డ్రగ్స్‌కు హబ్‌గా గుజరాత్‌: తమిళనాడు మంత్రి | Tamilnadu Minister Sensational Comments On Gujarat | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌కు హబ్‌గా గుజరాత్‌: తమిళనాడు మంత్రి

Published Wed, Oct 9 2024 10:39 AM | Last Updated on Wed, Oct 9 2024 10:39 AM

Tamilnadu Minister Sensational Comments On Gujarat

అహ్మదాబాద్‌:గుజరాత్‌పై తమిళనాడు మంత్రి రేగుపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గుజరాత్‌ డ్రగ్స్‌కు హబ్‌గా మారిందన్నారు.డ్రగ్స్‌ రవాణాను అదుపు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారన్న గవర్నర్‌ రవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేగుపతి ఈ వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్‌కు గుజరాత్‌ కనిపించడం లేదా ప్రశ్నించారు.నిజానిజాలు తెలియకుండా తమిళనాడు గురించి గవర్నర్‌ మాట్లాడుతున్నారన్నారు.అసలు గవర్నర్‌కు డ్రగ్స్‌ కేసులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 

అన్నాడీఎంకే నేతలను డ్రగ్స్‌ కేసుల్లో విచారించేందుకుగాను అనుమతివ్వడానికి ఏడాదికిపైగా సమయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని చెప్పారు.  

ఇదీ చదవండి: జిలేబీ నచ్చిందా నాయనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement