
ప్రజలకు అభివాదం చే స్తున్న షర్మిల
నాగర్‌కర్నూల్ రూరల్: రాష్ట్రంలో ఒక కుటుంబంతో అరాచక వ్యవస్థ కొనసాగుతోందని, ఈ పాలనకు అంతం పలకాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ముగిసి వనపర్తి జిల్లా గోపాల్‌పేటలోకి ప్రవేశించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన నాగర్‌కర్నూల్ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ చనిపోయి 13 ఏళ్లు గడుస్తున్నా.. ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఆయనను గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి తన తండ్రి జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment