించినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.మరోవైపు ఇదే కేసులో కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌పై విమర్శలు వెల్లువెత్తతున్నాయి. వినీత్ గోయల్‌పై వేటు వేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్.. దీదీకి సూచించినట్లు సమాచారం. ఇదీ చదవండి : 25 దేశాలు.. 135 నగరాల్లో ఆందోళనలురాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనకర పరిణామాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలి. మౌనంగా ఉండకూడదు. రాష్ట్రం.. రాజ్యాంగం,చట్టబద్ధమైన పాలనలో పనిచేయాలి. వైద్యురాలి ఘటన కేసులో సమస్యను గుర్తించకుండా, అలసత్వం ప్రదర్శించకూడదు. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను తొలగించాలనే ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి’ అని సీవీ ఆనంద బోస్ ప్రభుత్వానికి ఆదేశించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. #KolkataHorror | #ShaktiFightback The Governor's directives to W.B CM Mamata Banerjee, as per sources: - Hold emergency state cabinet meeting. - Have state cabinet discuss the RG Kar case. - Address demand to replace Kolkata top cop. On the other hand, TMC's… pic.twitter.com/hp84HL0LxR— TIMES NOW (@TimesNow) September 9, 2024 -
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: డీకే శివకుమార్
బెంగుళూరు: గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం(ఆగస్టు) ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడాన్ని శివకుమార్ తప్పుబట్టారు.ఈ విషయంలో సీఎంకు పార్టీ సభ్యులంతా అండగా నిలుస్తారన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ,జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించవన్నారు. -
MUDA Scam: హైకోర్టులో సిద్దరామయ్యకు ఊరట..
బెంగళూరు: తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడం చట్టవిరుద్దమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా.. గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా ప్రేరేపితమైనవన్నారు. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు.మైసూరు నగర అభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. తనను విచారించేందుకు గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని హైకోర్టుకు తెలిపారు.వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆర్డర్‌ను ఆమోదించారని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలు అమలైతే రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందని తెలిపారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారులను నిరోధించేలా ఆదేశించాలని ముఖ్యమంత్రి కోరారు. తనకు మధ్యంతర ఉపశమనం కల్పించకపోతే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని తెలిపారు.సీఎంకు ఊరటముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిస్తూ, ఆరోపించిన ముడా కుంభకోణానికి సంబంధించి ఆయనపై ప్రత్యేక కోర్టులో విచారణను కర్ణాటక హైకోర్టు సోమవారం వాయిదా వేసింది.సిద్ధరామయ్యపై సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. టీజే అబ్రహం వేసిన మరో పిటిషన్‌పై బుధవారం వాదనలు జరగాల్సి ఉంది. ఇప్పుడు, హైకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 29 వరకు జరగదు.అంతకముందు సీఎం మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. భవిష్యత్తులోనూ చేయనని అన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు. ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు బీజేపీ, జేడీఎస్‌లు కుట్ర పన్నాయని మండిపడ్డారు. -
కోల్‌కతా ఘటన: కొనసాగుతున్న ఆందోళనలు.. రేపు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనతో కోల్‌కతా అట్టుడుకుతోంది. ఈ దుశ్చర్యపై దేశ వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు.పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని జూనియర్ వైద్యులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనలో అసలైన దోషులను చట్టం ముందు నిలబెట్టాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. దీంతో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా అవుట్ పేషెంట్ సేవలూ నిలిచిపోయాయి. గవర్నర్ అత్యవసర సమావేశంవైద్యురాలిపై హత్యాచార ఘటనలో ఇప్పటి వరకూ విచారణ వేగవంతం కాకపోవడాన్ని ఆప్ రాజ్యసభ ఎంపీ, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ స్పందించారు. దీనిపై వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాజ్‌భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆనంద బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం అసమర్థత వల్లే ఈ రోజు మహిళలు భయపడుతూ బతుకుతున్నారు’’ అని మండిపడ్డారు. ఈ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.సీబీఐ దర్యాప్తు ముమ్మరంఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా.. ఆర్జీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ దత్‌ను వరుసగాా నాలుగోరోజు విచారిస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్‌కు సైకాలాజికల్ బిహేవియర్ అనాలసిస్ చేశారు. ఆదివారం ఆయన్ను విచారించిన సందర్భంగా సంఘటనకు ముందు, తరువాత చేసిన ఫోన్‌కాల్స్ వివరాలపైనే ప్రశ్నించారు.సుప్రీం విచారణమరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. చీఫ్ జస్టీస్ డివై చంద్రచూడ్ ధర్మాసనం ఈ ఘటనపై మంగళవారం విచారణకు సిద్ధమైంది. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా.. నిందితులను ఉరి తీయాలని మమత బెనర్జీ డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై పద్మ అవార్డు పొందిన 70 మందికి పైగా వైద్యులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోల్‌కతా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆ లేఖలో ప్రధానిని కోరారు. ఇక కోల్‌కతా పోలీసులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 24 వరకు ఆర్జీ కార్ ఆస్పత్రి సమీపంలో నిషేధాజ్ఞలను విధించారు. -
Karnataka: గవర్నర్ V/s సీఎం.. హైకోర్టుకు సిద్దరామయ్య
బెంగళూరు: మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలపై తనను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు దీనిపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు.సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముడా అధికారులు తన భార్యకు భూమి కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవే ఆరోపణలతో సామాజిక కార్యకర్తలు, తదితరులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని జులై 26న ముఖ్యమంత్రికి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ నోటీసులిచ్చారు. ఈ క్రమంలోనే గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం హైకోర్టును ఆశ్రయించారు.కాగా సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక అదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష, బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి..సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.అయితే ఆ ఆరోపణలను సిద్దరామయ్య తోసిపుచ్చారు. అతాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. విచారణ కోసం తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది అని విమర్శించారు. -
MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కర్ణాటకలో ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ కేసులో విచారణ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఈ పరిణామంపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. తనపై విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టానికి విరుద్ధమని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం సీఎం మాట్లాడుతూ..గవర్నర్ చర్యను కోర్టులో ప్రశ్నిస్తానని, తాను రాజీనామా చేసేంత తప్పు ఏం చేయలేదని పేర్కొన్నారు.‘మొత్తం కేబినెట్, పార్టీ హైకమాండ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ రాజ్యసభ ఎంపీలు నా వెంట ఉన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ, జేడీ(ఎస్) చేస్తున్న కుట్ర ఇది’ అని విమర్శించారు.కేబినెట్ అత్యవసర భేటీ..మరోవైపు ఈ వ్యవహారంపై చర్చించేందుకు సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన నేటి సాయంత్రం కర్నాటక కేబినెట్ అత్యవసర సమావేశమవుతోంది. ఇదిలా ఉండగా గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నారు.చదవండి: చిక్కుల్లో సిద్దరామయ్య.. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి -
తెలంగాణ రాజ్ భవన్ లో జెండా ఎగురవేసిన గవర్నర్
-
మమతా బెనర్జీ ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’.. గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీని వ్యక్తి గతంగా గౌరవిస్తానని, ఆమెతో వృత్తి పరమైన సంబంధాలు ఉన్నాయని, అయితే రాజకీయవేత్త మమతా బెనర్జీ.. నాట్ మై కప్ ఆఫ్ టీ’ అని అన్నారు.మమతా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆనంద బోస్ వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన గవర్నర్ల సమావేశం అనంతరం పీటీఐతో జరిపిన ఇంటర్వ్యూలో గవర్నర్ ఆనంద్ బోస్ మాట్లాడారు. మమతా బెనర్జీతో ఉన్న సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు ఆనంద్ బోస్ మాట్లాడారు.మీరు ఏ మమతా బెనర్జీ గురించి అడుగుతున్నారు. నా ముందు ముగ్గురు మమతా బెనర్జీలు ఉన్నారు. ఒకరు వ్యక్తి మమతా బెనర్జీ..ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. రెండవ వ్యక్తి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఆమెతో నాకు వృత్తిపరమైన సంబంధాలు ఉన్నాయి. మూడవ వ్యక్తి రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని వ్యాఖ్యానించారు.వరుస వివాదాలుగత కొంతకాలంగా సీఎం మమతకు..గవర్నర్ ఆనందబోస్ మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ప్రభుత్వం పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆమోదించడం లేదని మమతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతోపాటు రాజ్ భవన్లో ఆనందబోస్ ఓ మహిళాతో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు గుప్పించింది. ఈ వరుస పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనందబోస్ పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై కోల్‌కతా హైకోర్టులో దావా వేశారు. విచారణ చేపట్టిన కోర్టు హైకోర్టు ఆగష్టు 14 వరకు మధ్యంతర ఉత్తర్వులో గవర్నర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే లేదా తప్పుడు ప్రకటన చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. STORY | Concept of passive governor is gone: West Bengal Governor CV Anand BoseREAD: https://t.co/GNKBobRarN pic.twitter.com/niOE5dO3D4— Press Trust of India (@PTI_News) August 4, 2024 -
కోదండరామ్‌కు ఎమ్మెల్సీ వద్దు: గవర్నర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణకు గవర్నర్లు మారుతున్నా గవర్నర్‌కోటా ఎమ్మెల్సీల నియమాక వివాదం కొనసాగుతూనే ఉంది. టీజేఎస్ నేత కోదండరామ్, మీర్ అలీఖాన్‌లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించవద్దని కొత్త గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు కోరారు. ఈ మేరకు జిష్ణుదేవ్‌శర్మకు శుక్రవారం(ఆగస్టు2) వారు ఒక లేఖ రాశారు. ఎమ్మెల్సీల నియమాకం విషయమై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున తుది నిర్ణయం తీసుకోవద్దని లేఖలో కోరారు. కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపిన కోదండరామ్, అలీఖాన్ పేర్లపై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.గతంలో బీఆర్ఎస్ హాయంలో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను గవర్నర్‌కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. దీంతో క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఉందా లేదా అన్న అంశంపై దాసోజు,కుర్ర కోర్టుకు వెళ్లారు. అప్పటిదాకా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎవరినీ నియమించవద్దని కోరారు. -
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, విజయవాడ: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్సు జారీ చేసింది. రూ.1.29 లక్షల కోట్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జారీ చేశారు. నవంబర్ 30వ తేదీ వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం తీసుకొచ్చింది.కాగా, ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు నేటితో (జూలై 31తో) ముగిసింది.సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. -
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. -
నేడు గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ బుధవారం సాయంత్రం 5గంటలకు రాజ్ భవన్లో ప్రమాణ స్వీకా రం చేయనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్, ఆయా పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజవంశీకుడైన ఆయన రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లలో బీజేపీలో చేరారు. 2018–23 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా. జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధా దేవ్‌వర్మ. వర్మను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది.అలాగే ఓంప్రకాశ్ మాథుర్ సిక్కిం గవర్నర్‌గా, హరిభావు కిషన్‌రావు బాగ్డే రాజస్తాన్ గవర్నర్, సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్‌కు, రామెన్ డేకా చత్తీస్‌గఢ్‌కు గవర్నర్లుగా నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు మార్చారు. అలాగే అస్సాం గవర్నర్ గులాబ్‌చంద్ కటారియాను పంజాబ్‌కు మార్చి చండీగఢ్ అడ్మిని్రస్టేటర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా నియమించి మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చా రు. కె.కైలాస్‌నాథ్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు. -
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ లేఖ
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. జూలై 22, 2024న జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం కొన్ని అంశాలపై చేసిన వక్రీకరణలను వైఎస్ జగన్ లేఖలో వివరించారు.ఏపీ అప్పులు, ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చెప్పిన అబద్ధాలను లేఖలో ప్రస్తావించారు. వాస్తవాలను రికార్డులతో సహా లేఖలో వైఎస్ జగన్ తెలియజేశారు. ఎకనామిక్ సర్వే, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కాగ్, ఆర్బీఐ నివేదికల్లోని వాస్తవాలను పొందుపరుస్తూ లేఖ రాశారు. (లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రసంగమంతా చంద్రబాబు భజనే: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు గురించి భజన చేయకుండా..రాష్ట్రంలో జరగుతున్న అరాచకపాలన గురించి మాట్లాడితే బాగుండేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ అన్నారు. తాడేపల్లిలో వైఎస్సాఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ఈ సందర్భంగా తాడిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగమంతా చంద్రబాబు భజనే కనపడింది. ప్రతిపక్ష పార్టీపై దుమ్మెత్తిపోయటానికే సరిపోయిందని మండిపడ్డారు. పోలవరం ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పలేదు. అమరావతి, ప్రత్యేక హోదా గురించి కనీస ప్రస్థావనే లేదని అన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్తారనుకున్నాం. కానీ దాని గురించి మాట్లాడలేదు. మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు గురించి కూడా మాట్లాడలేదు. అంటే హామీలన్నింటినీ తుంగలో తొక్కేసినట్టేనని అర్థం అవుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి గవర్నర్ మాట్లాడకపోవడం దారుణమన్నారు. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి వంద కోట్లు కూడా లేవు. కానీ 2024నాటికి ప్రభుత్వ ఖజానాలో రూ.7 వేల కోట్ల పైనే ఉందన్న తోట చంద్రశేఖర్..ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటి వరకు అములు చేయకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే తప్ప గవర్నర్ వాస్తవాలను మరిచిపోయారు. 2014-19 మధ్యలో 54 సంస్థలను ప్రయివేటుపరం చేశారు.వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అని ధ్వజమెత్తారు.చంద్రబాబుకు లబ్ధి చేకూరేలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహరించడం సర్వసాధారణమైందని వ్యాఖ్యానించారు.షర్మిళ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేయటం సిగ్గుచేటని తెలిపారు.షర్మిల వైఖరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 50 రోజుల్లోనే రాష్ట్రం అరాచకాలకు అడ్డాగా మారిపోయింది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా షర్మిల నోరెందుకు మెదపటం లేదు? చంద్రబాబు కోసమే తప్ప ప్రజల కోసం షర్మిల ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.ఓట్ ఆన్ బడ్జెట్ ఏడు నెలలపాటు నిర్వహించాలనుకోవటం సిగ్గుచేటు.మేనిఫెస్టో పథకాలకు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ఓట్ ఆన్ బడ్జెట్ పెడుతున్నారు. ప్రజాస్వామ్య యుతంగా మేము నిరసనలు తెలిపితే పోలీసులు మాపై దాడి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. అసెంబ్లీలో ప్లకార్డులను చూపిస్తే చంద్రబాబు వణుకిపోతున్నారు. అరాచకాలపై అసెంబ్లీలో నిలదీశాం.ప్రభుత్వం స్పందించలేదనే బాయ్ కాట్ చేశామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
ఆఖరికి.. ఏపీ అసెంబ్లీలోనూ అబద్ధాలు!
అమరావతి, సాక్షి: ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి రాగానే పాలన మీద ఫోకస్ చేస్తుంది. కానీ, చంద్రబాబు మాత్రం శ్వేత పత్రాల పేరుతో, సమీక్షల పేరిట జగన్ పాలనపై నిత్యం నిందలు వేస్తున్నారు. చూస్తుంటే.. ఇలాగే ఐదేళ్లు గడిపిస్తారేమో అనిపించేలా ఉంది ఆయన వ్యవహారం. అయితే తాజాగా అసెంబ్లీ సాక్షిగా.. అదీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించింది కూటమి ప్రభుత్వం.తన పాలనలో ఏనాడూ సంక్షేమం, కనీస మౌలిక వసతుల గురించి పట్టించుకోని చంద్రబాబు.. విజనరీ నాయకుడని, విభజిత ఏపీ అభివృద్ధికి కృషి చేశారని గవర్నర్ ప్రసంగంలో చెప్పించుకున్నారు. అంతేకాదు 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని, పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో అబద్ధపు ప్రసంగాన్ని చదివించారు. వాస్తవానికి.. జగన్ పాలన చేపట్టే నాటికి అభివృద్ధి కుంటుపడి ఉంది. ఆ కారణంగానే 2019లో అధికార మార్పిడి జరిగింది కూడా. అయితే కరోనా లాంటి విపత్తుతో రెండేళ్లు గడిచినప్పటికీ.. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటి మీద ఫోకస్‌తోనే జగన్ పాలన కొనసాగింది. సంబంధిత వార్త: జగన్ వల్లే పెట్టుబడులు పైపైకి..అమరావతిని కొంత మంది పెట్టుబడిదారుల కోసమే చంద్రబాబు తెర మీదకు తెచ్చారు. కానీ, జగన్ అమరావతి సహా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. ఈ మూడింటిలో అమరావతి కూడా ఒక రాజధానిగానే ఉంది కదా!. సంబంధిత వార్త: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు సహేతుకమే!గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయన్న గవర్నర్ ప్రసంగం.. కూటమి ప్రభుత్వంలో గత 45 రోజులుగా శాంతి భద్రతల ఏ స్థాయిలో ఘోరంగా దెబ్బ తిన్నాయో స్పందించలేదు. కనీసం లా అండ్ ఆర్డర్ పునరుద్ధరణ ప్రస్తావన కూడా లేదు. వివిధ రంగాల్లో నష్టాలు వచ్చాయంటూ కాకి లెక్కలతో సాగింది గవర్నర్ ప్రసంగం. పైగా గత ఐదేళ్లుగా అవి ఎల్లో మీడియాలో వచ్చిన ఊహాగాన కథనాలు.. కల్పిత రాతలే. సంబంధిత వార్త: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగుఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్న చంద్రబాబు ప్రభుత్వం.. సూపర్‌సిక్స్ వాగ్దానాలు ఎన్ని నెరవేర్చారో మాత్రం చెప్పలేదు కానీ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలన్న మాటతో గవర్నర్ ప్రసంగం ముగిసింది. అయితే.. ఇప్పటికే జగన్ వల్లే ఖజానా ఖాళీగా ఉందంటూ చెబుతూ వస్తున్న చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇదే మాట చెబుతారేమో అనే అనుమానాలు ఉన్నాయి. దీనికి తోడు అసెంబ్లీలో శ్వేత పత్రాల పేరుతో అబద్ధాలకు ఆయన రెడీ అయ్యాడు కూడా. జనాలు కోరుకునేది తమకు ఇచ్చిన హామీల అమలు. అంతేకానీ ఇలా నిందలు వేస్తూ వెళ్లడం కాదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం.. చంద్రబాబును, ఆయన మాటలను, కూటమి పాలనను ప్రజలు అసహ్యించుకునే రోజులు తొందరగానే వస్తాయి. -
టీడీపీ అరాచకాలు.. గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్
-
ఏపీలో అరాచక, ఆటవిక పాలన.. గవర్నర్‌తో భేటీలో వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత సాగుతున్న అరాచక పాలన, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలపై, వైఎస్సార్సీపీ లక్ష్యంగా చేస్తున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్ష్యాలతో సహా వినతిపత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలోని విషయాలు ఇలా ఉన్నాయి.. ‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. చివరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసుకుంటున్న వారినీ వదలడం లేదు. వారిపై దాడులు చేసి, ఉపాధిని దెబ్బ కొడుతున్నారు.కేవలం మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా వారి దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అలా ప్రభుత్వ ఆస్తులనూ వారు విధ్వంసం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలతో పాటు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లను సైతం టీడీపీ శ్రేణులు వదిలి పెట్టడం లేదు. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కక్షతోనే, అధికార పక్షం ఈ పని చేస్తోంది. చివరకు రాష్ట్రంలో చాలా చోట్ల దివంగత మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు.తాజాగా, ఈనెల 17న, పల్నాడు జిల్లా వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి.వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ కూడా లేకుండా పోయింది. గత గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. పోలీసుల సమక్షంలోనే ఈదాడి జరిగింది. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం వీటన్నింటితో అందరికీ అర్ధమవుతోంది.రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి. నామమాత్రంగా మిగిలాయి. అన్నింటికీ భిన్నంగా, చట్ట విరుద్ధంగా అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తమ సొంత రాజ్యాంగ వ్యవస్థ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం గత 45 రోజులుగా ఇక్కడ పని చేస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి.గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అంటే మంచి విద్య, మంచి వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్టమైన లా అండ్ ఆర్డర్. సుస్థిర, సమగ్రమైన అభివృద్ధి కొనసాగింది. వాటన్నింటిలో ఆనాడు ఈ రాష్ట్రం పేరు గొప్పగా చెప్పుకుంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో అరాచకాలు తప్ప, పరిపాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు.ప్రభుత్వం ఏర్పాటైన నెలన్నర వ్యవధిలోనే 36 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ వాళ్ల వేధింపులు భరించ లేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీళ్ల అరాచకాలు భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఇవన్నీ కాక, 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.ఈ ఘటనలన్నీ అనుకోకుండానో లేక యాదృఛ్చికంగానో జరిగిన ఘటనలు కావు. ఒక పథకం ప్రకారం ఒక మోడస్ ఆపరండీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి చేస్తున్న దుర్మార్గాలు ఇవన్నీ. రాష్ట్రంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు.. పైస్థాయి అధికారులు మొదలు కింది స్థాయి వరకూ సిగ్నల్ పంపారు. ఏకంగా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి రెడ్‌బుక్ పేరిట హోర్డింగులు పెట్టి, నేరుగా దాడులు చేయమని కేడర్‌కు చెప్పకనే చెప్పాడు. వాటిని అడ్డుకోవద్దని అధికారులనూ నిర్దేశించాడు. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారంటే.. చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నాను. ఈ వినతిపత్రంతో పాటు, పై అంశాలన్నింటికి సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను కూడా మీకు అందజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ వినతిపత్రంలో పేర్కొన్నారు. సంబంధిత వార్త: యావత్ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్ జగన్ -
గవర్నర్‌ను కలిసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్‌పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు పాల్గొన్నారు. నిరుద్యోగులపై పెట్టిన కేసులు, పార్టీ ఫిరాయింపుల అంశం, ప్రోటోకాల్ ఉల్లంఘన, రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగంపై జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు తుంగలో తొక్కారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులపై కేసులు, దాడులు జరుగుతున్నాయని.. హైదరాబాద్‌లో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ ఊసే లేదని అన్నారు. గతంలో భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవని తెలిపారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారన్నారు.‘రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఖననంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. పార్టీ ఫిరాయింపులపై ఆయనకు ఫిర్యాదు చేశాం. భయపెట్టి పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. తేదీలతో సహా గవర్నర్‌కు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మరో పార్టీ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని వివరించాం. ఈ రెండు అంశాలపై గవర్నర్‌కు సుదీర్ఘంగా మా అభ్యర్థన వినిపించాం. హోమ్ శాఖ కార్యదర్శిని పిలిచి వివరాలు అడుగుతానని గవర్నర్ చెప్పారు. ప్రభుత్వంతో మాట్లాడుతానని తెలిపారు. ఎమ్మెల్యేలపై ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరుగుతుంది. మాలో ఎవరికి కూడా నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నేతలందరినీ, ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కలుస్తాం. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఈ విషయంపై వివరిస్తాం. కాళేశ్వరంలో జరిగిన చిన్నతప్పి దాన్ని భూతద్దంలో పెట్టి చూపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూపెట్టింది. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తాం’ అని తెలిపారు -
జులై 7న జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్‌లో మరోసారి హేమంత్ సోరెన్ ప్రభుత్వ ఏర్పాటుకు పనులు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారమే చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసి గవర్నర్‌కు సమర్పించగా.. జేఎంఎం చీఫ్ నేడు హేమంత్ సోరెన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయనతోపాటు ఇండియా కూటమి నేతలు కూడా ఉన్నారుఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను గవర్నర్ ఆహ్వానించారు. జులై 7న హేమంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్నిజేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు. హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. -
గవర్నర్ ను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి
-
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్‌కతా నగర పోలీసు కమిషనర్ వినీత్‌కుమార్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్‌ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్‌భవన్‌ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్‌ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్‌కతా నగర పోలీసు కమిషనర్‌ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్‌భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. బెంగాల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకే మహిళలు భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన ఈ చర్యలకు దిగారు. శుక్రవారం కలకత్తా హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిణి.. గవర్నర్ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇది కుట్ర అని, ముందు ముందు ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తాయని ఆ టైంలోనే గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణల పర్వం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో ‘‘రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’’ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీఎంసీ నేతలు కొందరు గవర్నర్ ఆనందబోస్‌పై ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామంపై టీఎంసీ సీనియర్ నేత డోలా సేన్ మీడియా స్పందన కోరింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పార్టీతో చర్చించాకే తమ నిర్ణయం ఏంటో చెబుతామని అన్నారాయన. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై బీజేపీ మద్దతు తెలిపింది. గవర్నర్ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ రాహుల్ సిన్హా చెబుతున్నారు. మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజాన్ చక్రవర్తి తాజా పరిణామాలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒరగదని, పైగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తాయని అంటున్నారు. -
చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ గవర్నర్‌కు గుంటూరు ఆర్డీవో శ్రీకర్, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం నివాసానికి బయలుదేరి వెళ్లిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్.. చంద్రబాబును కలిశారు. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
టీడీపీకి గవర్నర్?.. రేసులో యనమల, అశోక్ గజపతి
ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి సీనియర్లు ఎన్డీఎ కోటాలో గవర్నర్ పదవివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు...యనమల, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లు గవర్నర్ పదవి కోసం రేసులో ఉన్నారు...ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకం కావడంతో సీనియర్లలో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందనే వార్తలు వస్తున్నాయి...గవర్నర్ రేసులో రేసులో ఎవరున్నారు...తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది..సీనియర్లలో ఒకరికి గవర్నర్ వస్తుందంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీఎలో కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రంలో టిడిపి సీనియర్లు కీలక పదవులను ఆశిస్తున్నారు..ముఖ్యంగా కొందరు సీనియర్లైతే గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు అయితే గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టిడిపిలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే యనమల, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు.యాదవ సామాజకి వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983 లో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. లా పూర్తి చేసిన యనమల తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. స్పీకర్ గా వ్యవహరించిన యనమల 1994 టిడిపి సంక్షోభంలో ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబు వైపు నిలిచి చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆ సమయంలో యనమల తీసుకున్న నిర్ణయమే చంద్రబాబుని ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. అప్పటి నుంచి కూడా చంద్రబాబుకి యనమల అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కూడా యనమలకి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ ఇస్తూ వచ్చారు.1999 నుంచి 2004 వరకు టిడిపి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ మంత్రిగా వ్యవహరించిన యనమల తొలిసారి వైఎస్సార్ హవాలో 2009 లో తొలిసారి ఓటమి చవి చూశారు.ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా 2014 లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు క్యాబినెట్ లో రెండవ సారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ దక్కకపోవడంతో ఆయన నిరాశ పడ్డారు. మళ్లీ ఈ ఎన్నికలలో తుని నియోజకవర్గంలో తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దింపారు. యనమల కృష్ణుడు వైఎస్సార్ సిపిలో చేరినప్పటికీ కూడా యనమల తన కూతురు దివ్యను తుని నియోజకవర్గంలో నెగ్గించుకున్నారు. టిడిపి అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ క్యాబినెట్ లో కీలక అమాత్య పదవి ఉంటుందని టిడిపి వర్గాలు భావించాయి. అయితే యనమల ఆలోచనలకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలని గవర్నర్ గా ఏదో ఒక రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టిడిపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల కూడా ఈసారైనా గవర్నర్ పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు ఉత్తరాంద్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు 1978లో తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి జనతాపార్టీ అభ్యర్థిగా విజయనగరం విధాన సభనుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీ లో 1983, 1985, 1989, 1994, 1999, 2009 వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇక 2014 లో విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎన్డీఎ ప్రభుత్వంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సారి ఎన్నికలలో ఆయన నేరుగా పోటీ చేయకుండా తన కుమార్తె ఆదితి గజపతిరాజుని రంగంలోకి దింపి ప్రత్యక్ష రాజకీయాలకి దూరమయ్యారు. తొలిసారి తన వారసురాలిని రంగంలోకి దింపిన అశోక్ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపించుకోగలిగారు. దీంతో ఆయన కూడా కేంద్రంలో కీలక పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.చంద్రబాబుకి ఉత్తరాంద్రలో అత్యంత సన్నిహితుడిగా అశోక్ గజపతి రాజు ఉండటంతో గవర్నర్ పదవి రేసులో ఆయన కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అటు యనమల...ఇటు అశోక్ గజపతిరాజులలో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే సిఎం చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఉత్తరాంద్రకి చెందిన రామ్మోహననాయుడికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ పదవి దక్కింది. ఇక తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి గుంటూరు ఎంపిగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి లబించింది. టిడిపి నుంచి 16 మంది ఎంపిలగా గెలుపొందడంతో మూడు పదవులు ఆశించినప్పటికీ కూడా తాజా క్యాబినెట్ లో రెండే పదవులు దక్కాయి. విస్తరణలో మరో కేంద్ర సహాయమంత్రి పదవి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ల కోసం ఒక గవర్నర్ పదవి ప్రతిపాధన కూడా మోదీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది..మరి టిడిపి సీనియర్ల ఆశలు నెరవేరతాయా...గవర్నర్ దక్కుతుందా...చూడాలి... -
వైఎస్సార్సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్ నజీర్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్ టీమ్‌లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్ నేత బాలాజీ ఉన్నారు. -
గవర్నర్‌ను కలిసిన వైఎస్సార్సీపీ బృందం
సాక్షి, విజయవాడ: రాజ్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ బృందం గురువారం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీపై టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాలలో పోలీసు అధికారుల వైఫల్యం పైనా వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటుచేసుకున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని.. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది. మంత్రి బొత్సతో పాటు గవర్నర్‌ని కలిసిన వారిలో మేరుగ నాగార్జున, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, కావలి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు.బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు: మంత్రి బొత్స బాబు ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశాము. అబర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారు. అబర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రా పై న్యాయ విచారణ చేయాలి. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెచ్చుకుని దీపక్ మిశ్రాను మార్చాలని కోరాముదీపక్ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారు: పేర్ని నానిఉద్దేశ పూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ-టీడీపీ తెచ్చింది. అతని వల్లే ఈ విధ్వంసం. రాష్ట్రంలో హింస జరుగుతున్న ప్రాంతాల్లో వారితో సీఎం జగన్ ఇప్పటికే మాట్లాడారు. సంయమనంతో ఉండాలని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారు. జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదు. జిల్లాల్లో ఉన్న అందరూ అధికారులను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్‌లో ఉన్న అధికారిని ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరాము -
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
కోల్‌కతా: గవర్నర్ బోస్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలని వెస్ట్‌బెంగాల్ సీఎం మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగిపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై శనివారం సప్తగ్రామ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత విమర్శలు గుప్పించారు. బోస్ గవర్నర్‌గా ఉన్నంతకాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టనని మమత స్పష్టం చేశారు.‘దీదీగిరి పనిచేయదని గవర్నర్ అంటున్నారు. కానీ గవర్నర్ నీ దాదాగిరి కూడా పనిచేయదు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు రాజీనామా చేయరో చెప్పాలి. గవర్నర్ నీ ప్రవర్తన సిగ్గుచేటు’అని మమత అన్నారు. -
గవర్నర్‌పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
కోల్‌కతా: వెస్ట్‌బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ ఆరోపణలపై విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని నలుగురు రాజ్‌భవన్ ఉద్యోగులకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సెట్)సమన్లు జారీ చేసింది. ఇంతేకాకుండా రాజ్‌భవన్‌లోని సీసీటీవీ వీడియోలను తమకు ఇవ్వాలని సెట్ అక్కడి అధికారులను కోరింది. ‘గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఈ బృందం రానున్న రోజుల్లో కొందరు సాక్షులను విచారించనుంది.లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కొన్ని వీడియోలు కావాలని రాజ్‌భవన్‌ను ఇప్పటికే కోరాం’అని ఒక పోలీసు అధికారి చెప్పారు. కాగా, రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి గవర్నర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేసింది. తనను గవర్నర్ సివి ఆనంద్‌బోస్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొంది.అయితే గవర్నర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండటం వల్ల పోలీసులు, కోర్టులు క్రిమినల్ చర్యలు ప్రారంభించడానికి వీలు లేదు. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని గవర్నర్ స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌లోకి పోలీసులను రానివ్వద్దని సిబ్బందికి ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
బెంగాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై ఓ మహిళా ఉద్యోగి లైంగిన వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో, ఈ ఘటన రాజకీయంగా సంచలనంగా మారింది.వివరాల ప్రకారం.. బెంగాల్ రాజ్‌భవన్‌లో పని చేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి.. గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గవర్నర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ.. హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఆశచూపి గవర్నర్ తనపై పలుసార్లు లైంగికంగా వేధించారని సదరు మహిళ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.ఇదిలా ఉండగా.. సదురు ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్ ఆనంద బోస్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఆనంద్ బోస్ స్పందిస్తూ..‘ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలను కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని కామెంట్స్ చేశారు. “Truth shall triumph. I refuse to be cowed down by engineered narratives. If anybody wants some election benefits by maligning me, God Bless them. But they cannot stop my fight against corruption and violence in Bengal.”— Raj Bhavan Kolkata (@BengalGovernor) May 2, 2024 మరోవైపు.. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయి. మరోవైపు.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ బెంగాల్లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం గవర్నర్‌పై మండిపడుతున్నారు. -
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y — ANI (@ANI) March 22, 2024 పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. On behalf of the people of Tamil Nadu, I thank the Hon'ble Supreme Court, the custodian of the Constitution, for its timely intervention & upholding the spirit of the Constitution and saving the democracy. In the last decade, the people of #INDIA witnessed the dithering of… pic.twitter.com/zthecHWbXL — M.K.Stalin (@mkstalin) March 22, 2024 -
TN: ‘సుప్రీం’ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు గవర్నర్
చెన్నై: డీఎంకే నేత కె.పొన్ముడి తమిళనాడు మంత్రిగా శుక్రవారం(మార్చ్ 22) మధ్యాహ్నం 3.30గంటలకు మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పొన్ముడి ప్రమాణస్వీకారాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పొన్ముడి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా చేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి పడిన మూడేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం పొన్ముడిని సీఎం స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పొన్ముడితో ప్రమాణస్వీకారం చేయించడానికి గవర్నర్ రవి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో గవర్నర్ దిగిరాక తప్పలేదు. కాగా, తమిళనాడు ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్న పొన్ముడిని అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్షపై సుప్రీంస్టే తర్వాత ఆయన తన శాసనసభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఆ వెంటనే పొన్ముడిని మంతత్రివర్గంలోకి తిరిగి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ పిటిషన్ విత్ డ్రా -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. ఇంఛార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాల పై రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్, తెలంగాణకు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ సీనియర్ నేత. గతంలో బీజేపీకి ఆ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా, పలు కీలక పదవులను నిర్వహించారాయన. రెండుసార్లు లోక్‌సభకు కొయంబత్తూరు నుంచి ప్రాతినిద్యం వహించారు. -
తెలంగాణ గవర్నర్‌గా రేపు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్.. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ఉదయం 11:15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ విడుదల చేసింది. -
తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణకు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్ గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్.. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్. 1998, 99 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేశారాయన. అలాగే.. బీజేపీ తరఫున ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. కిందటి ఏడాది ఫిబ్రవరిలో ఆయన జార్ఖండ్‌కు గవర్నర్‌గా నియమితులయ్యారు. -
రాజీనామాపై స్పందించిన తమిళిసై.. దానికి మాత్రం నో రిప్లై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ తనకెప్పుడూ అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లేనని అన్నారు. కాగా తెలంగాణ గవర్నర్ పదవికి సోమవారం తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక గవర్నర్ పదవి చేపట్టకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను ఎన్నటికీ మరవనని.. అందరితో కలుస్తూ ఉంటానని చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నను.. ఆమె దాటవేస్తూ వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై.. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. -
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా (ఫొటోలు)
-
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
-
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మరోసారి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజ్‌భవన్ అధికారిక ప్రకటన ప్రకారం.. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ పదవికి, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. అనంతరం, రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆమె చెన్నైకి వెళ్తారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళిసై తమిళనాడు పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజకీయపరంగా తమిళిసై కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉంది. అయితే తర్వాతి కాలంలో బీజేపీ వైపు ఆమె మొగ్గు చూపించారు. -
గవర్నర్‌గా హ్యాండిల్ చేయలేననుకున్నారు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/రాయదుర్గం/నిజామాబాద్ అర్బన్: ‘నన్ను గవర్నర్‌గా నియమించినప్పుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని (న్యూబార్న్ బేబీ) హ్యాండిల్ చేయలేనని అందరూ అనుకున్నారు.. కానీ ఓ గైనకాలజిస్టుగా న్యూబార్న్ బేబీకి ఎలా చికిత్స చేయాలో నాకు తెలుసు.. అలా గే పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చి నప్పుడు కూడా రెండు రాష్ట్రాలను ఎలా హ్యాండిల్ చేస్తారని అన్నారు.. ఓ డాక్టర్‌గా ట్విన్స్ (తెలంగాణ, పుదుచ్చేరి)కు ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసు.. నాకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చదువే..’అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్‌లో క్యాంపస్ డెవలప్మెంట్ ప్రాజెక్టుతోపాటు రాష్ట్రంలో మరో రెండు జాతీయ విద్యాసంస్థల్లో భవనాలను ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటీ–హెచ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ప్రభుత్వం ఉన్నత మౌలిక సదుపాయాలతో నెలకొల్పుతున్న ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు దేశం కోసం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని గవర్నర్ పిలుపునిచ్చారు. సేవా రూపంలో గానీ, నూతన ఆవిష్కరణల రూపంలో గానీ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని సూచించారు. కొలనులో నీటిమట్టం పెరిగితే కమలం పువ్వు పైపైకి వచ్చినట్లుగానే.. సమాజంలో విద్యా సంబంధిత మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే.. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పైపైకి వస్తాయని వివరించారు. గతంలో ఈ ఆస్తులను తన తండ్రి సంపాదించి ఇచ్చారని పిల్లలు చెప్పుకునే వారని, ఇప్పుడు పరిస్థితి మారిందని, కుటుంబ బాధ్యతలను పిల్లలే తీసుకుంటున్నారని, ఇది ఒక్క విద్యతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఐఐటీహెచ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ‘మనూ’లో రూ.64.41 కోట్లతో భవనాలు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ)లో రూ.64.41 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ భవనాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రాయదుర్గం క్యాంపస్‌లో రూ.11.19 కోట్లతో నిర్మించిన రెండంతస్తుల కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం భవనాన్ని, రూ.25 కోట్లతో మూడంతస్తుల ఇంజనీరింగ్ వర్క్‌షాప్ భవనాన్ని. రూ.28.22 కోట్లతో నిర్మించిన ఒడిశా కటక్‌లోని ‘మనూ’పాలిటెక్నిక్ భవనాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. ‘మనూ’క్యాంపస్‌లో నిర్వహించిన ప్రత్యక్ష ప్రత్యేక కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో కేవీ నూతన భవనం నిజామాబాద్‌లో కేంద్రీయ విద్యాలయ నూతన భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో 7.5 ఎకరాల్లో రూ. 22 కోట్లు వెచ్చించి అన్ని వసతులతో కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశమంతటా కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
TN: తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి అసెంబ్లీకి వచ్చారు. ప్రారంభించిన కొద్ది నిమిషాలకే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం స్టాలిన్, స్పీకర్, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పి అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని తెలిపారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవని, ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్ తెలిపారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7 — ANI (@ANI) February 12, 2024 ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్ చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదని గవర్నర్ చెప్పారు. ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్ పేరా చదవి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి.. నేడు బీహార్‌లో ఏం జరగనుంది.. ఎవరి బలం ఎంత -
Jharkhand: గవర్నర్‌పై జేఎంఎం నేత కీలక వ్యాఖ్యలు
రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఫైర్ అయ్యింది. తమ ప్రభుత్వాన్ని మళ్లీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ నేరుగా ఎందుకు ఆదేశించారని, ఈ విషయంలో ఆయనను ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య డిమాండ్ చేశారు. ‘ఎక్కడైనా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే గవర్నర్ కేర్‌టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ గవర్నర్ అలాంటిదేమీ చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జనవరి 31వ తేదీనే మేం సంసిద్ధతను వ్యక్తం చేశాం. మా లెజిస్లేచర్ పార్టీ నేతను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదు. ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి వచ్చిన తర్వాతే గవర్నర్ మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచారు. కానీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫ్లోర్ టెస్ట్‌కు ఎందుకు ఆదేశించారు. దీనికి హేతుబద్దత ఏంటో తెలియదు. మాకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని సుప్రియో భట్టాచార్య తెలిపారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 5) మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది. మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన సభ్యుల బలం ఇండియా కూటమి ప్రభుత్వానికి ఉందని జేఎంఎం, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదీచదవండి.. విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన -
పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమరి్పంచారు. ‘‘వ్యక్తిగత కారణాలతోపాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమరి్పస్తున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు. -
Jharkhand politics 2024: సీఎంగా చంపయ్ ప్రమాణం
రాంచీ: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలంగీర్ అలాం, రాష్రీ్టయ జనతాదళ్(ఆర్జేడీ) నేత సత్యానంద్ భోక్తా రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 67 ఏళ్ల గిరిజన నాయకుడు చంపయ్ సోరెన్ జార్ఖండ్‌కు 12వ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటున్న జేఎంఎం అగ్రనేత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హేమంత్ సోరెన్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలపై విపక్ష బీజేపీ వల విసిరే అవకాశం ఉండడంతో ముందుజాగ్రత్తగా వారిని బయటకు తరలించినట్లు కూటమి నేతలు చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్‌తో చంపయ్ సోరెన్ -
గవర్నర్‌ను కలిసిన మెగా కోడలు ఉపాసన.. ఎందుకంటే?
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను మెగా కోడలు ఉపాసన కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల కోసం గవర్నర్ తీసుకుంటున్న చర్యలను ఉపాసన కొనియాడారు. వారి అభివృద్ధి, సంక్షేమ కోసం చేస్తున్న గవర్నర్ చేస్తున్న పనులు నా హృదయాన్ని కదిలించాయని అన్నారు. మీరు చేస్తున్న ఈ పనులకు మనస్ఫూర్తిగా అభినందనలు అంటూ.. ఉపాసన తన ట్విటర్ ద్వారా ఫోటోలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Met with the Honorable Tamilisai Soundararajan Garu, the esteemed Governor of Telangana. Getting a deeper understanding of what she is doing for tribal welfare has really touched my heart.❤️ Kudos to u Ma’am, for your remarkable work. 🙏🏼✨@DrTamilisaiGuv #tribalwelfare pic.twitter.com/dUAXqZ5Zi4 — Upasana Konidela (@upasanakonidela) February 1, 2024 -
2 నిమిషాల్లోనే ప్రసంగం ముగిసింది
తిరువనంతపురం: కేరళలోని వామపక్ష ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. గురువారం కేరళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ విధివిధానాలను వివరించాల్సిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రసంగ పాఠంలోని చివరి పేరాను మాత్రమే చదివి కేవలం రెండు నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ 9.02 గంటలకల్లా ప్రసంగం ముగించారు. 9.04 గంటలకు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. కొన్ని బిల్లుల పెండింగ్, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించిన అంశాలపై గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం
-
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయించారు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో రిట్ పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ భర్తీ నిలిపివేయాలని తమిళిసై నిర్ణయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కేరళ గవర్నర్‌పై బృందాకారత్ సంచలన వ్యాఖలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కావాలంటే ఖాన్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ‘గౌరవ గవర్నర్‌కు ఒకవేళ రాజకీయాలంటే ఆసక్తి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి. పోటీచేసి రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. బీజేపీ టికెట్ తీసుకుని కేరళలోని ఏ స్థానం నుంచి అయినా ఆయన పోటీ చేయొచ్చు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. గవర్నర్ రోజూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు సీఎంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది’అని బృందా కారత్ సూచించారు. కేరళ ప్రభుత్వం పంపిన యూనివర్సిటీ బిల్లులపై సంతకాలు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. యూనివర్సిటీ బిల్లులు మనీ బిల్లులయినందున గవర్నర్ ఆమోదం లేకుండా వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. దీంతో ఆ బిల్లులపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. గవర్నర్‌కు ఈ బిల్లులపై డైరెక్షన్స్ ఇదీచదవండి..విజయ్‌కాంత్‌ను తల్చుకుని ప్రధాని భావోద్వేగం -
నా రాజీనామా ఊహాగానమే
సాక్షి హైదరాబాద్/కంటోన్మెంట్: తాను గవర్నర్‌గా రాజీనామా చేసి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని అనురాధా టింబర్స్‌ను సందర్శించినప్పుడు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గవర్నర్‌గా సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు శ్రీరాముడితో పాటు ప్రధాన మంత్రి మోదీ చేతుల్లో ఉందన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. పూల బొకేలు వద్దు.. బుక్స్ తీసుకురండి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సోమవారం ఉదయం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు రాజ్‌భవన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులను గవర్నర్ ఆహ్వనించినట్టు తెలిసింది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లు పూల బొకేలకు బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులను తీసుకురావాలని గవర్నర్ విజ్ఞప్తి చేసినట్టు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. -
TS: రాజీనామాపై గవర్నర్ తమిళిసై క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తాను సంతోషంగా ఉన్నానని... గవర్నర్‌గా రాజీనామా చేసున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. నిరాధారమైన వార్తలను ప్రచారం చేయొద్దన్న గవర్నర్.. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తెలియజేస్తాన్నారు. రాజకీయాలు అనేది నా కుటుంబ నేపథ్యంలోనే ఉందని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళిసై ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసమే హస్తినకు వెళ్లారనే వార్తలు వినిపించాయి. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపించాయి. ఇదిలా ఉండగా.. తమిళిసై గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తూకూడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవి చూశారు. మరో మూడు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా.. ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకీ ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్‌లో తమిళిసైని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే, రాజ్యాంగబద్దమైన పదవిని వదిలి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్టు ప్రచారం జరిగింది. -
గవర్నర్ తమిళిసై పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం
-
TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?
తెలంగాణ గవర్నర్ తమిళసై శాసనసభలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయం, భయంగా నడక ప్రారంభించిందన్నది అర్ధం అవుతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చినప్పటికీ, మున్ముందు ఎదుర్కోబోయే కష్టాలు కూడా అంతర్లీనంగా ఈ ప్రసంగంలో కనిపిస్తాయి. ఆ విషయాలు నేరుగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించకపోయినా, ఉపన్యాస సరళిని గమనిస్తే ఆ భావం కలుగుతుంది. ఇంతకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనను నిర్భంధ పాలనగా, నియంతృత్వ పాలనగా సహజంగానే విమర్శిస్తారు. దానికి కొంతమేర కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. అలాగే ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయంలో విచారణ కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు. ఇది బీఆర్ఎస్కు ఎంబరాస్మెంట్ కలిగించే అంశమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం కష్టం అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉండే విషయాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అలా వ్యవహరించడం సహజమే. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించామని ఈ స్పీచ్‌లో తెలిపారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే వేల సంఖ్యలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి తమ వినతులు అందిస్తున్నారు. వాటన్నిటిని పరిష్కరించడం అంత తేలికకాదు. వాటిలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలే ఉండవచ్చు. వాటిని ఏమి చేయాలన్నదానిపై ఒక విధానం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ వినతులు ఇచ్చినవారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని, నిర్భంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చి దేశాన్ని నియంతగానే పాలించారన్న సంగతి గుర్తుకు వస్తుంటుంది. అయినా ప్రజలకు పూర్థి స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ముదావహమని చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టిన 48 గంటలలో రెండు హామీలను నెరవేర్చడం రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు. అంతవరకు ఓకే. అవి రెండు తేలికగా అయ్యేవి కనుక చేశారు. అందులో కూడా ఇబ్బందులు లేకపోలేదు. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చింది వాస్తవమే. కాని దీనివల్ల ఆర్టీసీకి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసేది కూడా ప్రభుత్వం చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ నష్టం మేరకు మొత్తాన్ని ఆర్టిసికి చెల్లిస్తుందా?లేక దానిని మరింత నష్టాలలోకి నెడుతుందా అన్నది చూడాలి. ఈ హామీ అమలు వల్ల వేలాది మంది ఆటోవాలాలు, క్యాబ్ ల వారు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం బాగా ప్రచారం అవుతోంది. దీనిని ఎలా పరిష్కరిస్తారో ఆలోచించాలి. మరో హామీ పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద పడే ఆర్ధిక భారం పెద్దగా ఉండదు. కాని ఎంతో కొంత బడ్జెట్ పెంచవలసి ఉంటుంది. దాని సంగతి ఏమి చేస్తారో తెలియదు.మిగిలిన హామీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు మొదలైన గ్యారంటీల పేర్లు ప్రస్తావించి వంద రోజుల కార్యాచరణ అన్నారు తప్ప వాటి వివరాల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.ఇక్కడే వారిలో భయం ఏర్పడిందన్న విషయం అర్ధం అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్ధిక సాయం, గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం,రైతు భరోసా కింద పదహారువేల సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల సహాయం వంటివాటిని అమలు చేయవలసి ఉంది. వీటన్నిటికి అయ్యే వ్యయం అంచనా వేస్తే కనీసం ఏభైవేల కోట్ల వరకైనా ఉండవచ్చన్నది ఒక అబిప్రాయం. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంచనా వేసిన ప్రకారం లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందన్నది మున్ముందు రోజుల్లో చెబుతారేమో చూడాలి. ఇవి కాకుండా ఆయా డిక్లరేషన్లు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ఊసేమీ ఎత్తలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న రైతు భరోసా ఆగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇస్తూ, తాము అధికారంలోకి రాగానే పదిహేనువేల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని సంగతి కూడా చెప్పినట్లు లేదు. ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదిస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ చెబుతుండేవారు. ఆ ప్రకారం మంత్రివర్గం ఆమోదించినా, ఆ తర్వాత ప్రక్రియ ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని,పౌర సరఫరా సంస్థ 56వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించింది. మంత్రులు కూడా ఈ విషయాలను మీడియాకు చెబుతున్నారు. నిజానికి ఈ పరిస్థితి గురించి ఎన్నికల ముందు కూడా వీరికి తెలుసు. అయినా ఈ వాగ్దానాలు చేశారంటే, పదేళ్లుగా అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ను ఎలాగైనా పవర్ లోకి తీసుకురావాలన్న ఆకాంక్ష తప్ప మరొకటి కాదు.రెండు లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామని కూడా ఈ స్పీచ్ లో పేర్కొన్నారు. ఇది కూడా అంత తేలిక కాకపోవచ్చు.మెగా డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నారు. నిజంగానే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగితే రేవంత్ ప్రభుత్వానికి మంచి క్రెడిట్టే వస్తుంది. ధరణి పోర్టల్ బదులు భూ మాత పోర్టల్ తెస్తామన్న హామీని కూడా ప్రస్తావించారు. మళ్లీ దీనివల్ల రైతులకు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడితే మంచిది.గత ప్రభుత్వం మాదిరే మూసి నది ప్రక్షాళన చేస్తామని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. దానికి తోడు మూసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ చేస్తామని అంటున్నారు. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రచారానికి మాత్రమే వాడుకుందని, తదితర విమర్శలు కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాని ప్రజలకు కావల్సింది శ్వేతపత్రాలు కాదుకదా! చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కదా! అన్న వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి వస్తాయి. గత ప్రభుత్వంపై నెపం నెట్టి కాలయాపన చేయడానికి ఇవి పాతరోజులు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పిస్తామని చెప్పడం మంచి విషయమే. తమ ప్రభుత్వం మాటలకన్నా చేతలనే నమ్ముకుందని, మార్పును మీరు చూస్తారని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒకరకంగా చూస్తే ఇది ఆశలు కల్పించి,వాటిని నెరవేర్చడానికి యత్నించే ప్రభుత్వంగా కనిపిస్తుంది.మరో రకంగా చూస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ భయం,భయంగా సాగే ప్రభుత్వం అన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణ గవర్నర్ ప్రసంగం అసత్యాలు, అభూత కల్పనలతో నిండిందన్న కేటీఆర్..ఇంకా ఇతర అప్డేట్స్
-
సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల సాక్షిగా తెలంగాణలో ఇందిరమ్మ పాలన వరి్ధల్లుతుందని కాంగ్రెస్ సర్కారు తరఫున గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి.. హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోందని చెప్పారు. పదేళ్ల నిర్బంధ పాలన నుంచి విముక్తి కావాలని, తమ బతుకుల్లో గొప్ప మార్పు రావాలని ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో సుస్పష్టమైన తీర్పు ఇచ్చారని.. వారి విజ్ఞతను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. పాలకులకు, ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోయాయని.. అడ్డుగోడలు, అద్దాల మేడలు పటాపంచలై ప్రజా ప్రభుత్వ ప్రస్థానం మొదలైందని చెప్పేందుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశిస్తూ గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. అనుభవం, యువరక్తం మేళవింపుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందని తమిళిసై ఆకాంక్షించారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ‘‘ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం. ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచి్చన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కలి్పంచే ఫైలుపై ముఖ్యమంత్రి తొలి సంతకం చేయటం ప్రభుత్వ సంకల్పాన్ని తెలుపుతోంది. ఇది ప్రజాపాలన. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో ఉండే పాలన తెలంగాణలో మొదలైందనడానికి నిదర్శనంగా ప్రారంభమైనదే ప్రజావాణి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించే మహాలక్షి్మ, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులు.. ఈ రెండు గ్యారంటీల అమలు ప్రారంభమైంది. మొత్తం ఆరు గ్యారంటీలైన మహాలక్షి్మ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతలను వచ్చే 100 రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ తీసుకుంటాం. రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్, హైదరాబాద్‌లో ప్రకటించిన యువ డిక్లరేషన్, చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్.. అన్నీ అమలు చేస్తాం. సాధ్యమైనంత త్వరలో అమరవీరుల కుటుంబాలను గుర్తించి.. 250 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని, గౌరవ భృతిని అందజేస్తాం. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, నిరంతర విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుంది. ఆదిలాబాద్‌కు సాగునీరు ఇస్తాం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతలోపం, అవినీతి, అవకతవకలపై విచారణ దిశగా ప్రభుత్వ కార్యాచరణ ఉంటుంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేసి ఎగువన ఆదిలాబాద్, ఇతర ప్రాంతాలకు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా సాగుతాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధనకు కట్టుబడి ఉన్నాం. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. దానికి జాతీయ హోదా సాధించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతాం. త్వరలో మెగా డీఎస్సీ మెగా డీఎస్సీ నిర్వహణతో వచ్చే ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తాం. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ పథకం కింద రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా మరో రూ.లక్ష, స్థలం లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఇంటి స్థలం ఇస్తాం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ప్రారంభించేలా త్వరలో కార్యాచరణ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. భూసంస్కరణలలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన 25లక్షల ఎకరాల భూమిపై పేదలకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తాం. మాఫియాపై ఉక్కుపాదం రాష్ట్రంలో మాదక ద్రవ్యాల మాఫియాను నిర్మూలించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. డ్రగ్స్ విషయంలో దోషులు ఎంతటివారైనా వదిలేది లేదు. ఐటీ విషయంలో మరింత వేగంగా పురోగతి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నగరాన్ని అన్నిదిశలా అభివృద్ధి చేయాలన్నది ఈ ప్రభుత్వం సంకల్పం. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా భావిస్తూ.. ఔటర్ లోపల ఉన్న నగరం, ఔటర్ రింగురోడ్డు– ప్రతిపాదిత రీజనల్ రింగురోడ్డు మధ్య ఉన్న ప్రాంతం, రీజనల్ రింగు రోడ్డు ఆవల ఉన్న ప్రాంతం.. ఇలా మూడు ప్రాంతాలను నిర్ధారించి వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అప్పుల్లో విద్యుత్ సంస్థలు గత ప్రభుత్వ నిర్వాకంతో విద్యుత్ సంస్థలు రూ.81,516 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయి. రూ.50,275 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. పౌర సరఫరాల కార్పొరేషన్ రూ.56 వేల కోట్ల అప్పులు, రూ.11 వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఆర్థిక క్రమశిక్షణ లేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దీని సరిదిద్ది గాడిలో పెట్టాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసి, వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలపై భారం మోపకుండానే ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి సంక్షేమ పాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వ్యక్తుల కోసం విధ్వంసమా? ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాల్సిన వ్యవస్థలు, సంస్థలు వ్యక్తుల కోసం పనిచేసే పరిస్థితికి దిగజారాయి. ఈ తీరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో విలువలు పునరుద్ధరిస్తాం. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటాం. అభివృద్ధి విషయంలో వివక్ష ఉండదు. పారీ్టలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అభివృద్ధి నిధులు పొందుతారు. సచివాలయం అలంకారప్రాయంగా ఉండదు. రైతులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ, యువత, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమం, అభివృద్ధి కార్యాచరణ ఉంటుంది. యువత జాబ్ కేలండర్ విషయంలో కార్యాచరణ ప్రారంభిస్తాం. ప్రతి గ్రామం యూనిట్‌గా అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తాం..’’ అని గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారు. కాళోజీ, అంబేడ్కర్ మాటలను ఉటంకిస్తూ.. ‘‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి, కోరికొక్కటి, తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలె భారతాన..’’ అన్న ప్రజాకవి కాళోజీ మాటలను ఉటంకిస్తూ గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చివరిగా ‘‘ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వ పాలనా రూపం మాత్రమే కాదు.. వాస్తవానికి అది తోటి మానవుల పట్ల గౌరవాదరాలతో కూడిన ఒక వైఖరి..’’ అన్న అంబేడ్కర్ మాటలను ప్రస్తావించారు. ప్రముఖ కవి దాశరథి పేర్కొన్న ‘‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..’’ అనే మాటలతో ప్రసంగాన్ని ముగించారు. -
10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు
-
TS: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగించారు. అంతా ఊహించినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని 100 రోజుల్లో అమలులోకి తీసుకువస్తామ్ని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్‌లో మిగిలిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్ తెలిపారు. ‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది’ అని గవర్నర్ అన్నారు. ‘యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు. ఇది నిజమైన ప్రజా పాలన. నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తాం. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’అని గవర్నర్ అన్నారు. ‘లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు. 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’ అని గవర్నర్ తెలిపారు. ఇదీచదవండి..యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ -
నేడు అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
-
TS:గవర్నర్ ప్రసంగంపై ఉత్కంఠ!
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో మిగిలిన గ్యారెంటీల అమలు ఎపట్టి నుంచి అనేది తెలుసుకోవడానికి ప్రజలు వేచిచూస్తున్నారు. గ్యారెంటీల అమలుపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్సుందని భావిస్తున్నారు. ముఖ్యంగా రూ.4వేల పెన్షన్,రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు రూ.2500 నగదు బదిలీ, రూ.500కు గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గవర్నర్ ద్వారా ఎలాంటి ప్రకటన చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వీటితో పాటు బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో భారీ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే. అదే పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతికి సంబంధించి చర్యలపై గవర్నర్ ఏదైనా వెల్లడిస్తారా అనే చర్చ జరుగుతోంది. కాగా, గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది మరుసటి రోజు సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగనున్న ఈ తొలి చర్చలోనే ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య అసెంబ్లీలో మాటల తూటాలు పేలే ఛాన్సుందని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్లోనే తీసుకుంటామని చెప్పిన నిర్ణయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. దీంతో చర్చ వాడివేడిగా జరగనుంది. ఇదీచదవండి.. నేటినుంచి జీరో టికెట్ -
Dec15th: తెలంగాణ అసెంబ్లీ లైవ్ అప్డేట్స్
మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ తన ఛాంబర్లో మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక భేటీ హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, మల్లు భట్టి విక్రమార్క మాజీ మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ మల్కాజ్గిరి ఎంపీగా నేను పోటీ చేయను... మా కుటుంబం నుంచి ఇద్దరం ఎమ్మెల్యేలం అయ్యాం ఇక చాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సహకారం ఉంటుంది గవర్నర్ స్పీచ్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కామెంట్స్ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు కొత్త ప్రభుత్వం చేసే పనిపై స్పష్టత ఇవ్వలేదు మేనిఫెస్టో చదవటానికి మాత్రమే జాయింట్ సెషన్ పెట్టినట్టు కనిపిస్తోంది గత ప్రభుత్వం దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిపింది పంటల విస్తీర్ణం పెరిగింది అనేది వాస్తవం 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోంది తలసరి ఆదాయం, ఐటీ ఎగుమతులు వృద్ధి చెందాయి ఇవన్నీ చూసిన గవర్నర్ ఇప్పుడు అప్పుడు ఏం మాట్లాడారో సమీక్ష చేసుకోవాలి ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారని గవర్నర్ చెప్పటం హాస్యాస్పదం గవర్నర్ ఏదో చెప్తారని ఆశ పడ్డాం గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ బీఆర్ఎస్ఎల్పీ ఆఫీసులో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ దిశానిర్దేశం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ముగిసిన గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ జరిపిస్తాం తొమ్మిదేళ్లలో ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా లక్ష్యం తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని కోరుకుంటున్నారు ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు ఇది నిజమైన ప్రజా పాలన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశాం నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం డ్రగ్స్ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో పూర్తి చేస్తాం మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం కాళోజి కవితతో స్పీచ్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సమావేశమైన ఉభయ సభలు హాజరైన స్పీకర్, శాసన మండలి చైర్మన్ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ కాసేపట్లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. తెలంగాణలో ఉభయసభలను ఉద్దేశించి అసెంబ్లీలో ప్రసంగించనున్న గవర్నర్ తమిళిసై 11.30కు ప్రారంభమవనున్న సభ ప్రసంగం ముగిసిన తర్వాత వాయిదా పడనున్న సభ రేపటి నుంచి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ గ్యారెంటీలన్నీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదానిపై గవర్నర్ ప్రసంగంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ మీటింగ్ సభ ఎన్నిరోజులు నడపాలనేదానిపై నిర్ణయం -
వచ్చే ఐదేళ్ల లక్ష్యంపై గవర్నర్ ప్రసంగం తయారీ!
రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఏమేం చేయనుంది, ఎలాంటి లక్ష్యాలను పెట్టుకుందనే అంశాలతో శుక్రవారం అసెంబ్లీ ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఇదే సమయంలో గత ప్రభుత్వ తప్పిదాలు, పథకాల అమల్లో లోపాలను ప్రస్తావించనుంది. ఈ మేరకు గవర్నర్ ప్రసంగ పాఠానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. గురువారం రాష్ట్ర శాసనసభ వాయిదా పడ్డాక అసెంబ్లీ ఆవరణలోనే కేబినెట్ భేటీ జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. గంటన్నరకుపైగా సాగిన ఈ సమావేశంలో గవర్నర్ ప్రసంగ పాఠంతోపాటు పలు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడనుండటంతో.. ప్రసంగ పాఠంలో ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదానిపై మంత్రివర్గం కసరత్తు చేసింది. పాలన, ఆర్థిక అంశాల్లో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, వచ్చే ఐదేళ్లపాటు కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ విధానాలపై సమీక్ష.. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించాలని కేబినెట్ నిర్ణయించింది. మరోవైపు విద్యుత్, వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యారోగ్యం, సంక్షేమ రంగాల్లో తాము అనుసరించే విధానాలను ప్రకటించాలని తీర్మానించింది. ఎన్నికల్లో ఇచి్చన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటి అమలును పాక్షికంగా ప్రారంభించిన అంశాన్ని వివరిస్తూ.. ఇతర గ్యారంటీల అమలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అవినీతి, అప్పుల్లో ముంచిందని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో.. గవర్నర్ ప్రసంగంలో, తర్వాత ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో ఆయా అంశాలను ప్రస్తావించాలని కేబినెట్ భేటీలో నిర్ణయానికి వచ్చారు. ఇక రైతుబంధు, ధరణి పోర్టల్, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలపై త్వరలో మరోమారు సమావేశం అవుతామని మంత్రులకు సీఎం రేవంత్ చెప్పినట్టు సమాచారం. విభాగాల వారీగా శ్వేతపత్రాలు వివిధ ప్రభుత్వ శాఖల వారీగా అప్పులు, పనులు, పథకాల తీరుతెన్నులను వివరిస్తూ శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. శ్వేతపత్రాల విడుదల మొక్కుబడిగా, హడావుడిగా కాకుండా పూర్తి వివరాలు, ఆధారాలతో ఉండాలని.. ఆ దిశగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. మంత్రులు కూడా తమకు అప్పగించిన శాఖల్లో లోతుగా సమీక్షించి, అవగాహన పెంచుకోవాలని సూచించారు. శ్వేతపత్రాల విడుదల తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చే ప్రతిస్పందనకు దీటుగా సమాధానాలు ఇచ్చేలా మంత్రులు సన్నద్ధం కావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వచ్చే విమర్శలు, ఆరోపణలపై తొందరపాటుతో స్పందించకుండా.. లోతుగా అవగాహన చేసుకున్నాకే ప్రతిస్పందించాలని సీఎం సూచించినట్టు తెలిసింది. ఉభయ సభల భేటీలో గవర్నర్ ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో.. సీఎం రేవంత్‌తోపాటు ట్రెజరీ బెంచ్ (అధికార పక్షం)నుంచి మాట్లాడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినందున పూర్తి సన్నద్ధతతో రావాలని పేర్కొన్నట్టు సమాచారం. -
సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయమవడంతో తన ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసైకి తన రాజీనామా లేఖను పంపించారు. సాధారణంగా పార్టీ ఓటమి పాలైన తర్వాత ముఖ్యమంత్రులు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు నేరుగా రాజీనామా లేఖను సమర్పిస్తారు. దీనికి భిన్నంగా కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లకుండానే సీఎం పదవికి రాజీనమా చేయడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కేసీఆర్ రాజీనామా చేసే కంటే ముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పార్టీ ఓటమిని అంగీకరించారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. తమతప్పు సరిదిద్దుకుంటామని తెలిపారు. -
సీఎంతో సమావేశమై పరిష్కరించుకోండి: గవర్నర్‌కు సుప్రీం సూచన
న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకీ మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు బిల్లుల ఆమోదంలో జాప్యంపై నెలకొన్న ప్రతిష్టంభనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సమావేశమై పరిష్కరించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. బిల్లుల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను గవర్నర్ పరిష్కరించాలని కోరుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఇరువురు కూర్చొని చర్చిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ రిఫర్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతికి రిజర్వ్ చేయకూడదన్న విషయాన్ని గవర్నర్ గమనించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఆర్ఎన్ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లులను మరోసారి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. వీటిని గవర్నర్ ఆమోదం కోసం తిరిగి పంపారు. -
రెండేళ్లుగా ఏం చేస్తున్నారు?.. గవర్నర్‌పై సుప్రీంకోర్టు అసహనం
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను రెండేళ్లుగా గవర్నర్ తనవద్దనే నిలిపి ఉంచడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.రాష్ట్రపతి సమ్మతి కోసం గవర్నర్లు ఎప్పుడు బిల్లులను పంపించాలనే అంశంపై మార్గదర్శకాలను రూపొందించే విషమాన్ని పరిశీలించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను ఆమోదించడంలో విపరీతమైన జాప్యం జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రెండు సంవత్సరాలుగా బిల్లును ఎందుకు తొక్కిపెట్టారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లులను గత రెండేళ్లుగా గవర్నర్ ఎందుకు తొక్కి పెట్టారని ప్రశ్నించింది. అంతకుముందు గవర్నర్ కార్యాలయం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి.. మొతం 8 బిల్లుల్లో ఏడింటిని గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్‌లో ఉంచారని, మరో బిల్లుకు గవర్నర్ మహమ్మద్ ఖాన్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నోట్ చేసుకున్న సీజేఐ.. గత రెండేళ్లుగా బిల్లులను గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ బదులిస్తూ.. అనే సందేహాలను లేవనెత్తే ఆ వివరాల్లోకి వెళ్లదలచుకోలేదని తెలిపారు. అయితే ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీ అయిన తమకు ఆ వివరాలు అవసరమనని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను ఎప్పుడూ పంపించాలనే విషయంలోనూ మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని కోరారు. చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. రాష్ట్రంలో పాలనను నిలిపివేసేలా గవర్నర్లు బిల్లులను తొక్కిపెట్టడాన్ని అనుమతించకూడదని తెలిపారు. అసెంబ్లీతో కలిసి పని చేయకుండా గవర్నర్ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గడువులోగా ఆమోదం తెలిపేందుకు లేదా తిరస్కరించేందుకు రాష్ట్ర గవర్నర్లకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ చేసిన అభ్యర్థనను సవరించేందుకు కేరళ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. విచారణను ఇక్కడితో ముగిద్దామనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇదో సజీవ సమస్యగా పేర్కొంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గవర్నర్‌కు పలు కీలక సూచనలు చేసింది. బిల్లుపై సందేహాలు ఉంటే ముఖ్యమంత్రి పినరయి విజయన్, సంబంధిత మంత్రితో గవర్నర్ చర్చిస్తారని భావిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ వివేకంతో నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అలా జరగని పక్షంలో రాజ్యాంగం అప్పగించిన విధులను నిర్వర్తించడానికి చట్టబద్దమైన విధానాల ఖరారుకు తాము సిద్దంగా ఉంటామని పేర్కొంది. -
అర్హులందరికీ పథకాలు చేరేలా అధికారులు చొరవ చూపాలి: గవర్నర్
సాక్షి, గుంటూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. గుంటూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సభలో ఆయన మాట్లాడుతూ, లబ్ధిదారుల అనుభవాలు తెలుసుకుని పథకాలు మెరుగ్గా ఉండేటట్లు చూడాలన్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హత ఉండి పథకాలు అందని వారి వివరాలు సేకరించాలని గవర్నర్ సూచించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర విజయవంతం కావడానికి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
సమాఖ్య వ్యవస్థకు ఎంతటి దుర్గతి!
గవర్నర్ల వ్యవహార శైలి కారణంగా దేశానికి సమాఖ్య వ్యవస్థను ఇచ్చిన రాజ్యాంగం స్ఫూర్తి దెబ్బతింటోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలి. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామకాన్ని భారత రాష్ట్రపతి చేస్తారు. ఆర్టికల్ 156 ప్రకారం రాష్ట్రపతి అనుగ్రహం ఉన్నంత వరకు గవర్నర్ పదవిలో ఐదేళ్లపాటు కొనసాగుతారు. దీనినిబట్టి ఎవరి కైనా ఏమి అర్థమవుతుంది? గవర్నర్ పదవిలో ఉండే వారెవరూ కేంద్ర ప్రభుత్వానికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదనేకదా? ఇందుకు సంబంధించి 1979 మే 4న సుప్రీం కోర్టు ఓ కీలకమైన తీర్పు ఇచ్చింది. ఒక యజమాని (ఎంప్లాయర్)కీ, ఒక ఉద్యోగి (ఎంప్లాయీ)కీ ఉండే సంబంధం కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మధ్య ఉండదనీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో గవర్నర్ ఉండరనీ సుప్రీం కోర్టు ‘డాక్టర్ రఘుకుల్ కేసు’లో స్పష్టంగా చెప్పింది. అంటే, ‘గవర్నర్’ అన్నది ఓ రాజ్యాంగబద్ధమైన పదవి. ఆ స్థానంలో ఉండే వారు రాజ్యాంగబద్ధమైన విధులను మాత్రమే నిర్వహించాలి. కానీ, ఆచరణలో అలా జరుగుతోందా? గవర్నర్ల వ్యవస్థను కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, వారు దుర్వినియోగం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. గవర్నర్ల నియామకంలోనూ పాటించవలసిన మార్గదర్శకాలనూ, విధివిధానా లనూ తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం గత ఏడు న్నర దశాబ్దాలుగా కనిపిస్తోంది. గవర్నర్‌ను కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్రాలలో ఆర్టికల్ 356ను దుర్వినియోగ పరిచి ప్రజా ప్రభు త్వాలను కూలగొట్టిన సంఘటనలు అనేకం. కేరళ కమ్యూనిస్టు యోధుడు ఇఎంఎస్ నంబూద్రిపాద్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్‌లో ఎన్.టి. రామారావు వరకు గవర్నర్ బాధితులు ఎందరో ఉన్నారు. గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపర్చడం శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా జరిగింది. కేంద్రం– రాష్ట్రాల మధ్య ఉండే సంబంధాల సమతుల్యతపై అధ్యయనం చేసి నివేదిక అందించేందుకు 1983లో ఏర్పాటయిన జస్టిస్ రాజేందర్ సింగ్ సర్కారియా ఐదేళ్ల తర్వాత సమర్పించిన నివే దికలో గవర్నర్ల నియామకం, వారి పనితీరుపై స్పష్టమైన సూచనల్ని చేసింది. నిజానికి సర్కారియా కమిషన్ కంటే ముందు... 1969లో అప్పటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర–రాష్ట్ర సంబంధాల మెరు గుదలపై నివేదిక ఇవ్వాలని రాజమన్నార్ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ చాలా స్పష్టంగా ‘గవర్నర్ నియామకంలో తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్‌తో సంప్రదింపులు జరపాలి’ అని చెప్పింది. కానీ, ఈ కమిటీ రికమండేషన్లను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాల అనంతరం, సర్కారియా కమిషన్ కూడా ఇదే సిఫార్సు చేసింది. కానీ, కేంద్రంలో ఎవరున్నా గవర్నర్లను ఏకపక్షంగా నియమించే సంప్రదాయమే కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పంజాబ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల గవర్నర్ల వ్యవహారశైలి దుమారం రేపుతోంది. కొన్ని నెలల క్రితం తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్ ప్రసంగ పాఠానికి సొంతంగా మార్పులు చేర్పులు చేసి అసెంబ్లీలో ప్రసంగించడం కలవరం రేపింది. అలాగే, కొన్ని బిల్లుల్ని ఆమోదించకుండా తిప్పిపంపారు. ఇక పంజాబ్ గవర్నర్ అయితే, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపర్చాలని ఆ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించినా అందుకు ఆయన అనుమతి ఇవ్వలేదు. దీనిపై పంజాబ్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో సర్వోన్నత న్యాయ స్థానం గడప తొక్కింది. ‘శాసనసభ నిర్వహణకు సంబంధించిన అధి కారాలు అసెంబ్లీ స్పీకర్‌కు ఉండగా, వాటి నిర్వహణలో మీకు అభ్యంతరం ఏమిటి’ అని పంజాబ్ గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ తీసు కున్న చర్యను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. అంతేకాదు... ‘మీరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని తీవ్రస్వరంతో సుప్రీం కోర్టు గవర్నర్ పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉండాల్సిన సుహృద్భావ వాతావరణం స్థానంలో రాజకీయ వైరం నెలకొని వారు ఎడమొఖం పెడమొఖంగా మారిన ఉదంతాలు గతంలో కోకొల్లలు. గవర్నర్ల రాజ్యాంగ అతిక్రమణలపై పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నో సంద ర్భాలలో వాడీ వేడీగా చర్చోపచర్చలు జరిగాయి. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదని, దానిని రద్దు చేయాలనే డిమాండ్ సైతం వినిపించింది. ఆశ్చర్యం ఏమంటే, గవర్నర్ వ్యవస్థ వల్ల లోగడ ఇబ్బందులు ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ‘మేము సైతం’ అంటూ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగపర్చడమే చర్చనీయాంశం. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా ఇటువంటి వివాదాలు చేటు చోసుకొన్న దాఖలాలు లేవుగానీ, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో అధికారం చేపట్టిన ఎన్డీఏ ఈ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో గవర్నర్లను తమ ఇష్టానుసారం బీజేపీయేతర ప్రభుత్వాలపై సవారీ చేయిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ముఖ్యంగా బిల్లుల విష యంలో తమకులేని అధికారాలను ఆపాదించుకొని గవర్నర్ వాటిని ఆమోదించకుండా తొక్కిపెట్టడంతోనే ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కొందరు గవర్నర్లు పోషిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ప్రశ్నించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడం దేశంలో సమాఖ్య వ్యవస్థకు పట్టిన దుర్గతిగా రాజ్యాంగ నిపుణులు అభివర్ణించడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని అంశాలలో గవర్నర్లకు రాజ్యాంగం కొన్ని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన మాట నిజం. గవ ర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించి నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం దఖలు పడింది. కానీ, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను సుదీర్ఘకాలం ఆమోదించకుండా లేదా తిప్పిపంపకుండా తొక్కి పెట్టడానికి గవర్నర్‌కు హక్కు లేదు. కాగా, తమ ప్రభుత్వానికి సహకరించని గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అనుచితంగా ప్రవర్తిస్తూ కక్ష తీర్చుకొంటున్న ఉదంతాలు కూడా చోటుచేసుకొంటున్నాయి. గవర్నర్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్ పాటించకపోవడం మొదలుకొని, అసలు గవర్నర్ లేకుండానే శాసన సభ సమావేశాలు నిర్వహించుకొనేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం భారతదేశ ప్రజాస్వామ్యానికి తలవంపులు తెస్తున్నది. ప్రజాస్వామ్య విలువల పతనంలో దేశం పాతాళంలోకి శీఘ్రగతిన ప్రయాణిస్తున్న వేళ... దేశం శాస్త్ర సాంకేతిక రంగా లలో అద్భుతంగా ముందుకు సాగిపోతోందనీ; చంద్రయాన్, సూర్య యాన్లతో ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్ఠ ఆకాశాన్నంటుతోందనీ కేంద్రం జబ్బలు చరుచుకొంటే ఉపయోగం ఏమిటి? సి. రామచంద్రయ్య వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
అక్కా..మీ ఓటు మాకే
ముషీరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కరపత్రాన్ని అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం అడిక్‌మెట్ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నివాసం ఉండే గల్లీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్, సయ్యద్ అస్లాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే వరుసలో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వెళ్లగా విజయలక్ష్మికి కరపత్రాన్ని అందించి ముఠా గోపాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆమె చిరునవ్వుతో కరపత్రాన్ని స్వీకరించి వారితో ఫొటో దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి సాయిప్రసన్న, ఇంద్రసేనారెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, చంద్రశేఖర్, మహ్మద్ జహంగీర్, రోషం బాలు తదితరులున్నారు. దత్తన్న కుమార్తె విజయలక్ష్మికి బీఆర్ఎస్ కరపత్రం -
మూడేళ్లుగా ఏం చేస్తున్నారు..? తమిళనాడు గవర్నర్‌ను నిలదీసిన సుప్రీం
ఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ తీర్మాణం తెలిపిన బిల్లులకు మూడేళ్లు ఆమోదం తెలపకుండా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీ తీర్మాణించిన బిల్లులకు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగానే ఆమోదం తెలపడం లేదనే ఆరోపిస్తూ తమిళనాడు, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వం పంపిన పది బిల్లులను గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆమోదించకుండా వెనక్కి పంపారు. ఈ బిల్లుల్లో రెండు బిల్లులు గతంలో పాలించిన అన్నా డీఎంకే ప్రభుత్వానికి చెందినవి. అయితే.. గవర్నర్ వెనక్కి పంపగా తమిళనాడు శాసనసభ మళ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆ బిల్లులను మళ్లీ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం మళ్లీ పంపింది. ఈ నేపథ్యంలో శాసనసభ రెండోసారి బిల్లులను ఆమోదించి పంపిన క్రమంలో గవర్నర్ చర్యలేంటో చూద్ధామని పేర్కొన్న ధర్మాసనం.. డిసెంబర్ 1 కి కేసును వాయిదా వేసింది. రెండోసారి పంపిన బిల్లులపై గవర్నర్ అధికారాలు మనీ బిల్లులలాగే ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. బిల్లులను జాప్యం చేయడానికి గల కారణాలు ఏంటో తెలపాలని కోరింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ కేసు: అభిషేక్ బోయినపల్లి బెయిల్ కేసు డిసెంబర్ 4కు వాయిదా -
సుప్రీంకోర్టు మొట్టికాయ.. మరోసారి తమిళనాడు గవర్నర్ వివాదాస్పద నిర్ణయం
చెన్నై: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల వైఖరి రోజురోజుకీ వివాదాస్పదంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్, తమిళనాడులో బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ల జాప్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొన్న అత్యున్నత ధర్మాసనం.. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ వివాదం మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన వారం రోజుల్లోనే గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా తన వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌ను నియమించడంలో గవర్నర్‌కు ఉన్న అధికార పరిధిని తగ్గించడం ఒకటి అయితే గత అన్న డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులను విచారించేందుకు అనుమతి కోరుతూ పంపిన బిల్లులు కూడా ఉన్నాయి. గవర్నర్ చర్యపై శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తిప్పి పంపిన బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించి ఆయనకు పంపనున్నట్లు స్పీకర్ ఎం అప్పావు తెలిపారు. బీజేపీ నియమించిన గవర్నర్ ఉద్ధేశపూర్వకంగా బిల్లల ఆమోదంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రజల ద్వారా ఎన్నికైన పాలనను అణగదొక్కడమేనని డీఎంకే ప్రభుత్వం విమర్శిస్తోంది. కాగా అంతకముందు కూడా గవర్నర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును సైతం వెనక్కి పంపిన విషయం తెలిసిందే. చదవండి: 'ఐక్యమయ్యాం.. విజయం సాధిస్తాం: రాహుల్ గాంధీ -
రాజ్‌భవన్‌కు పదే పదే! అలా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..
ఒకప్పుడు గవర్నర్ వ్యవస్థను తప్పుబట్టి.. ఆ వ్యవస్థనే ఎత్తివేయాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ.. ఇప్పుడు పదే,పదే గవర్నర్‌ను ఆశ్రయిస్తూ ఏవేవో ఫిర్యాదులు చేస్తోంది. వ్యవస్థ ఉంది కనుక గవర్నర్ వద్దకు వెళ్లడం తప్పుకాదు. కాని.. ఓటుకు నోటు కేసు సమయంలో గవర్నర్‌ను టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు వంటివారు ఎలా నిందించారో గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు వారు చేస్తున్న విన్యాసాలు గమనించేవారికి ఆశ్చర్యం కలుగుతుందని చెప్పడమే ఉద్దేశం. కొద్ది రోజుల క్రితం టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం మరోసారి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఎప్పుడు వీలైతే అప్పుడల్లా.. ప్రతీ చిన్నదానికి కూడా టీడీపీ బృందాలు గవర్నర్ వద్దకు వెళ్లడం పనిగా పెట్టుకున్నాయి. చివరికి కోర్టులలో ఉన్న విషయాలకు కూడా ప్రభుత్వానికే ఆపాదిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నిందిస్తూ.. పేజీలకొద్ది రాసేస్తూ గవర్నర్‌కు ఇస్తూ వస్తున్నారు. దాని వల్ల వచ్చేదేమీ లేకపోయినా.. అప్పటికప్పుడు వారికి మద్దతు ఇచ్చే టీవీలలో లైవ్ కవరేజీ ద్వారా ప్రభుత్వాన్ని తిట్టడానికే ఇదొక ఈవెంట్‌గా పెట్టుకుంటున్నారనిపిస్తుంది. మరుసటి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో మొదటి పేజీలో అచ్చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. ఈ వినతిపత్రాలలో కొత్త విషయం ఒక్కటి కూడా కనిపించదు. టీడీపీ వాళ్లు మీడియా సమావేశాలు పెట్టి తిట్టిపోసే అంశాలనే గవర్నర్ వద్దకు మళ్లీ తీసుకువెళతారు. మరోసారి అదే పనిచేశారు. కాకపోతే ఆంగ్ల భాషలో వాటిని ఎవరో ఒక లాయర్తోతో రాయించి ఇస్తారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం వద్దని ప్రచారం చేసే తెలుగుదేశం నేతలు.. గవర్నర్‌కు మాత్రం ఆంగ్లంలోనే తమ ఫిర్యాదు కాపీని అందచేస్తారు. అది వేరే విషయం!. ఇక ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తే.. అవన్నీ అత్యధిక భాగం అబద్ధాల పుట్ట అని ఇట్టే తేలిపోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టేవన్నీ అక్రమ కేసులేనని గవర్నర్‌కు టీడీపీ వాళ్లు చెబుతారు. గవర్నర్ అనుమతి లేకుండానే కేసులు పెట్టారని ఆరోపిస్తారు. అంతే తప్ప.. ఆ స్కాంల ఆరోపణలకు కచ్చితమైన సమాధానం మాత్రం ఇవ్వరు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నిజం గెలిచి జైలునుంచి బయటకు వచ్చారట!. ఆయన ఎలా బెయిల్ పొందింది గవర్నర్ నజీర్‌కు తెలియదా?. కంటి ఆపరేషన్ కోసం బెయిల్ కోరింది నిజం కాదా?. చంద్రబాబు జైలులో ఉన్నంత కాలం ఆయన ఆరోగ్యంపై ఎన్నెన్ని అబద్దాలు ప్రచారం చేసింది.. తలచుకుంటేనే ఏహ్య భావం కలుగుతంది. తీరా జైలు నుంచి బయటకు వచ్చాక.. ఆయన శుభ్రంగా ఉండడమే కాకుండా పద్నాలుగు గంటలు ఏకధాటిగా కారులో ప్రయాణించడంతో ఆ అబద్దాలన్ని ప్రజలకు తెలిసిపోయాయి. అంతకు ముందు మమ్మల్ని ఏమీ పీకలేవు.. అంటూ సవాల్ చేసిన చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడు అవినీతి కేసులు మీద పడుతుండేసరికి అదంతా ‘కక్ష’ అని గగ్గోలు పెట్టి.. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాన్ని కనుమరుగు చేయాలని విఫలయత్నం చేసిన టీడీపీ నేతలు.. ప్రస్తుతం జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆ వినతిపత్రం చదివితే అర్థమైపోతుంది. ఏపీలో శాంతిభద్రతలు మృగ్యం అయ్యాయని ఆరోపిస్తారు. నిజానికి ఈ ఐదేళ్లు రాష్ట్రం ఉన్నంత ప్రశాంతగా ఎప్పుడూ లేదు. ప్రజలలో ఉద్యమాలే లేవు. ఆయా వర్గాల గొడవలే లేవు. కాకపోతే టీడీపీ వాళ్లు అప్పడప్పుడు సృష్టించే అశాంతి మాత్రం ఉంటుంది. చంద్రబాబు అరెస్టు తర్వాత అది కూడా లేదు. రాష్ట్రం మరింత ప్రశాంతంగా ఉంది. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇష్టారీతిన రెచ్చగొట్టి జనంలో గందరగోళం సృష్టించాలన్న వారి ఆటలకు కళ్లెం పడిందన్నదే వారి బాద. వారిపై ఆధారసహితంగా కేసులు వస్తున్నాయన్నదే వారి భయం. చంద్రబాబు టైంలో మాదిరి 20 మంది ఎర్రచందనం కూలీలను ఎన్కౌంటర్ చేసి మానవహక్కులకు విఘాతం కలిగే సందర్భం జగన్ పాలనలో ఒక్కటైనా ఉందా?. అసలు ఈ ఐదేళ్లలో ఎక్కడైనా పరిస్థితి కాల్పులవరకు వెళ్ళిందా?. టీడీపీవాళ్లు చంద్రబాబు సమక్షంలో అరాచకం సృష్టించి పోలీసులపై రాళ్లు విసిరి,వాహనాలు దగ్దం చేసి, ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టినా.. పోలీసులు మాత్రం సంయమనంగా ఉన్నారు తప్ప కాల్పులు మాత్రం జరపలేదు. చంద్రబాబు తన కుటుంబంతో పుష్కరాలకు వెళ్లి సామాన్య భక్తులను ఘాట్‌లోకి రానివ్వకుండా నిలువరించిన ఫలితంగా ఏర్పడిన తొక్కిసలాటలో 29 మంది మరణిస్తే ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. మరి జగన్ తన కుటుంబాన్ని తీసుకు వెళ్లి అలాంటి దారుణాలకు ఎక్కడైనా కారణమయ్యారా?. జగన్ మానసిక పరిస్థితి సౌండ్ గా లేదని లోకేష్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇంతకన్నా పచ్చి అబద్దం ఇంకేదైనా ఉంటుందా? అసలు మతి స్థిమితం లేనిది తన మామ, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అని డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ పొందిన విషయం ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారు. జగన్ ఒక ఎమ్మెల్యేగానే పనికిరారట. 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో ఎంపీగా, తొంభైవేల ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యేగాను గెలవడం ఒక ఎత్తు అయితే.. తనతో పాటు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌ను అలా అంటారా?. ఆయన ప్రజలకు బాగా పనికి వస్తారనే అంత ఘనంగా ఎన్నుకున్నారు. లోకేష్ ప్రజలకు ఉపయోగపడరనే మంగళగిరిలో ఓడించారా?. ఎదుటివారిపై ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు, విమర్శ చేసేటప్పుడు తమగురించి ఆలోచించకపోతేఏ అది వారికే నష్టం. మొన్నటిదాకా ప్రభుత్వంతో గొడవ పడి ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి అని కార్యకర్తలను రెచ్చగొట్టిన చంద్రబాబు, లోకేష్‌లు.. తమపై కేసులు వస్తే తెగ గోల చేస్తున్నారు. వీరే ఇలా వ్యవహరిస్తే, వీరి మాటను నమ్మి గలభాలుచేసి కేసులపాలైన కార్యకర్తల పరిస్థితి ఏమిటి? జేసీ ప్రభాకరరెడ్డి వంటివారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారట!. ఇదే తెలుగుదేశం నేతలు జేసీ సోదరులు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎన్ని ఆరోపణలుచేసేవారు!. ఇప్పుడేమో వారి స్కామ్ లను వెనుకేసుకొస్తున్నారు. చంద్రబాబు,తదితరులపై వచ్చిన అవినీతి కేసులన్నింటి మీద టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 17-ఏ సెక్షన్ కింద గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయనకే చెప్పడం విశేషం. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చీఫ్ జస్టిస్‌కు పంపిన లేఖ మాదిరే.. ఈ వినతిపత్రం కూడా ఉంది. గవర్నర్ నజీర్ తో లోకేష్ వ్యక్తిగతంగా కాసేపు భేటీ అయ్యారట. అప్పుడు వారిద్దరి మధ్య ఏమి జరిగి ఉంటుంది! వ్యవస్థలను మేనేజ్ చేయడానికే అలా కలిశారని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా?. ఒకపక్క సుప్రీంకోర్టులో దీనిపై కేసు వేసిన తర్వాత ఆయనకు ఫిర్యాదు చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. గవర్నర్ వెంటనే జగన్ ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరి అలా తీసుకోవాలంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఎన్నిసార్లు చర్యలు తీసుకోవాలి?అసలు గవర్నర్ వ్యవస్థనే అవమానించినవారు ఇతర ప్రభుత్వాలపై గవర్నర్ చర్య తీసుకోవాలని కోరడమే వారి సిద్దాంత నిబద్దత లేమికి నిదర్శనంగా చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పంజాబ్, తమిళనాడు గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
తమిళనాడు పంజాబ్ గవర్నర్లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. బిల్లులను ఆమోదించడంలో గవర్నర్లు చేస్తున్న జాప్యంపై పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషిన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రజలు ఎన్నుకున్న నేతలు ద్వారా అసెంబ్లీలో ఆమెదం పొందిన బిల్లలు విషయంలో ఆలస్యం చేయవద్దని ఇరు రాష్ట్రాల గవర్నర్లకు సున్నితంగా హెచ్చరించింది. బిల్లులపై గవర్నర్ల చర్య తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది ‘మీరు నిప్పుతో ఆడుకుంటున్నారు. సమావేశాలు సక్రమంగా జరగలేదన్న కారణంతో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు చెల్లవని గవర్నర్ ఎలా చెబుతారు. పంజాబ్‌లో గవర్నర్, సర్కార్‌కు మధ్య జరుగుతున్న పరిణామాలపై మేము సంతృప్తికరంగా లేము. ఇలాంటి చర్యల వల్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్యన్ని కొనసాగిస్తామా?. ఇది చాలా తీవ్రమైన విషయం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థిరపడిన సంప్రదాయాలపై భారత్ నడుస్తోందని, వాటిని అనుసరించాల్సిన అవరసం ఉందని నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే... డీఎంకే నేతృత్వంలోని సర్కార్‌కు గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య.. పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వానికి గవర్నర్ పురోహిత్ మధ్య ఇటీవలి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను పాస్ చేయడంలో గవర్నర్లు ఉద్దేశ్యపూర్వకంగా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. చదవండి: అందులో తప్పేముంది? మేం రోజుకు 15 గంటలు పనిచేస్తున్నాం: కాంగ్రెస్ ఎంపీ పంజాబ్, తమిళనాడు ప్రభుత్వాల తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ల సమస్య పంజాబ్ నుంచి తమిళనాడుకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారికి విస్తరిస్తోందని, దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. గవర్నర్ల ప్రవర్తన రాజ్యంగ విరుద్ధమని.. ఆయన చర్య ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అనంతరం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తీసుకున్న చర్యల వివరాలను తమకు అందజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ఆదేశించింది. ఈ కేసును దీపావళి తరువాత సోమవారం విచారిస్తామని చెబుతూ వాయిదా వేసింది. కాగా పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు నవంబర్ 6న ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గవర్నర్లకు ఆత్మపరీశీలన అవసరమని వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. -
బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్లకు ఆత్మపరీశీలన అవసరమని వ్యాఖ్యానించింది. పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ బిల్లుల ఆమోదించడంలో చేస్తున్న జాప్యంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల అంశం తమ వద్దకు చేరక ముందే గవర్నర్లు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లుల ఆమోదంలో జాప్యంపై దాఖలైన కేసుపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ‘బిల్లుల విషయాలు సుప్రీంకోర్టు వద్దకు రాకముందే గవర్నర్లు చర్యలు తీసుకోవాలి. గవర్నర్లు అలా వ్యవహరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. గవర్నర్లకు ఆత్మ పరిశీలన అవసరం. అలాగే వారు ఎన్నికైన ప్రజాప్రతినిధులు కాదన్న విషయం వారు తెలుసుకోవాలి’ అని ధర్మాసనం పేర్కొంది. పెండింగ్ బిల్లులపై పంజాబ్ గవర్నర్ పురోహిత్ తీసుకున్న చర్యలకు సంబంధించిన తాజా పరిస్థితిపై నివేదికను నవంబర్ 10 నాటికి సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం ఇదిలా ఉంటే... ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ పురోహిత్ మధ్య ఇటీవలి కాలంలో విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 27 బిల్లుల్లో 22 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కానీ... అక్టోబరు 20న నాల్గవ బడ్జెట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు ద్రవ్య బిల్లులకు మాత్రం ఆమోదం తెలుపలేదు. మూడు ద్రవ్య బిల్లులకు ఆమోదించకుండా అక్టోబరు 19న పంజాబ్ ముఖ్యమంత్రికి గవర్నర్ లేఖ రాశారు. బడ్జెట్ సమావేశాలను పొడిగించడమనేది అక్రమం, చట్ట విరుద్దమని పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టేముందు ప్రతిపాదిత చట్టాలన్నింటినీ మెరిట్‌పై పరిశీలిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 20, 21న రెండు రోజులపాటు జరుగాల్సిన బడ్జెట్ పొడిగింపు సమావేశాలను పంజాబ్ ప్రభుత్వం కుదించింది. గవర్నర్ ఆమోదించని వాటిలో పంజాబ్ ఆర్థిక, బడ్జెట్ నిర్వహణ (సవరణ) బిల్లు 2023, పంజాబ్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు 2023, ఇండియన్ స్టాంప్ (పంజాబ్ సవరణ) బిల్లు 2023 బిల్లులు ఉన్నాయి వీటి ఆమోదంపైనే పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే నవంబర్ 1న పురోహిత్ మూడు ద్రవ్య బిల్లులలో రెండింటికి ఆమోదం తెలిపారు. ద్రవ్య బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే అందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. -
గవర్నర్‌పై కోర్టుకెక్కిన తమిళనాడు సర్కార్
చెన్నై/ఢిల్లీ: తమిళనాడు అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. క్లియరెన్స్ కోసం పంపిన బిల్లుల ఆమోదాన్ని ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారనిఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులను ఆమోదించేలా లేదా పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలని ప్రభుత్వం కోర్టును కోరింది. అలా గత కొన్ని నెలలుగా సాగుతున్న మాటల యుద్ధం ఇపుడు కోర్టుకు చేరింది. రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్ రవి కావాలనే అడ్డుకుంటున్నారని, సకాలంలో ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. 54 మంది ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన పన్నెండు బిల్లులు, నాలుగు ప్రాసిక్యూషన్ ఆంక్షలు, ఫైళ్లు ప్రస్తుతం గవర్నర్ ముందు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజల అభీష్టాన్ని దెబ్బతీస్తూ రాజ్యాంగ అధికారాన్ని గవర్నర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది. కాగా తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ఈ ఏడాది జనరిలో చేసిన వ్యాఖ్యలు తమిళనాట ప్రకంపనలు రేపాయి. అది మొదలు ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు రగులుతూ ఉన్నాయి పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమేంటని ప్రభుత్వం గట్టిగా ప్రశ్నిస్తోంది. అటు గవర్నర్ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు తన బాధ్యతలు నిర్వర్తించే అధికారం ఉందని వాదించారు.ఈ పరిణామాల నేపథ్యంలో ఒక సమయంలో అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేసిన ఘటన సంచలనమైంది. -
మెదక్ ఎంపీపై దాడి ఘటనపై గవర్నర్ సీరియస్, డీజీపీకి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరమని తెలిపారు. డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎంపీపై హత్యాయత్నంపై తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందించాలని గవర్నర్ కోరారు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల భద్రత విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. భవిషత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా డీజీపీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికల కోసం శాంతియుత, సురక్షితమైన వాతావరణాన్ని నిర్వహించడం చాలా అవసరమని తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. యశోద ఆసుపత్రికి కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి ఎంపీని తీసుకొచ్చారు. హత్యాయత్నం కేసు, నిందితుడి అరెస్ట్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తితో దాడి చేసి, హత్య ప్రయత్నం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మిడిదొడ్డి మండలం పెద్ద చెప్పాల గ్రామానికి చెందిన గడ్డం రాజుగా గుర్తించారు. నిందితుని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసును సిద్ధిపేట సీపీ శ్వేత దర్యాప్తు చేస్తున్నారు. ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటాం: హరీష్‌రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్‌రెడ్డిపై దాడి అత్యంత దారుణమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని, అధైర్య పడవద్దని సూచించారు. ఎంపీని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నంలో రాజకీయ కుట్ర ఏదైనా ఉందా అనేకోణంలో సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. నారాయణఖేడ్ సభకు వెళ్తూ విషయం తెలియగానే ఆసుపత్రికి బయల్దేరారు హరీష్‌రావు. ఫోన్లో పరామర్శించి దైర్యం చెప్పారు. ఎంపీ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్నారు. -
26న త్రిపుర గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి వెలువరించిన ఉత్తర్వులను (వారెంట్) త్రిపుర గవర్నర్ ఏడీసీ మేజర్ రోహిత్ సేధీ ఇంద్రసేనారెడ్డికి అందజేశారు. త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందజేశారు. ఇంద్రసేనారెడ్డి ఈ నెల 25వ తేదీ ఉదయమే హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. ఇంద్రసేనారెడ్డిని తోడ్కొని వెళ్లేందుకు ఈ నెల 24న త్రిపుర రాజ్‌భవన్ పేషీ సిబ్బంది హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. -
Governor Abdul Nazeer: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు (ఫొటోలు)
-
గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
అప్పుడు హూ ఈజ్ గవర్నర్ ?...ఇప్పుడు హూ ఈజ్ బాబు..?
-
నాకు పదవొస్తే కాంగ్రెస్‌కు ఎందుకంత భయం?
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ పదవిలో తనను నియమిస్తే కాంగ్రెస్ పార్టీ ఎందుకంత భయాందోళనలకు గురై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)కు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదని త్రిపుర గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ పక్షాన ఎన్నికల సన్నద్ధతలో కీలకంగా వ్యవహరిస్తున్న తనను మరో రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తే సంతోషపడాలే కాని భయంతో ఉన్నారంటే ఇక్కడున్న పరిస్థితులు అర్థమవు తున్నాయన్నారు. ఇప్పటికే బీసీలు బీజేపీ వైపు ఉండగా, రెడ్డిగా తనకు ఈ పదవి ఇవ్వడం వల్ల ఈ సామాజికవర్గం ఓట్లు కూడా బీజేపీకే పడతాయనే భయంతో కాంగ్రెస్ ఉన్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీఆర్ఎస్ సర్కార్‌పై వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తథ్యమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితే లేదన్నారు. తనకు ఈ పదవి లభించడం పట్ల సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఫోన్ చేసి అభినందించడం, వారిలో నూతనోత్సాహం వెల్లివిరియడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి అంకితభావంతో పనిచేస్తే బీజేపీలో తప్పకుండా గుర్తింపు లభిస్తుందనడానికి గవర్నర్‌గా తన నియామకం స్పష్టం చేస్తుందన్నారు. నియామకపత్రాలు అందాక ఈ నెల 24న లేదా 26న పదవీబాధ్యతలను స్వీకరించే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్‌గా నియమితులైన సందర్భంగా సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. సాక్షి: మీ రాజకీయ జీవితంలో సాధించిన విజయాలు, గుర్తుండిపోయే సందర్భాలు ఏమిటి? ఇంద్రసేనారెడ్డి: 1983 అసెంబ్లీ ఎన్నికల్లో (33 ఏళ్ల వయసులో) నాటి హోంమంత్రి కె.ప్రభాకర్‌రెడ్డిని, 1985 ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావును ఓడించి సంచలనం సృష్టించాను. 1985లో గెలిచాక కొత్త అసెంబ్లీ భవనంలోకి మారాక జరిగిన తొలిరోజు సభలో నేను వేసిన మొట్టమొదటి ప్రశ్న మంత్రులు తమ ఆస్తులను ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరాను. దానిపై అప్పటి సీఎం ఎన్టీరామారావు ఆవేశంగా స్పందిస్తూ...ఒక్క మంత్రులే కాదు, ఎమ్యెల్యేలంతా కూడా ప్రతీ ఏడాది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన బ్యాలెన్స్ షీటు సమర్పించేలా ఆదేశిస్తామన్నారు. దీనినే ఈసీ కూడా పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నామినేషన్లు సమర్పణకు ముందు ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించడం తప్పనిసరి చేసింది. దీనికి నా ప్రశ్నే కారణం కావడం గర్వంగా ఉంది. అసెంబ్లీ కమిటీల్లోనూ కీలకపాత్ర పోషించి కొంతమంది ఉన్నతాధికారులు సైతం తమ తప్పులను సరిదిద్దుకునే పరిస్థితిని కల్పించిన సందర్భాలున్నాయి. సాక్షి: బీజేపీలో పలువురు నేతలు ఎమ్మెల్యే అయ్యాక ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రమోషన్ పొందారు? మీకు అది వెలితి అనిపించిందా ? ఇంద్రసేనారెడ్డి: ఎంపీగా వెళితే మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయొచ్చునని భావించాను. కానీ అది సాధ్యం కాలేదు. 1980లోనే బీజేపీ తరఫున నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి చవిచూశాను. ఆ తర్వాత పలుమార్లు ఎంపీగా పోటీచేసినా విజయం సాధించలేకపోయాను. 2014లో చివరిసారిగా భువనగిరి నుంచి ఓడిపోయాక ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలిగాను. అప్పటి నుంచి సంస్థాగతంగా పార్టీ కార్యకలాపాలు, కార్యక్రమాల సమన్వయం తదితర విషయాల్లో నా రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ట్రబుల్ షూటర్‌గా నిలిచాను. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పార్టీపరంగా పూర్తి సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నాను. సాక్షి: మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? ఇంద్రసేనారెడ్డి : 1968, 69 నుంచి ఏబీవీపీలో, అంతకు ముందు విద్యార్థిగా ఆరెస్సెస్‌లో తిరిగాను. 1975 ఎమర్జెన్సీ విధించాక మీసా కింద అరెస్టయి జైలుకు కూడా వెళ్లాను. 1977లో లోక్‌నాయక్ జయప్రకాశ్ ప్రారంభించిన ఉద్యమంలో భాగస్వామి అయ్యాను. జనతాపార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించాను. 1980లో బీజేపీలో చేరి కార్యకర్త స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి 1983, 1985, 1999లలో మలక్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను. బీజేఎల్పీనేతగా వ్యవహరించా. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నా. ప్రస్తుతం జాతీయకార్యవర్గసభ్యుడిగా కొనసాగుతున్నాను. మొత్తంగా 46 ఏళ్లుగా బీజేపీ, జనతాలతో అనుబంధం ఉంది. సాక్షి: కీలకమైన ఎన్నికల సందర్భంలో గవర్నర్ పదవి రావడంపై ఏమంటారు? ఇంద్రసేనారెడ్డి: ఈ పదవి ఇంకా రెండు, మూడునెలలు ఆలస్యంగా వచ్చి ఉంటే బాగుండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కృషిలో భాగస్వామినై ఉన్నాను. వివిధ కీలకబాధ్యతలను నిర్వహిస్తూ పార్టీకి ఉపయోగపడుతున్నాను. సాక్షి: రాజ్యాంగబద్ధ పదవిని ఎలా భావిస్తున్నారు ? ఇంద్రసేనారెడ్డి : నా మొత్తం రాజకీయజీవితంలోని అనుభవసారాన్ని అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వెచ్చిస్తాను. రాజ్యాంగ పరిధిలో ఏ మేరకు మరింత మెరుగ్గా పనిచేయగలను, ప్రజల అభ్యున్నతికి ఎలా కృషి చేయగలను అన్నవే నా ముందున్న లక్ష్యాలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం అందుకు పనికొస్తుందని విశ్వసిస్తున్నాను. -
ఏందయ్యా ఇది చంద్రయ్యా! హూ ఈజ్ గవర్నర్, మోదీ అన్న నోటితోనే..
చంద్రబాబుకు కష్టం వస్తే అది ప్రపంచ బాధ అయిపోవాలనుకుంటుంది ఎల్లో బ్యాచ్. చంద్రబాబు కోలుకునే వరకు ప్రపంచమంతా బాధపడుతూనే ఉండిపోవాలని ఆశపడుతుంది. ఏ రూల్ అయినా చంద్రబాబు ప్రత్యర్థులకే వర్తిస్తాయి తప్ప ఆయనకు వర్తించవని కూడా ఆ ముఠా నమ్ముతుంది. దాన్నే ప్రచారం చేస్తుంది. తాను అధికారంలో ఉన్నప్పుడు హూ ఈజ్ గవర్నర్ అన్నారు .హూ ఈజ్ సీబీఐ అన్నారు. ఇపుడు ప్రతీ దానికీ అదే గవర్నర్ వెంటపడుతున్నారు. అదే సీబీఐకావాలని అడుగుతున్నారు. ఆయన స్కిల్ స్కాం పైనా సీబీఐదర్యాప్తు అడిగేస్తే పోలా అంటున్నారు న్యాయ రంగనిపుణులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా..ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజాసంకల్పయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చినపుడు ఆయనపై హత్యాయత్నం జరిగింది. శ్రీనివాస్ అనే కుర్రాడు కోడి కత్తితో జగన్‌పై దాడికి తెగబడ్డాడు. నెత్తుటి గాయంతో ఆయన ఆసుపత్రికి తరలించారు. అప్పుడు గవర్నర్ ఎవరు? ఈ సమయంలో ఏపీ గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్, రాష్ట్ర డీజీపీకి ఫోన్ చేసి వైఎస్ జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అంతే చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు. హూ ఈజ్ గవర్నర్? అంటూ హుంకరించారు. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర డీజీపీని నివేదిక కోరడానికి గవర్నర్ ఎవరు? కేంద్రం ఏజెంట్‌గా ఆయన ఇక్కడ వ్యవహారాలు నడపాలనుకుంటే కుదరనే కుదరదు అంటూ సీరియస్ అయిపోయారు. గవర్నర్ వ్యవస్థనే అవమానించేలా మాట్లాడారు చంద్రబాబు ఆ రోజున. చదవండి: న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేలా ఎల్లో గ్యాంగ్ నానాయాగీ ఇప్పుడు గవర్నర్‌ను కలిసి.. ఇపుడు 371 కోట్ల రూపాయల దోపిడీ కేసులో చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నెల రోజులు దాటినా బెయిల్ రాకపోవడంతో టీడీపీ నేతలు అసహాననికి గురయ్యారు. వెంటనే పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడి నేతృత్వంలో టీడీపీ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను కలిసి బాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ఫిర్యాదు చేశారు. విషయం న్యాయస్థానంలో ఉంటే నా దగ్గరకు ఎందుకు వచ్చారు? అని గవర్నర్ విసుక్కున్నారు కూడా. తమకో న్యాయం..ఎదుటి వారికో న్యాయమా? చంద్రబాబు హయాంలో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగినా.. దాని గురించి గవర్నర్ ఆరా తీయడానికి కూడా వీల్లేదన్న టీడీపీ బ్యాచ్ ఇపుడు చంద్రబాబు కోర్టు ఆదేశాల మేరకు జైలకు పంపితే అదే గవర్నర్ అవసరం అయ్యారా? అని రాజ్యాంగ నిపుణులు నిలదీస్తున్నారు. తమకో న్యాయం..ఎదుటి వారికి ఇంకో న్యాయమా అని వారు ప్రశ్నిస్తున్నారు. హూ ఈజ్ సీబీఐ? ఇదే కాదు 2018లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక.. బహుశా స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై పూణే జీఎస్టీ అధికారులు ఆరా తీసి ఉన్నారు కాబట్టి సీబీఐ అధికారులు తన అవినీతిపై దర్యాప్తు చేస్తారేమోనన్న భయంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హూ ఈజ్ సీబీఐ? అన్నారు. నా రాష్ట్రంలోకి సీబీఐ అడుగు పెట్టడానికి వీల్లేదు అని తనకే సాధ్యమైన దురహంకారంతో హుంకరించారు చంద్రబాబు. సీబీఐకి నో ఎంట్రీ అంటూ ఓ జీవో తెచ్చేశారు. చంద్రబాబు చిల్లర ఫిలాసఫీ తాను ప్రతిపక్షంలో పడగానే చంద్రబాబు ప్రతీ దానికీ సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. తన అవినీతిని వెలికి తీస్తారనుకుంటే సీబీఐ రాకూడదు. తన ప్రత్యర్ధులను ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి సీబీఐ వచ్చేయాలి. ఇదీ చంద్రబాబు చిల్లర ఫిలాసఫీ. 2019 ఎన్నికలకు ముందు ధర్మపోరాట డ్రామాలు చేసిన చంద్రబాబు అప్ కంట్రీ మీడియా ప్రతినిథులతో మాట్లాడుతూ హూ ఈజ్ మోదీ అన్నారు. తాను లోకేష్ తండ్రినని దేవాన్ష్ తాతనని.. భువనేశ్వరికి భర్తనని గర్వంగా చెప్పుకోగలనని.. కానీ మోదీ ఎవరు? అని చంద్రబాబు నిలదీసేసరికి జాతీయ మీడియా ప్రతినిధికి నవ్వాలో ఏడ్వాలో కూడా అర్ధం కాక అయోమయం అయిపోయారు. మోదీతో అవసరం లేదనుకొని.. 2019ఎన్నికల్లో మోదీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు అంచనా వేసుకున్నారు. అందుకే మోదీతో అవసరం లేదనుకున్నారు. అందుకే మోదీని పట్టుకుని హూ ఈజ్ మోదీ అన్నారు. అక్కడితో ఆగకుండా వ్యక్తిగత దూషణలకూ దిగారు. మోదీని ఇంటికి పంపేస్తానన్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు జావగారిపోయారు. మోదీ ఓడిపోతారనుకుని అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశామే అని నాలిక్కర్చుకున్నారు. తాను అన్న మాటలకు మోదీ కక్షగట్టేసి తన అవినీతిని వెలికి తీసి జైలుకు పంపేస్తారేమోననా భయపడ్డారు. చదవండి: ‘బాబు అరెస్ట్‌తో హరికృష్ణ ఆత్మకూడా శాంతిస్తోంది’ మా నాన్నను కాపాడండి ప్లీజ్ అంటూ.. ఆ భయంతోనే తమ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను గుట్టు చప్పుడు కాకుండా కన్నకూతుళ్లను పెళ్లి చేసి అత్తారింటికి పంపినట్లు బీజేపీలోకి లాంఛనాలతో పంపేశారు. మోదీనే కాదు.. నాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను పట్టుకుని హూ ఈజ్ అమిత్ షా? అని కూడ నిలదీశారు చంద్రబాబు. కాలమహిమో చంద్రబాబు ఖర్మమో తెలీదు కానీ.. ఇపుడు అదే అమిత్ షా దగ్గరకు బీజేపీ పెద్దమ్మను తీసుకుని నారా లోకేష్ కలిసి మా నాన్నను కాపాడండి ప్లీజ్ అని ప్రాధేయ పడాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలే ఇలా ఉంటుంది. అందితే జుట్టు అందకుంటే కాళ్లు. హూ ఈజ్ గవర్నర్? హూ ఈజ్ సీబీఐ? హూ ఈజ్ అమిత్ షా? హూ ఈజ్ మోదీ? అని హుంకరించిన నోటితోనే గవర్నర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయిన దానికీ కాని దానికీ సీబీఐ కావాలంటున్నారు. మోదీని మించిన నాయకుడు లేనే లేడని భజన కీర్తనలూ అందుకుంటున్నారు. అమిత్ షాయే తమని ఆదుకోవాలని ఆశగా చూస్తున్నారు. ఇవన్నీ చూసిన వారు ఒకటే అడుగుతున్నారు.హూ ఈజ్ చంద్రబాబు? -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా నియామకమయ్యారు. అలాగే, ఒడిశా గవర్నర్‌గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1956లో జన్మించారు. ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1999 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడమేకాగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. 2003-07 వరకు బీజేపీ ఉమ్మడి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2014లో బీజేపీ జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. 2020లో బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. ఇటీవలే ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, చేరికల కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి తరువాత దత్తాత్రేయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, జార్ఖండ్ బీజేపీ నేత అయిన రఘుబర్ దాస్ 2014-19 మధ్య ఆ రాష్ట్ర సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేశారు. శిబు సొరెన్ హయాంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. రఘుబర్ దాస్ ప్రస్తుతం బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో నా పేరు ఉంటుంది: రాజాసింగ్ -
Bathukamma Celebrations: రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై (ఫొటోలు)
-
ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్/వరంగల్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 23 ఏళ్ల ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆమె మృతిపట్ల ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్, టీఎస్పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ‘గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అకాల మరణం.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లను గుర్తుచేస్తుంది. గ్రూప్2కు సన్నద్ధమవుతున్న ప్రవళిక.. ఉద్యోగ పరీక్షల వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు దైర్యంగా ఉండండి. నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక పంపాలి’ అంటూ తమిళిసై పేర్కొన్నారు.. అంతిమయాత్రలో స్పల్ప ఉద్రిక్తత వరంగల్‌లోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో నిర్వహించిన ప్రవళిక అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేయూ, ఓయూ జేఏసీ విద్యార్థుల ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి జేఏసీ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగాయి. కాగా గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ప్రవళిక అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు. తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యతో ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో విషాదం అలుముకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. జయ- లింగయ్య దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కాగా..కూతురు ప్రవళిక ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్-2ప్రిపేర్ కోసం హైదరాబాద్ హాస్ట్‌లో ఉంటుంది. ప్రవళిక అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓయు, కేయు జేఏసీ ప్రతినిదులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యా అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సిగ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
అసలు మీకు గవర్నర్‌గా అర్హత ఉందా?: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ప్రభుత్వానికి షాకిచ్చారు. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించారు. దీంతో గవర్నర్ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ .. ఇద్దరు సమర్ధవంతులైన వ్యక్తులను ఎమ్మెల్సీ లుగా నామినేట్ చేసి పంపాం. వారిద్దరూ మంచి పేరున్న నేతలు కాబట్టే ప్రభుత్వం సిఫారసు చేసింది. గవర్నర్ నుంచి పాజిటివ్‌గా రిప్లై వస్తుందని భావించాం. కానీ ఆమె తీరు అస్సలు బాగాలేదు. మేము సిఫారసు చేసిన అభ్యర్థులకు అర్హత లేదంటున్నారు. అసలు మీకు గవర్నర్‌గా అర్హత ఉందా అని ప్రశ్నిస్తూనే ఆమె ఈ పదవికి అన్ ఫిట్ అన్నారు. బాధ్యతాయుతమైన గవర్నర్ పదవిలో ఉంది ఈ తరహా వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఖండిస్తున్నామన్నారు. ఆమె ఒక గవర్నర్ లా కాకుండా మోడీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికల హడావిడి మొదలైన తర్వత వీరి హడావుడి మరీ ఎక్కువైంది. మేము అధికారంలోకి వచ్చి తొమ్మిదినర ఏళ్లయింది. ఇప్పటికీ కొంత మందికి పాత అలవాటు పోవటం లేదు. తెలంగాణ పై నిరంతరం విషం చిమ్ముతునే ఉన్నారు. అక్టోబర్ 1న మోదీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. తెలంగాణ ఏర్పాటుపై మోదీ ఎందుకు నిత్యం విషం చిమ్ముతున్నారు? సందర్భం లేకుండా ప్రతి సారి పగబట్టినట్లు మాట్లాడున్నారు.. అంత అవసరమేముంది? పార్లమెంట్ సాక్షిగా మోదీ అనేక సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా అజ్ఞానంతో మాట్లాడారు. ఆయన మాటలు జ్ఞానం లేదు సరికదా అంతా అజ్ఞానమే కనిపిస్తుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సెషన్ 'అమృత కాలం'లో కొత్త పార్లమెంట్ లో తెలంగాణ ప్రజలపై విషం చిమ్మారు. 2014, 2018లో బీజేపీ పార్టీ ఎలాగైతే పుట్టగతులు లేకుండా పోయిందో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ అడ్రస్ లేకుండా కొట్టుకుపోతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించింది. దీనిపై కూడా మోదీ తన అక్కసును వెళ్లగక్కారు. అసలు ఉత్సవాలు జరగలేదంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు రానున్న మోదీ వెనకబడిన జిల్లాకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి. జూలై 14,2014 లో కృష్ణా నది వాటా తేల్చాలని అడిగితే ఇప్పటికీ దిక్కులేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు.. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించామని కోరాము. పాలమూరు ఇప్పుడు పచ్చబడుతుంటే బీజేపీకి ప్రేమ పుట్టుకొచ్చింది. బీజేపీ పక్షపాత ధోరణిలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో తీరుగా పని చేస్తోందన్నారు. అసలు మీది జాతీయ పార్టీయేనా? కాదా? ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. ఇది కూడా చదవండి: గవర్నర్ తీరు బాధాకరం: కవిత -
గవర్నర్ తీరు బాధాకరం: కవిత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పంపించిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందని అన్నారు. బడుగు బలహీనర్గాలకు చెందిన వ్యక్తులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే ఆపటం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీ వర్గాలకు పెద్ద పీట వేస్తోందని అన్నారు. #WATCH | BRS MLC K Kavitha says, "Rejecting the 2 names proposed by BRS for the MLC seats is nothing but a clear violation of the federal spirit of the nation. This nation is a federal nation and it works on federal traditions that were established a long time back and that kind… pic.twitter.com/GrwjdeX42J — ANI (@ANI) September 26, 2023 చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో నివాళులు అర్పించిన కవిత అనంతరం మాట్లాడుతూ.. 'గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా. రాజ్యాంగ బద్దంగా పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు సరికాదు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం దేశంలో అమలు అవుతుంది.' అని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండ ప్రకాశ్.. తెలంగాణ ఉద్యమం లో ఆమె పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అందుకే తెలంగాణ వచ్చాక ఆమె పేరును స్మరిస్తూ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై -
ఖైరతాబాద్ మహా గణేశుడి తొలిపూజలో గవర్నర్ తమిళి సై
హైదరాబాద్: ఖైరతాబాద్ లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణేశుడికి తొలిపూజ జరిగింది. పూజా కార్యక్రంమలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఖైరతాబాద్ లో గణేశుడు ఈసారి శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈరోజు మహాగణపతి నిర్వహించిన తొలిపూజలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకాగా భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని తలెత్తకుండా అన్ని విభాగాలను సమన్వయము చేశామన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. నిమజ్జనం వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గవర్నర్ తమిళి సై మహా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అంతా సుఖశాంతులతో, ఆరోగ్యాంగా ఉండాలని ఖైరతాబాద్ గణేషుడిని కోరుతున్నానన్నారు. ఇది కూడా చదవండి: Traffic Diversions:నేడు మహాగణపతికి గవర్నర్ తమిళిసై పూజలు.. -
గవర్నర్ పేరుతో టీడీపీ దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్ట్.. రిమాండ్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలో టీడీపీ నేతలు గవర్నర్ పేరుతో రకరకాల ప్రచారాలకు తెరలేపారు. గవర్నర్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చారని, కలవడానికి తమ నేతలు వెళుతున్నారని ప్రకటనలు విడుదల చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు గవర్నర్ తమ పార్టీనేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. తర్వాత కొద్దిసేపటికి అపాయింట్మెంట్ మరునాటికి మారిందని టీడీపీ వర్గాలు మాట మార్చాయి. వాస్తవానికి శనివారం గవర్నర్ విశాఖపట్నంలో ఉన్నారు. ఆ విషయం తెలిసి కూడా టీడీపీ జనాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించింది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు గవర్నర్‌ను కలుస్తున్నట్లు ప్రచారం చేశాయి. కానీ.. అది కూడా జరగలేదు. మరోవైపు ఎల్లో మీడియా ఒకడుగు ముందుకు వేసి చంద్రబాబు అరెస్ట్ పట్ల గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, తనకు తెలియకుండా ఎలా జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారానికి దిగాయి. శనివారం సాయంత్రం చంద్రబాబు అరెస్ట్‌పై వివరణ ఇవ్వాలని గవర్నర్ సీఐడీ అధికారులను కోరారని, వాళ్లు ఫైళ్లు పట్టుకుని పరుగులు పెడుతున్నారని వార్తలు ప్రసారం చేశాయి. చివరకు అవన్నీ ఎల్లో మీడియా పుకార్లేనని తేలింది. కోర్టులో ఉత్కంఠ నెలకొన్న తరుణంలో కావాలని రకరకాల ప్రచారాలకు తెరలేపి ప్రజల్లో గందరగోళం సృష్టించారు. -
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం తనకు కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు, ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించేలా చూడాలన్నారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావుతో కలిసి అరుణ వినతిపత్రం సమర్పించారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన రాజపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. గద్వాల అసెంబ్లీ స్థానానికి సంబంధించిన పరిణామాల గురించి అడిగి తెలుసుకున్న గవర్నర్, అరుణతో ప్రమాణస్వీకారం చేయించేలా అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పినట్టు బీజేపీ వర్గాల సమాచారం. అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ తన ప్రమాణానికి ఏర్పాట్లు చేయాలని రెండుసార్లు అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరన్నారు. దీనిపై వారి నుంచి ఎలాంటి సమాధా నం రాకపోవడంతో గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. -
గవర్నర్‌గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తమిళిసై
-
ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె!
హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై సాక్షి ప్రతినిధి ఆమెతో ముచ్చటించారు. పాలిటిక్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలు కూడా చాలా ఇష్టం. అందుకే అనేక సంవత్సరాలుగా పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొంటున్నాను. నాన్న అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారా? జవాబు: నాన్న చిన్నప్పటి నుంచి నేరి్పన నీతి, నైతిక విలువలు, క్రమ శిక్షణతో పాటు ఆయన కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చాను. 2014, 2019, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటూ.. వస్తున్నాను. మా నాన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గత 35–40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండటంతో ప్రతి కార్యకర్త, నాయకులతో పరిచయాలు ఉన్నాయి. మా ఇళ్లు, పార్టీ వేర్వేరు అని ఏనాడు అనుకోవడం లేదు. దీనికి తోడు అత్తగారి కుటుంబం కూడా రాజకీయాలతో ముడిపడిన కుటుంబమే. మా మామయ్య చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. ముషీరాబాద్ టికెట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు. మొదట పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలి. నేను ఎక్కడైనా సరిపోతానని పార్టీ అనుకుంటే పార్టీ అక్కడ నిలపెడుతుంది. నా వరకు నేను ఇప్పటి వరకు ప్రత్యక్షంగా అడిగింది లేదు. నేను అక్కడ నిలుచుంటానని చెప్పడం మేము నేర్చుకున్న సిద్ధాంతం కాదు. అలా అడగడం మా పార్టీలైన్ కాదు. ప్రజలు కోరుకుంటున్నారు కదా.? ప్రజలు ఖచ్ఛితంగా బీఆర్ఎస్ నుంచి వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విజయలక్ష్మిని కోరుకుంటున్నారని నేను అనుకోను. బీజేపీ అభ్యర్థిగా విజయలక్ష్మి సరిపోతుందని పార్టీ అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా.. ! డాక్టర్ లక్ష్మణ్ తరువాత మీపేరే ఎక్కువగా వినిపిస్తుంది? అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనే లైన్లో పనిచేసింది లేదు. బీజేపీ కార్యకర్తగానే గుర్తించబడటం నాకు ఇష్టం. ఒక వేళ అవకాశం కల్పిస్తే? అవకాశం కల్పిస్తే.. పూర్తి బాధ్యతాయుతంగా పార్టీకోసం పనిచేస్తాను. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి, తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిదేమో? మనం ఒక నిర్ణయానికి రావొద్దు, పార్టీ అధిష్టానం రావాలి. వేరే పారీ్టలాగ నేను ఇక్కడ నిల్చుంటేనే ఉంటా అనే పార్టీ బీజేపీ కాదు. బీజేపీకి క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ ఉంటుంది. పనిచేస్తూ.. పోవాలంతే.. ఫలితం ఆశించకూడదు. -
రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదానోత్సవం
కర్నూలు/మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మఠం ఆవరణలో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట వ్యక్తులుగా పేరు గాంచిన ప్రముఖులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులు ఎన్.చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ముంబై, విద్వాన్ రామ విఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ్ డి.కరడ్, పూణే గార్లకు రాష్ట్ర గవర్నర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారని, భక్త ప్రహ్లాద అవతారంగా భావిస్తారని పేర్కొన్నారు. తుంగ భద్రా తీరంలో వెలిసిన మంత్రాలయం ప్రముఖ పుణ్య క్షేత్రం అని ప్రశంసించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వ్యాస తీర్థ స్కీం, అన్నదాన స్కీం, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్రాణదాన స్కీం, గోరక్షణ కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సర్వ జన శాంతి పీఠం అని గవర్నర్ కొనియాడారు. శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందిన ప్రముఖులను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం అందచేశారు. సన్మాన గ్రహీతలు చేస్తున్న సేవలను అభినందించారు. అవార్డులు అందుకున్న ప్రముఖులు ప్రసంగిస్తూ, శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వీర వెంకట శ్రీశానంద, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్వాశ్రమ తండ్రి ఎస్.గిరియాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అది వైఎస్సార్సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట -
గచ్చిబౌలిలో మహిళపై హత్యాచారం.. గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగు చూసింది. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఓ నిర్మాణ సంస్థలో మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. అఘాయిత్యానికి ఒడిగట్టిన అనంతరం బండరాయితో తలపై మోది చంపేశారు. మృతురాలిని గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీకి చెందిన మహిళ (38)గా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కొడకుడు, ఒక కూతురు ఉన్నారు. బాధితురాలు వేస్ట్ మెటీరియల్‌ను తీసుకునేందుకు నిర్మాణ సంస్థలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళను బంధించి నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థలో నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు లేకుండా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని చూసి కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా శుక్రవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అవ్వగా.. నేడు ఆలస్యంగా మహిళ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గవర్నర్ ఆవేదన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై 48 గంటల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, సైబరాబాద్ సీపీలను ఆదేశించారు. చదవండి: ఎన్టీఆర్ జిల్లా: రన్నింగ్ కారులో మంటలు.. ఒక్కసారిగా -
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గురువారం ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అటుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎస్‌తో పాటు రాజ్‌భవన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే భేటీ సారాంశం అధికారకంగా బయటకు రాకపోయినా.. గవర్నర్‌తో ప్రత్యేక భేటీలో.. పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న బిల్లులపైనా సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల భేటీ తర్వాత.. పట్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆపై సీఎం కేసీఆర్, కేబినెట్‌తో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య నెలకొన్న గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం, ఆ చర్యపై ఆమె బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతుండడం చూస్తున్నాం. అదే సమయంలో ఆమె ముఖ్యమైన బిల్లులనూ పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు. -
మణిపుర్ గవర్నర్ మౌనమేల?
ఇంటి దీపమని ముద్దాడితే మీసాలు తెగకాల్చిందని సామెత. మణిపుర్లో కల్లోలం జాడలు కనబడి నప్పుడు అక్కడున్నది ‘డబుల్ ఇంజన్’ సర్కారే కదా అని ఉపేక్షించిన కేంద్ర ప్రభుత్వానికి తదుపరి కర్తవ్యం బోధపడటం లేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. సోమవారం ప్రారంభం కావాల్సిన మణిపుర్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల గురించి 24 గంటలు గడిచినా అతీగతీ లేకపోవటం దాన్నే సూచిస్తోంది. ఆగస్టు మూడోవారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని గత నెల 27న కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ప్రకటించారు. అందుకు సంబంధించిన సిఫార్సును ఈనెల 4న లాంఛనంగా గవర్నర్ అనసూయ ఊకే ఆమోదానికి పంపారు. అసెంబ్లీ ప్రోరోగ్ అయింది గనుక నిబంధనల ప్రకారం పక్షం రోజుల ముందు అసెంబ్లీ సమావేశాలపై రాజ్‌భవన్ నుంచి నోటిఫికేషన్ వెలువడాలి. కానీ ఆశ్చర్యకరంగా అలాంటిదేమీ జరగలేదు. హింసాకాండ మొదలై నాలుగు నెలలు గడిచినా ఇంతవరకూ రాష్ట్రంలో ప్రశాంతత ఏర్పడలేదన్నద వాస్తవం. హత్యాకాండలో 160 మందికి పైగా మరణించగా వందలాది మంది పౌరులు గాయ పడ్డారు. బాధితులు ఇప్పటికీ సహాయ శిబిరాల్లో తలదాచుకునే పరిస్థితులే ఉన్నాయి. భద్రతా బల గాలు సోదాలు నిర్వహిస్తూ పోలీస్ స్టేషన్ల నుంచి అపహరించిన మారణాయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకుంటున్నాయి. వివిధ నేరాలతో సంబంధమున్నదని భావిస్తున్న దాదాపు 1,500 మందిని అరెస్టు చేశారు. అయినా చెదురుమదురుగా ఎక్కడో ఒకచోట హింసాత్మక ఘటనలు జరుగు తూనే ఉన్నాయి. మరోపక్క కొండ ప్రాంతాలకు నిత్యావసర సరుకులు సరఫరా కాకుండా ప్రత్యర్థి మైతేయి తెగ అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ ఇంఫాల్–అస్సాంలోని సిల్చార్‌ల మధ్య ఉన్న 37వనంబర్ జాతీయ రహదారిని కుకీలు దిగ్బంధించారు. ఇంఫాల్–నాగాలాండ్‌లోని దిమాపూర్ మధ్య గల రెండో నంబర్ జాతీయ రహదారిపై సైతం ఉద్యమకారుల దిగ్బంధంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భద్రతా బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని మీడియా కథనాలు చెబుతున్నాయి. సమస్యల వలయం నుంచి మణిపుర్ ఇంకా బయటపడలేదన్నది నిజం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే భద్రతా కారణాల రీత్యా తాము హాజరుకావటం అసాధ్యమని వివిధ పార్టీల్లోని కుకీ తెగ శాసనసభ్యులు పదిమంది గవర్నర్‌కు విడివిడిగా వినతిపత్రాలు పంపిన మాట కూడా వాస్తవం. ఇందులో ఇద్దరు సభ్యులున్న అధికార కూటమి భాగస్వామ్య పార్టీ కుకీ పీపుల్స్ అలయెన్స్ కూడా ఉంది. నాగా తెగకు చెందిన మరో పదిమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావొద్దని మణిపుర్‌లోని యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) కోరడాన్ని విస్మరించలేం. అంతేకాదు, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి రాష్ట్ర సమగ్రత పరిరక్షణకు తీర్మానం చేయాలని మైతేయిలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ (కొకోమీ) గత జూలైలో జరిపిన ర్యాలీలో మాండ్ చేయటం కూడా వాస్తవమే. అలాగని కేబినెట్ సిఫార్సుపై గవర్నర్ మౌనం వహించటం సరికాదు. రాష్ట్రంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉనికిలో ఉంది. 60 మంది సభ్యులుండే అసెంబ్లీలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌కు ఇప్పటికైతే మెజారిటీ ఉంది. ఆయనకు మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎమ్మెల్యేలు ఎవరూ ప్రకటించలేదు. అసెంబ్లీ కూడా రద్దు కాలేదు. మణిపుర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత మార్చిలో జరిగాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగా వర్షా కాల సమావేశాలు నిర్వహించాల్సివుంది. అంటే వచ్చే నెల 2లోగా అసెంబ్లీ సమావేశం కావాలి. అటువంటప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయకపోతే అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? గవర్నర్ విధి నిర్వహణ మంత్రివర్గం సలహాలకు లోబడివుంటుందని రాజ్యాంగంలోని 163వ అధి కరణ చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లేదా దాని ప్రోరోగ్, అసెంబ్లీ రద్దు అధికా రాలు గవర్నర్‌కు ఉంటాయని 174వ అధికరణ వివరిస్తోంది. అయితే మంత్రివర్గాన్ని సంప్రదించి మాత్రమే ఈ అధికారాలను వినియోగించాల్సి వుంటుందని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2016లో తీర్పునిచ్చింది. మణిపుర్లో రాజ్యాంగసంక్షోభం ఏర్పడిందని గవర్నర్ భావించివుండొచ్చు. ప్రభుత్వానికి తగిన మెజారిటీ లేదని అనుకొని వుండొచ్చు. అదేమిటో ప్రకటించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు లేదా? అంతా సవ్యంగా ఉందనుకుంటే సమావేశాల నోటిఫికేషన్ విడుదలకు అభ్యంతరం దేనికి? సమస్యలున్నప్పుడే ప్రజలెన్నుకున్న సభల ప్రాధాన్యత పెరుగుతుంది. చుట్టుముట్టిన ఉద్రిక్త పరిస్థితులను ఉపశమింపజేయడానికి అనుసరించాల్సిన మార్గాలపై చర్చిస్తే, సభ్యుల అభిప్రా యాలు పరిగణనలోకి తీసుకుని నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందిస్తే, ఏకగ్రీవ తీర్మానం ద్వారా ప్రజానీకానికి భరోసా ఇవ్వగలిగితే దాని ప్రభావం ఎంతో ఉంటుంది. అందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించటం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు, రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే చర్య కూడా. చిత్రమేమంటే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సిద్దార్థ్ మృదుల్‌ను నియమించాలన్న జూలై 5 నాటి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఫైలును మణిపుర్ సర్కార్ ఆమోదానికి కేంద్రం పంపింది. అదేమైందో తెలియదు. మణిపుర్లో సర్కారు ఉంటే అది సక్రమంగా పని చేస్తున్నదో లేదో తేల్చవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది. నిరవధిక అనిశ్చితి మణిపుర్‌ను మరింత సంక్షోభంలోకి నెడుతుందని అందరూ గుర్తించాలి. -
తగ్గేదేలేదు!
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్రవి, సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 13 ముసాయిదాలు రాజ్‌భవన్ ఇప్పటికే తుంగలో తొక్కింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని గవర్నర్ ప్రదర్శించారు. అదే సమయంలో గుట్కా తదితర కేసుల విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదిక విషయంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులకు అభయం కల్పించే విధంగా గవర్నర్ కొత్త మెలికలు పెట్టారు. ప్రభుత్వం నుంచి పంపించే ప్రతి నివేదికను కొద్ది రోజులు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత వెనక్కి పంపించడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈ పరిణామాలు డీఎంకే పాలకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ను ఓ రాజకీయ నాయకుడిగా చిత్రీకరిస్తూ డీఎంకే మంత్రులు, కూటమి పార్టీలు సవాళ్లను విసిరే పనిలో పడ్డాయి. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలనే హెచ్చరికలు చేస్తూ వస్తున్నాయి. ఆదివారం నీట్ వ్యవహారంలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా అధికార పక్షానికి చెందిన అనుబంధ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాయి. ఇందులో మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌తో పాటు మరికొందరు గవర్నర్‌ను ఏక వచనంతో పిలుస్తూ, తీవ్రవిమర్శలు, ఆరోపణలు, హెచ్చరికలు, సవాళ్లు చేశారు. అయితే, వీటన్నింటికి తాను భయ పడబోనని , ఇంకా చెప్పాలంటే తగ్గేదేలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం గవర్నర్ ఆర్ఎన్రవి దూకుడు పెంచడం గమనార్హం. టీఎన్పీఎస్సీపై పీఠముడి.. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న టీఎన్పీఎస్సీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి జూన్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చైర్మన్ పదవిలో అప్పటి డీజీపీ శైలేంద్రబాబును నియమించేందుకు నిర్ణయించారు. పదవీ విరమణ చేయగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి గౌరవించే విధంగా సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. శైలేంద్రబాబుతో పాటు మరో 8 మంది సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేయాలని రాజ్‌భవన్‌కు పంపించిన సిఫార్సును రెండు నెలలుగా పట్టించుకోలేదు. ఈక్రమంలో ఎట్టకేలకు మంగళవారం ఈ నివేదికకు వ్యతిరేకంగా గవర్నర్ స్పందించారు. చైర్మన్, సభ్యుల నియామకంపై అనేక ప్రశ్నలు సంధించారు. ఎంపికకు ముందుగా బహిరంగ ప్రకటన ఇచ్చారా..? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించారా..? అని ప్రశ్నలు సంధించారు. అలాగే అనేక నిబంధనలను ఉల్లంఘనలను ఎత్తి చూపుతూ నివేదికను వెనక్కి పంపించారు. ఈ ఘటన డీఎంకే పాలకులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఏదేని నివేదిక, ఫైల్స్‌ను ఆమోదం కోసం పంపిస్తే కొన్ని నెలలు, లేదా సంవత్సరం కాలానికి పైగా పెండింగ్‌లో పెట్టడం..తర్వాత వెనక్కు పంపించడం ఈ గవర్నర్‌కు పరిపాటిగా మారిందని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మండి పడ్డారు. అదే సమయంలో టీఎన్పీఎస్సీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న దృష్ట్యా, గవర్నర్‌కు వివరణ ఇవ్వడమా..? లేదా, తన అధికారాలను ప్రయోగించి నేరుగా సీఎం ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో గవర్నర్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వ్యతిరేకంగా విద్యాసంస్థలకు లేఖలు రాయడం రచ్చకెక్కింది. స్టేట్ సిలబస్ అమలుచెయొద్దని వర్సిటీలకు ఆదేశాలు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వయంప్రతిపత్తిహోదా కలిగిన విద్యా సంస్థలు, వర్సిటీల పరిధిలోని కళాశాలలో ఒకే రకమైన సిలబస్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఆదేశాలు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా వర్సిటీలకు, విద్యా సంస్థలకు గవర్నర్ ప్రత్యేక ఆదేశాలతో లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. తమిళనాడు ఉన్నత విద్యలో జనరల్ సిలబస్‌కు ఆస్కారం లేదని వివరించారు. అనేక విద్యా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వచ్చిన సమాచారం, ఫిర్యాదులు, వివరాల మేరకు జనరల్ సిలబస్ అమలును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, విద్యాప్రమాణాలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా పరంగా పార్లమెంట్లో చేసిన చట్టం మేరకు అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు వివరించారు. ఇక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్ సిలబస్ తీసుకొచ్చిందని, దీనిని అమలు చేయవద్దని అన్ని విద్యా సంస్థలను గవర్నర్ ఆదేశించడం గమనార్హం. అలాగే మద్రాసు పేరును గతంలోనే ప్రభుత్వం చైన్నెగా మార్చేసింది. దీంతో అప్పటి నుంచి చైన్నె డేగా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చైన్నె డే అని కాకుండా, మద్రాసు డే అని పేర్కొంటూ గవర్నర్ మంగళవారం శుభాకాంక్షల తెలియజేస్తూ లేఖ విడుదల చేయడాన్ని తమిళాభిమానులు వ్యతిరేకిస్తున్నారు. -
ఆర్టీసీ లో ‘ఆగస్టు’ టెన్షన్
ఆ 183 మంది ఆర్టీసీ ఉద్యోగులుగానే రిటైర్మెంట్ తీసుకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అందే అన్ని రకాల బెనిఫిట్స్ పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియ ఆలస్యమవుతున్న కొద్దీ వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. కోరుకున్న అవకాశం అందినట్టే అందిచేజారిపోతుందనే బాధ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించేందుకు సిద్ధమని ఇటీవల ఆర్టీసీ చైర్మన్ స్వయంగా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులూ వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు, వారు పనిచేస్తున్న విభాగాల వారీగా ఆర్థికశాఖకు వెళ్లాయి. జీతాలు చెల్లింపునకు అంతా సిద్ధమవుతోంది. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టుగా ప్రభుత్వ ఉత్తర్వు మాత్రం జారీ కాలేదు. ఏ తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలో ఆ ఉత్తర్వులో పేర్కొనాల్సి ఉంది. ఆ తేదీ విషయంలో స్పష్టత లేకపోయేసరికి ఇప్పుడు ఆర్టీసీ లో గందరగోళం నెలకొంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్టీసీలో 183 మంది పదవీ విరమణ పొందాల్సి ఉంది. రిటైర్మెంట్కు ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉత్తర్వు వెలువడకపోవటంతో తాము విలీన ప్రక్రియ కంటే ముందే విరమణ చేయాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ వారిలో ఉంది. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని గత నెల31నే మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. దీంతో తాము కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేయొచ్చని ఈ 183 మంది ఆశపడ్డారు. కానీ నెలాఖరు సమీపిస్తున్నా, అసలు తంతు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ ఆమోదంలో జాప్యంతో..: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లును ఈ నెల 6వ తేదీన శాసనసభ ఆమోదించింది. ఆ వెంటనే బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజ్‌భవన్ దానిపై ఆమోదముద్ర వేయలేదు. పది రోజులు దాటినా గవర్నర్ ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. తాజాగా ఆ బిల్లుపై సందేహాల నివృత్తికి న్యాయశాఖ కార్యదర్శి అభిప్రాయం కోసం పంపినట్టు రాజ్‌భవన్‌వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. దీంతో బిల్లుపై గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఉత్తర్వు జారీకి మరికొంత సమయంపట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్టేనా ? ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ పరిధిలోకి వస్తే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి సీనియర్ డిపో మేనేజర్ వరకు పెద్దగా ప్రయాజనం లేకున్నా, కిందిస్థాయి ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో మంచి పెరుగుదల ఉంటుంది. గ్రాట్యూటీ, పీఎఫ్ మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పీఆర్సీ వస్తే జీతాలు పెరుగుదల మరింతగా ఉంటుంది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండగా, ప్రభుత్వంలో అది 61 ఏళ్లుగా ఉంది. దీంతో ఒక సంవత్సరం ఎక్కువగా పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. పెరిగిన జీతం 12 నెలల పాటు అందుకునే వీలు చిక్కుతుంది. ఉద్యోగ భద్రతకు భరోసా ఉంటుంది. -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
కళ తప్పిన తెలంగాణ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం
-
రాజ్‌భవన్ ఎట్‌హోం.. సీఎం జగన్ దంపతుల హాజరు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు, ధర్మాన, జోగి రమేష్, చెల్లబోయిన వేణు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించారు. -
తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య మళ్లీ పెండింగ్ బిల్లుల లొల్లి...!
-
ఆర్టీసీ ఉద్యోగులకు ఇక ట్రెజరీ జీతాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్‌కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్‌భవన్‌కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం ప్రస్తుత వేతనాలే..! ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు. -
జవహార్ నగర్ బాధితురాలికి అండగా మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జవహార్ నగర్లో జరిగిన దుశ్శాసన పర్వం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో బాధితురాలికి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అండగా నిలిచారు. ఆమెకు పెళ్లి చేయడంతో పాటు ఉద్యోగం ఇప్పించే బాధ్యతను ఆయనే తీసుకున్నారు. బాలాజీ నగర్లో మద్యం మత్తులో ఓ కీచకుడు ఆమె దుస్తులు చించేసి.. నగ్నంగా రోడ్డుపై నిలబెట్టిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చుట్టూ వంద మంది ఉన్నా ఎవరూ ఆమెను రక్షించే ప్రయత్నం చేయకపోగా.. ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ ఉదంతంపై బాధితురాలు మీడియా ముందు వాపోయింది కూడా. అయితే.. ఈ కేసులో పోలీసులు బాధితురాలికి అండగా నిలవడంతో పాటు నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అయితే ఆ బాధితురాలికి మంత్రి మల్లారెడ్డి అండగా నిలబడ్డారు. బాధితురాలికి(28) మున్సిపల్ కార్పోరేషన్లో ఉద్యోగం ఇప్పించడంతో పాటు ఆమె పెళ్లి చేసేందుకు కూడా ఆయన ముందుకొచ్చారు. అంతేకాదు.. ఆమెకు డబుల్ బెడ్రూం ఇవ్వాలంటూ అధికారులకు సైతం మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్‌లోనూ ఆమె యోగక్షేమాలన్నీ తానే చూసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు అభయం ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి. గవర్నర్ ఆరా జవహార్ నగర్లో మహిళను వివస్త్ర చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. మహిళా కమిషన్ సీరియస్ జవహార్ నగర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ.. డీజీపీ నుంచి వివరణ కోరింది. -
గవర్నర్‌కు జ్ఞానోదయం అయినందుకు సంతోషం: సీఎం
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ పాపం తెలిసో తెలియకో అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నారు. ఎందుకు పని పెట్టుకున్నారో తెలియదు. 96 క్లారిఫికేషన్లు అడిగారు. ఆ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్నవే. మొత్తం మీద గవర్నర్‌కు జ్ఞానోదయమై ఆదివారం మధ్యాహ్నం బిల్లుకు ఆమోదం తెలిపి పంపినందుకు సంతోషం. ప్రభుత్వం, ఆర్టీసీ ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం..’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘ఆర్టీసీని పెట్టిందే ప్రజారవాణా ఉండాలని. కాలక్రమేణా సంస్థ నష్టాల్లో పడింది. నేను రవాణా మంత్రిగా అంకితభావంతో పనిచేసి రూ.14 కోట్ల నష్టంలోని సంస్థను రూ.14 కోట్ల లాభాల్లోకి తెచ్చా. శక్తిసామర్థ్యాలుంటే సంస్థ నష్టాలను పూడ్చవచ్చు. కానీ డీజిల్ ధరల పెరుగుదలతో పరిస్థితి చేయిదాటింది. తమను ప్రభుత్వంలోకి తీసుకోవాలని గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, తగిన డబ్బిస్తామని నడిపించుకోవాలని చెప్పాం. లాభాలు తీసుకురావాలని బెస్ట్ ఐపీఎస్ అధికారిని నియమించాం. మంచి అనుభవమున్న బాజిరెడ్డి గోవర్దన్‌ను చైర్మన్‌ను చేశాం. వారు విశ్వప్రయత్నాలు చేసినా డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో నష్టాలు మరింత పెరిగాయి. డీజిల్ లీటర్ రూ. 60 నుంచి రూ.110 కావడంతో ఆమాంతంగా ఖర్చు పెరిగి రోజుకు రూ.2.5 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఇటీవల కేబినెట్లో.. గతంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలపొద్దని అనుకున్నామని, ఇప్పుడేం చేద్దామని చర్చించాం. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రభుత్వానికైనా సామాజిక బాధ్యత. పైగా ఆర్టీసీని తీసేయడానికి లేదు. అది మంచి నైపుణ్యాలున్న సంస్థ. జీరో యాక్సిడెంట్‌తో ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. కానీ అది మనుగడ సాగించే అవకాశం లేదు. దీంతో ప్రభుత్వమే సాకాలి. మరో దారిలేదు. ఇప్పటికే ఏడాదికి బడ్జెట్లో పెట్టి మరీ రూ.1,500 కోట్లు వారికి ఇస్తున్నాం. ప్రభుత్వంలో లేదన్న పేరే తప్ప గవర్నమెంటే సాదుతోంది. కాబట్టి ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఉద్యోగులకు భద్రత వస్తుంది. సంస్థకు చిక్కులు పోతాయనే ఉద్దేశంతో విలీనం నిర్ణయం కేబినెట్లో తీసుకున్నాం’ అని కేసీఆర్ వివరించారు. భూములపై కన్ను అంటూ నీచంగా మాట్లాడుతున్నారు.. ‘గతంలో వద్దన్నవారే మళ్లీ ఎట్లా తీసుకున్నారని పిచ్చివాగుడు చేసే వాళ్లు ఉన్నారు. ప్రభుత్వం ఏ పనిచేసినా ఓ బాధ్యతతో, దృక్పథంతో, పరిశీలనతో చేస్తుంది. ఇక సగం సగం ఎందుకు పూర్తిగానే బాధ్యత తీసుకుందామని నిర్ణయించాం. మరో ఇద్దరు యువ ఐఏఎస్ అధికారులను పెట్టి ఆదాయం పెంచే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని కొందరు దుర్మార్గులు, నీచులు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంటి పిల్లవాడిని సాదుకోవాలి తప్ప చంపుకోలేము. మరిన్ని సౌకర్యాలు పెంచి, అవసరమైతే మరిన్ని స్థలాలు సేకరించి ప్రభుత్వ పరంగా సరీ్వసులు పెంచుతాం. ఆర్టీసీ ఉద్యోగులకూ పీఆర్సీ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేవి వారికి కూడా వస్తాయి’ అని సీఎం తెలిపారు. -
ఆర్టీసీ విలీనం డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
-
ఆర్టీసీ బిల్లుపై స్పందించిన గవర్నర్ తమిళిసై
-
వీడిన ఉత్కంఠ.. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. గవర్నర్ ఆమోదించిన ఆర్టీసీ డ్రాఫ్ బిల్లును అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. తమిళిసైతో జరిగిన భేటీ వివరాలను రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివసరాజు సీఎం కేసీఆర్‌కు తెలపనున్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌కు వెళ్లారు. దీంతో అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఇవాళే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెటే అకాశముంది. కాగా ఆర్టీసీ బిల్లును ఆమోదించే ముదు ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్‌తో భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. అధికారులు తెలిపిన వివరాలపై సంతృప్తి చెందిన గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆరే మళ్లీ సీఎం! -
ఆర్టీసీ ఉన్నతాధికారులకు రాజ్ భవన్ పిలుపు
-
గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం అనేక మలుపులు తిరుగుతోంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గవర్నర్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అధికారులు అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. వారు తెలిపిన వివరాలపై గవర్నర్ సంతృప్తి చెందితే వెంటనే బిల్లు ఆమోదించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన నేడు సభలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించేలా తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది. ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదు: గవర్నర్ తాను ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళిసై మరోసారి స్పష్టం చేశారు. ట్రాన్స్‌పోర్టు సెక్రటరీని పిలిచానని.. ఆర్టీసీ బిల్లులోని సందేహాలకు వివరణ అడిగి, సమగ్ర రిపోర్టు తీసుకుంటానని తెలిపారు. దీనిపై సాధ్యమైనంత తర్వగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న రాజ్‌భవన్‌కు పంపించింది. చదవండి: ఆర్టీసీ బిల్లుపై లొల్లి!. గవర్నర్ ఆ బిల్లును పరిశీలించి.. ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించగా.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు గవర్నర్. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇక శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. -
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
UPDATES తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. ఇవాళే(ఆదివారం) ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోద ముద్ర పొందడంతో అసెంబ్లీ సమావేశాల పొడిగింపు నిర్ణయం ఉపసంహరణ. తొలుత రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని నిర్ణయించారు. కానీ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం పొందడంతో పొడిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. దాంతో తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు అంటూ స్పీకర్ పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం ►1969 తెలంగాణ ఉద్యమంపై కాంగ్రెస్ కర్కశంగా వ్యవహరించింది ►భట్టి విక్రమార్క తన పాదయాత్రను రమ్మంగా వర్ణించారు ►మరో పర్యాయం పాదయాత్ర చేయాలని కోరుతున్నా ►పాదయాత్రలో ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు ►అది సహజమైన పరిణామం ►తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనసుల్ని తీవ్రంగా గాయపరిచింది కాంగ్రెసే ►బీజేపీ కూడా తెలంగాణను కించపరిచింది ► తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు ►సీఎల్పీకి మంత్రి ప్రశాంత్ రెడ్డి ►నిన్న అసెంబ్లీలో అవమానం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి ►కేటీర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు ►స్పీకర్ ముందు నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ►కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ► స్పీకర్‌తో ముగిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ ► సభను తప్పుదోవ పట్టించేలా అధికార పక్ష వ్యవహరిస్తోందని ఆరోపణ ► కేటీఆర్ సభలో అబద్దాలు మాట్లాడారు: సీఎల్పీ నేత భట్టి ► కట్టడి చేయాల్సిన స్పీకర్ కూడా పట్టించుకోవడం లేదు ►దీనిపై స్పీకర్ ముందు నిరసన చేస్తున్నాం. ►కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలి. అసెంబ్లీలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు నివాళులు ►తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన ► ఆర్టీసీ బిల్లుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్నుపడిందని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలోని గవర్నర్ అయినా బిల్లు పాస్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారని తెలిపారు. ► బిల్లుకు ఆమోదం తెలుపాలి అంటే ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని, అవసరమైతే అసెంబ్లీని రెండు రోజులు పొడిగించి ఆర్టీసీ బిల్లును ఆమోదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బిల్లు కోసం ప్రత్యేకంగా సెషన్ పెట్టాలని, దీనిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శించారు. ►తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తాను ఉండకపోవచ్చని అన్నారు. తనను అసెంబ్లీలో ఉండొద్దని కొంతమంది కోరుకుంటున్నారని ఆరోపించారు. నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయని, సభకు ఎవరు వస్తారో.. రారో తెలియదని అన్నారు. ►సభ నిర్వహాణ పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి సీతక్క వెళ్లిపోయారు. ►వరంగల్‌లో వరద నష్టంపై సమీక్ష చేశామని సభలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేస్తామని తెలిపారు. ధరణిలో చిన్న చిన్న సమస్యలున్నాయని వెంటనే వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో డ్రగ్స్ సమస్య ఉందని, దీని నియంత్రణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ►అసెంబ్లీలో జీరో అవర్ టైంలో ప్రజా సమస్యలు లేవనెత్తారు ఎమ్మెల్యేలు. ధూల్‌పేట సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. తాత్కాలిక ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజైన ఆదివారం ప్రారంభమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రెండో శాసనసభ ఆఖరి విడత సమావేశాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు నేటితో (ఆదివారం తెరపడనుంది. బీఏసీ సమావేశంలో నిర్ణయించిన మేరకు ఆదివారం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా ‘తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం’పై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చే అవకాశముంది. మరోవైపు ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు’శాసనసభలో పెట్టే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆదివారం ఉదయంలోగా ఈ బిల్లుకు గవర్నర్ అనుమతి తెలిపితే సభ ముందుకు ఈ బిల్లు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఐదు బిల్లులకు సభ ఆమోదం... మూడో రోజు సమావేశాల్లో ప్రశ్నోత్తరాల అనంతరం ‘పల్లె ప్రగతి– పట్టణ ప్రగతి’పై జరిగిన లఘు చర్చకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అనంతరం ఐదు బిల్లులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు–2023, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2023ను ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించగా ఫ్యాక్టరీల (తెలంగాణ సవరణ) బిల్లు– 2023ను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లు–2023ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు. తెలంగాణ పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు 2023ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ప్రవేశపెట్టిన ఈ బిల్లులను సభ ఆమోదించినట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత సభను ఆదివారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు. అంతకుముందు నిరుద్యోగ భృతి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్‌భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్‌భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు. -
ఆర్టీసీ బిల్లు జాప్యంపై బండి సంజయ్ కామెంట్లు
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్‌ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్‌పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన. ఇదీ చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఇది గుర్తుందా? -
టీఎస్ఆర్టీసీ బిల్లు రగడ: గవర్నర్ అడిగిన వివరణలపై సర్కార్ రిప్లై
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. దీనిపై రాజ్‌భవన్‌కు అధికారులు రిప్లై పంపించారు. ఇప్పటి కన్నా మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. విలీనం అయిన తర్వాత విధివిధానాలో అన్ని అంశాలు ఉంటాయని, కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ షెడ్యూల్ ఇష్యూ ఏపీలో ఎలా చేసిందో వాటికి అనుగుణంగా ఉంటుందని తెలంగాణ సర్కార్ తెలిపింది. కాగా, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరిన సంగతి తెలిసిందే. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. చదవండి: ఆర్టీసీ విలీనం: గవర్నర్, కేసీఆర్ సర్కార్ పంచాయితీ.. ‘బట్టకాల్చి మీదేస్తున్నరు’ -
ఆర్టీసీ ఉద్యోగుల ఛలో రాజ్‌భవన్.. స్పందించిన గవర్నర్, చర్చలకు సై!
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్లో న్యాయం ఎలా చేస్తారు? అన్న గవర్నర్.. ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను కోరారు. యూనియన్ నాయకులను గవర్నర్ చర్చలకు పిలిచారు. యూనియన్ నాయకులు రాజ్ భవన్ రావాలని ఆహ్వానం పంపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపనున్నారు. I am pained to know about the strike conducted by RTC employees creating inconvenience to common public...I want to convey that I am always with them even during the previous strike I was with them ..now also I am studying it carefully because their rights should be… pic.twitter.com/WXqTSWHj7Q — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 5, 2023 -
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. గవర్నర్‌తో ముగిసిన ఆర్టీసీ కార్మికుల చర్చలు
►ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్.. ఆ సంస్థ ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించారు. ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని ఆ సంఘం నేత థామస్‌రెడ్డి తెలిపారు. ►గవర్నర్ లేవనెత్తిన ఐదు అభ్యంతరాలపై తెలంగాణ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈనేపథ్యంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ►రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముట్టడికి ర్యాలీగా ఆర్టీసీ ఉద్యోగులు బయలుదేరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చలకు గవర్నర్ ఆహ్వానించారు. ►ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. గవర్నర్ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులను బహిష్కరించారు. రెండు గంటలపాటు బస్సులను బంద్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే బిల్లును వెంటనే గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో బస్సులన్ని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బంద్ పాటించారు. రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల అందోళనతో బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ ,ఉట్నూరు, బైంసా, నిర్మల్, అసిపాబాద్, మంచిర్యాల డిపోల ముందు ఆందోళన కొనసాగుతుంది. రెండు గంటల బంద్‌లో భాగంగా నల్లగొండ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. మరోవైపు డిపో వద్ద గురుకుల అభ్యర్థులు నిరసనకు దిగారు. పరీక్ష కోసం వెళ్లేందుకు బస్సులు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు సర్వీసులు నిలిపివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
వరంగల్‌లో గవర్నర్ పర్యటన.. స్వాగతం వరకు ఒకే.. తరువాత ఎక్కడ?
సాక్షి, వరంగల్ అర్బన్/హసన్‌పర్తి: వరంగల్ నగరంలో వరద ముంపునకు గురై సర్వస్వం కోల్పోయిన బాధితులకు సాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో దెబ్బతిన్న ప్రాంతాలను బుధవారం ఆమె సందర్శించారు. జవహర్‌కాలనీ, నయీంనగర్ నాలా, పోతననగర్, ఎన్టీఆర్ నగర్లలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంపు బాధితులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. వరద బాధితులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సమీకరించిన ఆరోగ్య కిట్లు, కిరాణా సరుకులను అందజేశారు. ఎన్టీఆర్ నగర్లో గవర్నర్ పర్యటిస్తున్న సమయంలో ఓ మహిళ వరదకు అన్నీ కొట్టుకుపోయాయని చెబుతూ ఆమెను పట్టుకుని రోదించారు. గవర్నర్ ఆ మహిళను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతాల్లో సత్వరం సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అ«ధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, వరద పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నారు. కేంద్ర బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ నష్టం అంచనా వేస్తున్నట్లు చెప్పారు. నివేదిక ఆ«ధారంగా కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. బాధితులకు సహాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తానన్నారు. గవర్నర్ వెంట గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ విజయ్‌చందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. చదవండి: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. ఉత్తమ్‌కు ప్రాధాన్యత స్వాగతం వరకు ఒకే.. ఆ తరువాత కమిషనర్ ఒక్కరే.. గవర్నర్ వరద ముంపు ప్రాంతాల పర్యటనలో బల్దియా కమిషనర్ మినహా జిల్లా అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొనలేదు. కాజీపేట నిట్‌కు చేరుకున్న గవర్నర్‌కు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్యలు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కానీ క్షేత్రస్థాయి పర్యటనకు వీరు రాలేదు. గవర్నర్ వెంట పలు కాలనీల్లో బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఒక్కరే ఉన్నారు. కాగా, గవర్నర్ పర్యటన ముగిసేదాకా పలువురు బీజేపీ నాయకులు ఆమె వెంటే ఉండటం గమనార్హం. -
పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ‘మనం కరెన్సీని కాదు.. కేలరీలను లెక్కించడం చాలా ముఖ్యం’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళా ఆరోగ్యంపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీలు, కౌమారదశలో ఉన్న బాలికల మానసిక, శారీరక శ్రేయస్సు ప్రధానమని పేర్కొన్నారు. బాల్యం నుంచే బాలికలకు యోగా, శారీరక వ్యాయామం, సంప్రదాయ ఆహార ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం ఇస్తున్నారో తెలుసుకోవాలంటే పిల్లల టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని ఆమె సూచించారు. గతంలో తాను ఒకసారి అలా టిఫిన్ బాక్సులను పరిశీలించానని, చాలా బాక్సుల్లో బయటి నుంచి బర్గర్లు, చిప్స్, పఫ్స్, బిస్కెట్లు, స్నాక్స్ ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మహిళల ఆరోగ్య అవసరాలపై ఇంకా స్పష్టత రాలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి మరిన్ని మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయు ష్మాన్ భారత్‌లో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు వ్యాధుల కవరేజీని ఎక్కువగా పెంచారని ఆమె వెల్లడించారు. -
గవర్నర్ కాన్వాయ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు..
లక్నో: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్‌లోకి ఓ కారు దూసుకొచ్చింది. నోయిడాలో ఓ కార్యక్రమంలో పాల్గొని దిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సెక్యూరిటీ విషయంలో కూడా భద్రతా వైఫల్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. ఇదీ చదవండి: పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి -
గవర్నర్‌ను వదిలేసి వెళ్లిపోయిన విమానం.. అధికారుల సీరియస్
దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా సిబ్బంది కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ విమానాశ్రయం లాన్లో ఉన్నప్పటికీ.. ఆయనను వదిలేసి విమానాన్ని టేకాఫ్ చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ చర్య ద్వారా ఎయిర్ఏషియా సిబ్బంది ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని అధికారులు మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. గెహ్లాట్ గురువారం మధ్యాహ్నం టెర్మినల్ -2 నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది, అక్కడి నుండి ఆయన ఒక కాన్వకేషన్‌కు హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో రాయచూర్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకోసం ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. AirAsia సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, “విమానం బెంగళూరు నుండి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2:05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. గవర్నర్ బయలుదేరడానికి 4 నిమిషాల ముందు మధ్యాహ్నం 2:01 గంటలకు వచ్చారు. అయితే, భద్రతా తనిఖీలు, ఇతర ప్రోటోకాల్‌లు పాటించడం వల్ల బయలుదేరడానికి 15 నిమిషాల ముందు పూర్తి చేయాల్సి ఉంటుంది, అయితే వీఐపీ లాన్ నుంచి గహ్లోత్ టర్మినల్ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌కు టేకాఫ్ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ టర్మినల్ వద్ద బోర్డింగ్ గేట్‌కు చేరుకోవడం ఆలస్యం అవడం వల్లే విమానం వెళ్లిపోయినట్లు తెలిపారు. అయితే, గవర్నర్ మధ్యాహ్నం 1:35 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారని రాజ్‌భవన్ ప్రోటోకాల్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఎయిర్ఏషియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఘటన కారణంగా గహ్లోత్ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎయిర్ఏషియా ఈ ఘటనపై స్పందిస్తూ.. “ఈ ఘటనపై మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము. దీనిపై విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్‌లైన్ సీనియర్ నాయకత్వ బృందం ఆందోళనలను పరిష్కరించడానికి గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండటానికే మేం ప్రాధాన్యమిస్తాం. గవర్నర్ కార్యాలయంతో మా సంబంధాలను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. చదవండి: Video: పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
హీరో కృష్ణసాయిని అభినందించిన గవర్నర్ తమిళ సై
'సుందరాంగుడు' సినిమా హీరో కృష్ణ సాయిపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై ప్రశంసలు కురిపించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా తాము నిర్వహిస్తున్న కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా కృష్ణసాయి చేస్తున్న ప్రయత్నాన్ని గవర్నర్ అభినందించారు. సామాజిక అవగాహనలో భాగంగా MSK ప్రమిద శ్రీ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నం. 2 చిత్రంలో Danger ‘say no to Drugs..’ అనే ప్రత్యేక పాటను చిత్రీకరించారు. దర్శకుడు పిఎస్ నారాయణ రాసిన ఈ పాటలో హీరో కృష్ణ సాయి నటించారు. (ఇదీ చదవండి: హీరోకు ఏ మాత్రం తగ్గకుండా నటించిన ఈ 'మున్నీ' ఇప్పుడెలా ఉందంటే?) చాలా మంది యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకుని జీవితాలను నష్టపోతున్నారని, డ్రగ్స్ నిర్మూలనపై తమ కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని హీరో కృష్ణ సాయి తెలిపారు. డ్రగ్స్ అలవాటు పడిన వారు బయటకు రాలేకపోతున్నారని, నగరాల్లో డ్రగ్స్ బాధితులు చాలా మంది ఉంటున్నారని చెప్పారు. వారికి సరైన గైడెన్స్ దొరకడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు తాము ఆగస్టులో హైదరాబాద్‌లో సెమినార్ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసైని ఆహ్వానించామని కృష్ణసాయి చెప్పారు. తమ ప్రయత్నాన్ని అభినందించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కవిత, కేటీఆర్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్‌కు మరో లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశారు. మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేష్ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌పై తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కవిత, కేటీఆర్ సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్లలోని ఆధారాలు ఇవ్వాలని అడుగుతున్నారని అన్నారు. ఆధారాలు ఇస్తే రూ. 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీటు ఇస్తామని ఆశపెడుతున్నారని తెలిపారు. తన వద్ద రూ. 2 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు, కవితకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందన్నారు. ఈ ఆధారాలను ఇప్పటికే ఈడీకి 65- బి సర్టిఫికెట్ రూపంలో ఇచ్చానని, కవిత నుంచి రూ. 15 కోట్లు తీసుకొని కేజ్రీవాల్ తరపు వారికి ఇచ్చానని పేర్కొన్నారు. ఈ అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: మంత్రి హరీశ్‌ను కలిసిన ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించిన కేటీఆర్ మరోవైపు సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఘాటుగా స్పందించారు. నేరస్థుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని, వాడెవడో కూడా నాకు తెలియదని అన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్(పోకిరి) చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. సుకేష్ లాంటి మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. Just learnt from media that a delusional fraudster and a noted criminal called Sukesh has made some ludicrous allegations about me I have never heard of this rogue and intend to pursue strong legal action against him for his nonsensical utterances Request media also to be… — KTR (@KTRBRS) July 14, 2023 -
గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మాటామంతి.. పక్కపక్కనే కూర్చొని!
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య పలు అంశాలపై అంతరం నెలకొన్నప్పటికీ మంగళవారం వారిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం సర్వత్రా ఆసక్తి రేపింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ విమానాశ్రయంలో తమిళిసై, సీఎం కేసీఆర్ మాట్లాడుకుంటూ కనిపించారు. రాష్ట్రపతి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ విమానం రాక కోసం ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న సమయంలో తమిళిసై, కేసీఆర్ ఏదో అంశాన్ని చర్చిస్తున్నట్లు కనిపించింది. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి సీఎం కంటే ముందే గవర్నర్ విమనాశ్రయానికి రావడం, ఆమె కూర్చున్న పక్కనే ఉన్న సోఫాలో సీఎం కూడా కూర్చొని మాట్లాడుకోవడం గమనార్హం. కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు ఉత్సవాలను మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తెలుగులో ‘అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు’ అంటూ రాష్ట్రపతి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. చదవండి: Kishan Reddy: అందుకే కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు, ఈటలకు కీలక పదవి President Droupadi Murmu arrived at Hakimpet Air Force Station in Hyderabad, warmly welcomed by @TelanganaCMO KCR, Governor @DrTamilisaiGuv, Union minister @kishanreddybjp and others.#Hyderabad #DroupadiMurmu #KCR pic.twitter.com/V7VRFeIU1Y — Surya Reddy (@jsuryareddy) July 4, 2023 -
హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించిన గవర్నర్ తమిళసై (ఫొటోలు)
-
హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని సందర్శించి.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కొందరు హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారంటూ చురకలంటించారాయన. రాజ్యాంగ పదవిలో ఉండి కొందరు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చాక నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయ్. కొందరు కళ్లు ఉండి మంచి చూడలేరు.. చెవులు ఉండి మంచి వినలేరు.. మంచి మాటలు మాట్లాడలేరు అంటూ వ్యాఖ్యానించారాయన. ఉస్మానియా కొత్త బిల్డింగ్ నిర్మాణానికి లీగల్ సమస్యలు ఉన్నాయని హరీష్ రావు తెలిపారు. అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. నిమ్స్‌లో గొప్ప గొప్ప డాక్టర్లు పని చేస్తున్నారని, నిమ్స్‌కు ప్రత్యేకంగా కేసీఆర్ ప్రత్యేకంగా రూ. 150 కోట్లు రిలీజ్ చేశారు. ఆస్పత్రిలో 900 నుంచి 1500కి పడక గదులు పెంచాం అని తెలిపారాయన. కొత్త భవనం నిర్మాణానికి సంబంధించి ఏకాభిప్రాయం అవసరం ఉందని, ఆ సేకరణ నివేదికను హైకోర్టుకు అందిస్తామని, హైకోర్టు నుంచి అనుమతులు రాగానే కొత్త భవనం నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారాయన. ఇదీ చదవండి: నాది రాజకీయం కాదు