ఏడాదిలో గుజరాత్‌ను కూడా దాటేస్తాం!
ఏడాదిలో గుజరాత్‌ను కూడా దాటేస్తాం!
Published Mon, Jan 9 2017 5:49 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
ఏడాదిలో గుజరాత్ సహా ఏ రాష్ట్రమైనా సాధించిన అభివృద్ధిని దాటిపోతామని తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పాండ్యరాజన్ అన్నారు. దక్షిణ భారతం మొత్తమ్మీద అత్యంత ఎక్కువ ఆర్థిక వృద్ధి సాధించేందుకు భారీస్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో తాము అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తామని, దాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే కృషి చేస్తున్నామని తెలిపారు. గుజరాత్ ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిని తాము ఈ ఒక్క ఏడాదే సాధిస్తామని, రాష్ట్రానికి 5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తెస్తామని అన్నారు.
దక్షిణ భారతదేశం వాళ్లు వ్యాపారాలకు పనికిరారన్న దురభిప్రాయం చాలామందిలో ఉందని, కానీ దాన్ని తప్పని చూపిస్తామని పాండ్యరాజన్ చెప్పారు. దక్షిణాది వారు శారీరకంగా బలహీనంగా ఉంటారని, మానసికంగా పొగరుతో ఉంటారని, దాంతో పాటు వాళ్లు వ్యాపారవేత్తలు కారన్న అభిప్రాయం కూడా ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉందని, దాన్ని పూర్తిగా మార్చి.. తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన తెలిపారు.
Advertisement