
మల్యాల(చొప్పదండి): వారు వలసజీవులు .. ఆదివారం సెలవు దినం కావడంతో అవసరమైన వస్తువుల కొనుగోలుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తుండగా మద్యం మత్తులో వేగంగా బైక్ నడుపుతూ వచ్చిన వ్యక్తి వారి ఆటోని డీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యా ల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రా మంలో జగిత్యాల – కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
మల్యాల మండలం నూకపల్లిలో చేపట్టి నడబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కూలీలుగా పనిచేసేందుకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రా ష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది వల స వచ్చారు. అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. ఆదివారం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు సదాకర్ సా హూ (25), గోపాల్ షత్‌నమి (20)తో పా టు మరోముగ్గురు జగిత్యాల వెళ్లారు. కొనుగోళ్లు పూర్తయ్యాక ఓ ఆటోలో నూకపల్లికి బయలుదేరారు.
ఆటో మల్యాల మండలం రాజారం గ్రామ సమీపంలోకి చేరుకోగా, అదేసమయంలో మల్యాలకు చెందిన బత్తిని సంజీవ్ తన మిత్రుడు కలికంటి మధుతో కలిసి బైక్‌పై జగిత్యాల వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న సంజీవ్ బైక్‌ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. బైక్ బలంగా ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గోపాల్ షత్‌నమి, సదాకర్ సాహూతోపాటు బైక్ నడుపుతున్న బత్తిని సంజీవ్ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాజారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గుర్రం జితేందర్‌తోపాటు మరో నలుగురు వలసజీవులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్ వెనక సీటులో కూర్చున్న మధు కూడా గాయపడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై చిరంజీవి సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment