
సాక్షి, హైదరాబాద్: పాత అబద్ధాలను ప్రచారం చేస్తూ, కొత్త అబద్ధాలతో ప్రజలను నమ్మించే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖమ్మం సభలోపు అయినా నిజాలు మాట్లాడతారని భావిద్దామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు.
భవిష్యత్తేలేని బీఆర్‌ఎస్ ఎజెండాను దేశంపై రుద్దేందుకు తమ స్వార్థ రాజకీయాలను దేశవ్యాప్తం చేయడానికి ఖమ్మం జిల్లాలో సభ నిర్వహించడం హాస్యాస్పదమని వై.ఎస్.షర్మిల విమర్శించారు. ఈ మేరకు జిల్లాలో నెలకొన్న పది సమస్యలపై టీఆర్‌ఎస్‌ను ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్‌కు మంగళవారం వై.ఎస్.షర్మిల బహిరంగ లేఖ రాశారు.