
న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజవంశీకుడైన ఆయన రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లలో బీజేపీలో చేరారు. 2018–23 వరకు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా. జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధా దేవ్‌వర్మ. వర్మను తెలంగాణ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
అలాగే ఓంప్రకాశ్ మాథుర్ సిక్కిం గవర్నర్‌గా, హరిభావు కిషన్‌రావు బాగ్డే రాజస్తాన్ గవర్నర్, సి.హెచ్.విజయశంకర్ మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంతోష్ కుమార్ గంగ్వార్ జార్ఖండ్‌కు, రామెన్ డేకా చత్తీస్‌గఢ్‌కు గవర్నర్లుగా నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌ను మహారాష్ట్రకు మార్చారు. అలాగే అస్సాం గవర్నర్ గులాబ్‌చంద్ కటారియాను పంజాబ్‌కు మార్చి చండీగఢ్ అడ్మిని్రస్టేటర్‌గా కూడా బాధ్యతలు అప్పగించారు. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్‌గా నియమించి మణిపూర్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చా రు. కె.కైలాస్‌నాథ్‌ను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు.
