దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా సిబ్బంది కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ విమానాశ్రయం లాన్‌లో ఉన్నప్పటికీ.. ఆయనను వదిలేసి విమానాన్ని టేకాఫ్ చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఈ చర్య ద్వారా ఎయిర్‌ఏషియా సిబ్బంది ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారని అధికారులు మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. గెహ్లాట్ గురువారం మధ్యాహ్నం టెర్మినల్ -2 నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది, అక్కడి నుండి ఆయన ఒక కాన్వకేషన్‌కు హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో రాయచూర్‌కు వెళ్లాల్సి ఉంది. అందుకోసం ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. AirAsia సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, “విమానం బెంగళూరు నుండి హైదరాబాద్‌కు మధ్యాహ్నం 2:05 గంటలకు బయలుదేరాల్సి ఉంది. గవర్నర్ బయలుదేరడానికి 4 నిమిషాల ముందు మధ్యాహ్నం 2:01 గంటలకు వచ్చారు.
అయితే, భద్రతా తనిఖీలు, ఇతర ప్రోటోకాల్‌లు పాటించడం వల్ల బయలుదేరడానికి 15 నిమిషాల ముందు పూర్తి చేయాల్సి ఉంటుంది, అయితే వీఐపీ లాన్ నుంచి గహ్లోత్ టర్మినల్ 2కు చేరుకునేలోపే విమానం హైదారాబాద్‌కు టేకాఫ్ అయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ టర్మినల్ వద్ద బోర్డింగ్ గేట్‌కు చేరుకోవడం ఆలస్యం అవడం వల్లే విమానం వెళ్లిపోయినట్లు తెలిపారు.
అయితే, గవర్నర్ మధ్యాహ్నం 1:35 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారని రాజ్‌భవన్ ప్రోటోకాల్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఎయిర్‌ఏషియా సిబ్బంది నిర్వాకంపై గవర్నర్ ప్రొటోకాల్ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఘటన కారణంగా గహ్లోత్ 90 నిమిషాల తర్వాత మరో విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఎయిర్‌ఏషియా ఈ ఘటనపై స్పందిస్తూ.. “ఈ ఘటనపై మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము. దీనిపై విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎయిర్‌లైన్ సీనియర్ నాయకత్వ బృందం ఆందోళనలను పరిష్కరించడానికి గవర్నర్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. వృత్తిపరంగా అత్యున్నత ప్రమాణాలు, ప్రొటోకాల్‌కు కట్టుబడి ఉండటానికే మేం ప్రాధాన్యమిస్తాం. గవర్నర్ కార్యాలయంతో మా సంబంధాలను మేం ఎల్లప్పుడూ గౌరవిస్తాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
చదవండి: Video: పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి
Comments
Please login to add a commentAdd a comment