పబ్‌జీతో జగిత్యాల యువకుడు బలి | One Killed For Playing PUBG Game In Jagtial | Sakshi
Sakshi News home page

పబ్‌జీతో జగిత్యాల యువకుడు బలి

Published Fri, Mar 22 2019 10:06 AM | Last Updated on Fri, Mar 22 2019 11:21 AM

Jagityal Youth Died For Playing Pubg Game - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పబ్‌జీ గేమ్‌ పద్మ వ్యూహానికి మరో యువకుడు బలయ్యాడు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారంపల్లికి చెందిన సాగర్‌ అనే 20 ఏళ్ల యువకుడు పబ్‌జీ గేమ్‌ పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. టైంపాస్‌గా ఆడటం ప్రారంభించిన సాగర్‌కు ఈ గేమ్‌ వ్యసనంలా మారింది. గత 45 రోజులుగా పదేపదే ఈ గేమ్‌ ఆడటంతో అతని మెడనరాలు పట్టేసి ఆరోగ్యం విషమించింది. దీంతో​ కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గత 5 రోజులుగా వైద్యులు సాగర్‌కు చికిత్స అందించగా.. నరాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం తుదిశ్వాస విడిచాడు. ఇక పబ్‌జీ గేమ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాగర్‌ను చూపిస్తూ.. అతని స్నేహితులు ఓ అవేర్‌నెస్‌ వీడియోను కూడా రూపొందించారు.

పబ్‌జీ గేమ్‌ ఆడటం ఎంత ప్రమాదకరమో సాగర్‌ పరిస్థితి చూసి తెలుసుకోండని ఆ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పబ్‌జీ మహమ్మారికి యువత బానిస అవుతోంది. ఈ గేమ్‌ వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నిద్రహారాలు మాని అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా.. చదువు, చేసే పనిపై శ్రద్ద చూపించలేకపోతున్నారు. ఓ స్టూడెంట్ పరీక్షలో ఎకనామిక్స్ సూత్రాలకు బదులు పబ్ జీ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. తాను గేమ్‌ ఆడటం మానేసినా.. దానికి సంబంధించిన చిత్రాలు వదలడం లేదని, పబ్‌జీ ఎంత ప్రమాదకరమో ఇప్పుడు అర్థమైందని ఆ యువకుడు తెలిపాడు. యువతకు వ్యసనంగా మారిన ఈ గేమ్‌ను నిషేంధించాలనే డిమాండ్‌ అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement