సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
గవర్నర్ నజీర్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.
నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్ టీమ్‌లు యాక్టివేట్ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్ నేత బాలాజీ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment