గవర్నర్‌పై తొందరపాటు వ్యాఖ్యలు సరికాదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్‌లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు.
అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు.
ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment