
హత్య జరిగిన స్థలంలో విచారణ చేస్తున్న సీఐ జయేశ్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల:జిల్లాకేంద్రంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన మూగల రాజేశం(56) అనే వ్యక్తిని అతడి చిన్న కొడుకు వెంకటరమణ తాగిన మైకంలో బండరాయితో మోదీ ఆదివారం తెల్లవారుజామున హత్యచేశాడు. విద్యానగర్ ప్రాంతానికి చెందిన మూగల రాజేశం జీవనోపాధికోసం గల్ఫ్ వెళ్లి డబ్బులు సంపాదించి ఇంటికి పంపాడు. ఇంటి వద్ద ఉన్న భార్యతోపాటు కొడుకులు వృథాచేయడంతో కొద్దికాలంగా రాజేశంతోపాటు అతడి కొడుకు వెంకటరమణ మద్యానికి బానిసై గొడవపడేవారు. శనివారం రాత్రి రాజేశం మద్యంమత్తులో కొడుకుతో గొడవపడ్డాడు.
దీంతో చిన్నకొడుకు వెంకటరమణ తాగి ఉండడం, నిత్యం గొడవలు జరుగుతుండడంతో క్షణికావేశంలో తండ్రిని బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ జయేశ్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజేశం భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment