tamilnadu minister
-
డ్రగ్స్‌కు హబ్‌గా గుజరాత్: తమిళనాడు మంత్రి
అహ్మదాబాద్:గుజరాత్‌పై తమిళనాడు మంత్రి రేగుపతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గుజరాత్ డ్రగ్స్‌కు హబ్‌గా మారిందన్నారు.డ్రగ్స్ రవాణాను అదుపు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారన్న గవర్నర్ రవి వ్యాఖ్యలకు కౌంటర్‌గా రేగుపతి ఈ వ్యాఖ్యలు చేశారు.గవర్నర్‌కు గుజరాత్ కనిపించడం లేదా ప్రశ్నించారు.నిజానిజాలు తెలియకుండా తమిళనాడు గురించి గవర్నర్ మాట్లాడుతున్నారన్నారు.అసలు గవర్నర్‌కు డ్రగ్స్ కేసులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అన్నాడీఎంకే నేతలను డ్రగ్స్ కేసుల్లో విచారించేందుకుగాను అనుమతివ్వడానికి ఏడాదికిపైగా సమయం తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాతే డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ఇదీ చదవండి: జిలేబీ నచ్చిందా నాయనా -
తమిళ మంత్రి అరెస్టు
సాక్షి, చెన్నై: ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం. సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో సెంథిల్‌ను సిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేర్పించారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో సెంథిల్ బాలాజీ బిగ్గరగా రోదిస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. గుండెకు సంబంధించిన కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష వైద్యులు నిర్వహించారు. గుండె నాళంలో మూడు చోట్ల బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీకి సిఫారసు చేశారు. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రం: స్టాలిన్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సెంథిల్ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. చెన్నై, కరూర్, ఈరోడ్‌లో ఈ సోదాలు జరిగాయి. తదుపరి విచారణ కోసం ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టుపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కేబినెట్ సహచరుడిని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీ బాలాజీని ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది. తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని ఈడీని ప్రశ్నిస్తూ సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. -
స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం
చెన్నై: తమిళనాడులోని తంజావూరులో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిని విడిచిపెట్టమని తమిళనాడు స్కూలు ఎడ్యుకేషన్ మంత్రి అంబిల్ మహేశ్ చెప్పారు. ఈ కేసులో తల్లిదండ్రులకు న్యాయం దక్కేలా చూస్తామన్నారు. ఈ కేసుపై విచారణ జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రజలు దీనిని రాజకీయం చేయొద్దని అన్నారు. తంజావూర్ మిషనరీ స్కూల్లో ఇంటర్ చదివే విద్యార్థిని వార్డెన్ తన ఇంట్లో వెట్టిచాకిరి చేయించుకుంటూ ఉండడంతో దానిని భరించలేక జనవరి 9న విషం తీసుకుంది. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతూ జనవరి 19న తుది శ్వాస విడిచింది. వార్డెన్ ఇంటి పనులు చెయ్యలేక విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది. -
సీఎం జగన్‌ను కలిసిన తమిళనాడు మంత్రులు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం తమిళనాడు మంత్రులు కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. ఈ భేటీలో తమిళనాడు మంత్రులు ఎస్పీ వేలుమణి (మున్సిపల్ అండ్ రూరల్ డెవలప్మెంట్), డి.జయకుమార్ (ఫిషరీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్) పాల్గొన్నారు. -
మంత్రి మెడపై మరో కత్తి, వీడని మరణ మిస్టరీ
చెన్నై: ఐటీ దాడులు, విచారణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ మెడపై ఆయన స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సుబ్రమణియన్ (52) మరణ మిస్టరీ మరో కత్తిలా వేలాడుతోంది. మరణానికి ముందు సుబ్రమణియన్‌కు ఒకే నంబర్ నుంచి 20 సార్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. నామక్కల్ ఉపాధ్యాయ కాలనీకి చెందిన సుబ్రమణియన్ మంత్రి విజయభాస్కర్‌కు అత్యంత సన్నిహిత స్నేహితుడు. ఈ స్నేహంతో మంత్రి ద్వారా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాల కాంట్రాక్టులు పొంది కోట్లు గడించాడు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ తరఫున ధన ప్రవాహానికి నేతృత్వం వహించిన మంత్రి విజయభాస్కర్ సహా 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేశారు. అదే సమయంలో సుబ్రమణియన్ ఇంటిపై కూడా దాడులు చేసి రెండుసార్లు కార్యాలయానికి పిలిపించుకుని విచారించారు. నగదు బట్వాడాలో మంత్రి వెనుక సుబ్రమణియన్ ప్రముఖ పాత్ర పోషించినట్లు అనుమానించిన ఐటీ అధికారులు నిజాలు రాబట్టేందుకు గట్టిగా విచారించారు. ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. తెల్లారితే చెన్నైలోని ఐటీ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉండగా ముందురోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలినా అనేక అనుమానాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల అనంతరం కొన్ని రోజులుగా సుబ్రమణియన్ తన సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి గడుపుతున్నారు. అయితే చివరిగా ఆయనకు కొందరు వీఐïపీల నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుసుకున్నారు. సుబ్రమణియన్ మరణానికి ముందు గుర్తుతెలియని వ్యక్తి ఒకే నంబరు నుంచి 20 సార్లు ఫోన్ చేసి అతనికి మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా అంతుచిక్కలేదు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు వీఐపీల జాబితాను సిద్ధం చేశారు. అలాగే తోటలో కూర్చుని తన స్వహస్తాలో పేజీల ఉత్తరం రాశాడని తోటలోని కూలీలు పోలీసులకు తెలపగా, ఆ ఉత్తరం కనిపించడం లేదు. సుబ్రమణియన్ స్వాధీనంలో మంత్రికి సంబంధించినవిగా చెప్పబడుతున్న కొన్ని డాక్యుమెంట్లు మాయమయ్యాయి. ఐటీ అధికారుల ముందు సుబ్రమణియన్ వాంగ్మూలం మంత్రి విజయభాస్కర్‌ను ఇరుకున పడేస్తుందనే కారణంతో ఎవరైనా హత్యచేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఏడాదిలో గుజరాత్‌ను కూడా దాటేస్తాం!
ఏడాదిలో గుజరాత్ సహా ఏ రాష్ట్రమైనా సాధించిన అభివృద్ధిని దాటిపోతామని తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పాండ్యరాజన్ అన్నారు. దక్షిణ భారతం మొత్తమ్మీద అత్యంత ఎక్కువ ఆర్థిక వృద్ధి సాధించేందుకు భారీస్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో తాము అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తామని, దాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే కృషి చేస్తున్నామని తెలిపారు. గుజరాత్ ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిని తాము ఈ ఒక్క ఏడాదే సాధిస్తామని, రాష్ట్రానికి 5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తెస్తామని అన్నారు. దక్షిణ భారతదేశం వాళ్లు వ్యాపారాలకు పనికిరారన్న దురభిప్రాయం చాలామందిలో ఉందని, కానీ దాన్ని తప్పని చూపిస్తామని పాండ్యరాజన్ చెప్పారు. దక్షిణాది వారు శారీరకంగా బలహీనంగా ఉంటారని, మానసికంగా పొగరుతో ఉంటారని, దాంతో పాటు వాళ్లు వ్యాపారవేత్తలు కారన్న అభిప్రాయం కూడా ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉందని, దాన్ని పూర్తిగా మార్చి.. తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన తెలిపారు.