అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న షర్మిల
అచ్చంపేట: ‘కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం అన్నారు.. మూడేళ్లకే ఎలా మునిగింది. కాంక్రీట్‌తో కట్టాల్సిన ప్రాజెక్టును మట్టితో నిర్మిస్తారా’.. అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఆర్టీసీ బస్టాండు ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.
ప్రజల కోసం రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ ఇదే నల్లమలలో మరణించిన మహానేత వైఎస్సార్‌కు మరణం లేదని, ప్రజల గుండెల్లో ఆయన ఇంకా బతికే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లలో ప్రజలకు చేసింది శూన్యమని, ప్రతీ పథకం మోసమని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు. పాలమూరు జిల్లాపై వైఎస్సార్‌కు అమితమైన ప్రేమ ఉందని.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు పలు ప్రాజెక్టులు చేపట్టారని షర్మిల పేర్కొన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దాటే వరకు నల్లబ్యాడ్జీలతో పాదయాత్ర కొనసాగిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment