సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్ జస్టిస్ లోక్ ఆరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, రాష్ట్ర సీఎస్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం.. ఇంఛార్జి గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాల పై రాధాకృష్ణన్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్, తెలంగాణకు ఇన్‌ఛార్జి గవర్నర్‌గా, అలాగే పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. తమిళనాడు బీజేపీలో రాధాకృష్ణన్ సీనియర్ నేత. గతంలో బీజేపీకి ఆ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా, పలు కీలక పదవులను నిర్వహించారాయన. రెండుసార్లు లోక్‌సభకు కొయంబత్తూరు నుంచి ప్రాతినిద్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment