అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు కట్టిస్తా: షర్మిల  | YSRTP YS Sharmila Public Meeting Praja Prasthanam Yatra Day 236 | Sakshi
Sakshi News home page

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్లు కట్టిస్తా: షర్మిల 

Published Wed, Feb 15 2023 3:44 AM | Last Updated on Wed, Feb 15 2023 3:44 AM

YSRTP YS Sharmila Public Meeting Praja Prasthanam Yatra Day 236 - Sakshi

లింగాలఘణపురం: ‘రాజశేఖరరెడ్డి బిడ్డను మాట ఇస్తున్న ఆశీర్వదించండి.. వైఎస్సార్‌టీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తా’ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల హామీనిచ్చారు. ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మంగళవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని నెల్లుట్ల నుంచి 236వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.

అనంతరం జనగామ–సూర్యాపేట రోడ్డులో ఉన్న గుడిసెవాసుల వద్దకు వెళ్లి వారితో కొద్దిసేపు మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇదే భూమిలో పట్టాలిచ్చి ఇళ్లు కట్టిస్తానని, అంతవరకు ఖాళీ చేయవద్దని వారితో చెప్పారు. నీళ్లు, విద్యుత్‌ సౌకర్యం లేదని గుడిసెవాసులు మొరపెట్టుకోగా వెంటనే రూ.15 లక్షలతో సోలార్‌ విద్యుత్‌కు ఏర్పాటు చేయాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement