pandiarajan
-
అనిత వీడియో: అడ్డంగా బుక్కైన మంత్రి
సాక్షి, చెన్నై: మంత్రి పాండియరాజన్ ట్విట్టర్లో ఓ వీడియో వివాదానికి దారి తీసింది. నీట్‌కు వ్యతిరేకంగా బలవన్మరణానికి పాల్పడిన అనిత అన్నాడీఎంకేకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఆ వీడియో ఉండడం ఈ వివాదానికి కారణం. ఈ వ్యవహారంపై నెటిజన్లు తిట్ల పురాణం అందుకోవడంతో ఆ వీడియోతో తనకు సంబంధం లేదని మంత్రి దాటవేయడం గమనార్హం. నీట్‌కు వ్యతిరేకంగా గతంలో అనిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మెరిట్ మార్కులు దక్కినా, నీట్ రూపంలో వైద్య సీటు దూరం కావడంతో రాష్ట్రంలో బలన్మరణానికి పాల్పడిన తొలి విద్యార్థిగా అనిత ఉన్నారు. ఆమె మరణంతో నీట్‌కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే సాగాయి. తాజా ఎన్నికల్లో నీట్‌కు వ్యతిరేకంగా ప్రతి పక్షాలు వ్యాఖ్యలు చేసే సమయంలో తప్పనిసరిగా అనిత పేరును స్మరించుకోవడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె గొంతుతో ఓట్లను దండుకునేందుకు చేసిన ఓ ప్రయత్నం అన్నాడీఎంకే ఆవడి అభ్యర్థి, మంత్రి పాండియరాజన్‌కు బెడిసికొట్టింది. మిమిక్రీతో.. అనిత నీట్‌కు వ్యతిరేకంగా గతంలో తీవ్రంగానే వ్యాఖ్యలు చేసింది. దీనిని ఆసరాగా చేసుకుని ,అన్నాడీఎంకేకు మద్దతుగా ఆమె వ్యాఖ్యలు చేసినట్టుగా మిమిక్రీ చేసి ఓ వీడియోను సిద్ధం చేసినట్టున్నారు. ఇది మంత్రి అధికార ట్విట్టర్లో దర్శనం ఇచ్చింది. అన్నాడీఎంకేకు అనుకూలంగా అనిత వ్యాఖ్యలు ఎప్పుడు చేసినట్టో అని, నెటిజన్లు తీవ్రంగానే విరుచుకు పడే పనిలో పడ్డారు. ఇదేం నీచ రాజకీయం అని తిట్ల పురాణం అందుకున్న వాళ్లూ ఉన్నారు. దీంతో మేల్కొన్న మంత్రి పాండియరాజన్ తన వ్యాఖ్యలతో ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, తన అను మతి లేకుండా ట్విట్టర్లోకి వచ్చినట్టు స్పందించడం గమనార్హం. అయితే, అనిత సోదరుడు మణిరత్నం ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించాడు. తన చెల్లెల్ని నీట్‌రూపంలో పొట్టన పెట్టుకుంది కాకుండా, ఇప్పుడు ఆమె గొంతును మిమిక్రీ చేసి ఓట్లు దండుకునే యత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఈ వీడియో అనితను కించ పరిచనట్టుగానే ఉందని, ఇందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చదవండి: 3 రాష్ట్రాలు, ఒక యూటీలో ముగిసిన ఎన్నికల ప్రచారం -
ఏడాదిలో గుజరాత్‌ను కూడా దాటేస్తాం!
ఏడాదిలో గుజరాత్ సహా ఏ రాష్ట్రమైనా సాధించిన అభివృద్ధిని దాటిపోతామని తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పాండ్యరాజన్ అన్నారు. దక్షిణ భారతం మొత్తమ్మీద అత్యంత ఎక్కువ ఆర్థిక వృద్ధి సాధించేందుకు భారీస్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో తాము అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తామని, దాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటినుంచే కృషి చేస్తున్నామని తెలిపారు. గుజరాత్ ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిని తాము ఈ ఒక్క ఏడాదే సాధిస్తామని, రాష్ట్రానికి 5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తెస్తామని అన్నారు. దక్షిణ భారతదేశం వాళ్లు వ్యాపారాలకు పనికిరారన్న దురభిప్రాయం చాలామందిలో ఉందని, కానీ దాన్ని తప్పని చూపిస్తామని పాండ్యరాజన్ చెప్పారు. దక్షిణాది వారు శారీరకంగా బలహీనంగా ఉంటారని, మానసికంగా పొగరుతో ఉంటారని, దాంతో పాటు వాళ్లు వ్యాపారవేత్తలు కారన్న అభిప్రాయం కూడా ఇతర రాష్ట్రాల్లోని వారికి ఉందని, దాన్ని పూర్తిగా మార్చి.. తమను తాము తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఆయన తెలిపారు. -
శాస్త్రవేత్తగా పాండియరాజన్
దర్శక, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న పాండియరాజన్ ప్రస్తుతం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. పలు చిత్రాల్లో తనదైన శైలి పండిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఈయన తాజాగా ఆయ్వుకొట్టం చిత్రంలో సైంటిస్టుగా అవతరించనున్నారు. ఆయన ఇద్దరు యువకులపై చేసే ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందన్నదే ఈ చిత్రం ఇతివృత్తం అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అన్భరసన్. ఈయన కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని మాంగాడు అమ్మన్ మూవీస్ పతాకంపై గణపతి నిర్మిస్తున్నారు. ఆయనే ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంతో సత్యశ్రీ హీరోయిన్గా నటించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఈ చిత్రంలో ప్రముఖ నటుడు పాండియరాజన్ శాస్త్రవేత్తగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఆయన ఇద్దరు యువకులకు వారికే తెలియకుండా వారి మెదడులను మార్చేస్తారన్నారు. దీంతో వారు ఎలా ప్రవర్తిస్తారు? ఇది తెలిసిన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? శాస్త్రవేత్త పాండియరాజన్ ఏమయ్యారు? అన్ని అంశాలను వినోదభరితంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ ‘యూ’ సర్టిఫికెట్ అందించిందని త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆనందపు దత్తువీడు చిత్రం ఫేమ్ రమేష్‌కృష్ణ సంగీతాన్ని, విన్సెంట్ శిష్యుడు ఎస్.మోహన్ ఛాయాగ్రహణం అందించారని దర్శకుడు తెలిపారు.