![Telangana: YSRTP YS Sharmila Lashes Out CM KCR - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/31/YS-SHARMILA-2.jpg.webp?itok=0mUC_g5K)
సాక్షి, హైదరాబాద్: ‘నువ్వు కొట్టినట్లు చెయ్.. నేను ఏడ్చినట్లు చేస్తా’.. చందంగా బీజేపీ–బీఆర్‌ఎస్ యవ్వారం ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఎద్దేవా చేశారు. కేంద్ర సంస్థల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దోచుకున్నా చర్యలు తీసుకునే దమ్ము బీజేపీ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
కేసీఆర్ అవినీతిని బయటపడుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. జైలుకు పంపుతామంటూ బండి సంజయ్ ప్రగల్భాలు పలకడం తప్పించి చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ నాయకుల మాటలు ఢిల్లీ కోటలు దాటుతయ్.. కానీ చేతలు మాత్రం గోల్కొండ కోటకే పరిమితమ య్యాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment