ధర్మపురి వివాదంలో మరో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు  | Sakshi
Sakshi News home page

ధర్మపురి వివాదంలో మరో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

Published Sun, Apr 23 2023 1:48 PM

Dharmapuri Congress Candidate Adluri Laxman Sensational Comments - Sakshi

సాక్షి, జగిత్యాల జిల్లా: మరోసారి ధర్మపురి ఎన్నికల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ధర్మపురి స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలను అధికారులు పగలగొట్టిన సంగతి తెలిసిందే.. అయితే,  నాలుగు బాక్సులకు మినహా మిగతా వాటికి తాళాలు లేవని, అధికారుల చర్యలు అనుమానం కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలు అధికారులు పగలగొట్టారు. 2018 ధర్మపురి అసెంబ్లీ ఎన్నిక ఫలితాలపై వివాదం నెలకొంది. గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ అభ్యర్థి.. హైకోర్టును ఆశ్రయించారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిటిషన్‌తో నివేదిక సమర్పించాలని జగిత్యాల జిల్లా అధికారులు, నాటి జిల్లా ఎన్నికల అధికారిని కోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 10వ తేదీనే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి అధికారులు సిద్ధమయ్యారు. కాగా, స్ట్రాంగ్ రూమ్ తాళం చెవుల మిస్సింగ్‌తో హైడ్రామా నెలకొంది. కీస్ మిస్సింగ్‌పై విచారణ చేపట్టాలని భారత ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
చదవండి: ధీరుడు కన్నీళ్లు పెట్టడు.. రేవంత్‌ నీతో నాకు పోలికేంటి..? ఈటల కౌంటర్‌

కోర్టు ఆదేశాలతో ఈ నెల ఏప్రిల్ 17వ తేదీన నాచుపల్లి జేఎన్టీయూలో నాటి ఎన్నికల అధికారి శరత్,  ఆ తర్వాత విధులు నిర్వహించిన కలెక్టర్ రవినాయక్, ప్రస్తుత కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు, నాటి రిటర్నింగ్ ఆఫీసర్, ఇతర అధికారులను ఈసీఐ బృందం విచారించింది. ఈసీఐ నివేదిక సమర్పించడంతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగులగొట్టేందుకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నాటి అభ్యర్థుల సమక్షంలో ఆదివారం.. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement