
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశామని, నీళ్ల కష్టాలు లేవంటూ మంత్రి కె.తారకరామారావు పచ్చి అబద్దాలు చెప్తున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి రూ.లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేసి 57 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చారు తప్పితే..రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలేదని విమర్శించారు.
ఉమ్మడి ఏపీలోనే తెలంగాణ లో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే విధంగా 33 ప్రాజెక్టులకు మహానేత వైఎస్సార్ శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు.పెండింగ్ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సీఎం కేసీఆర్, కేటీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment