
అడ్డాకుల: రాష్ట్రంలో ఎన్నికలు వస్తే పథకాల పేరు చెప్పి స్విచ్ వేసే సీఎం కేసీఆర్ ఎన్నికల తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోతారని, మళ్లీ ఎన్నికలప్పుడే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవాచేశారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల నుంచి దుబ్బపల్లి, మూసాపేట మండలంలోని చెన్నంపల్లి, దాసర్‌పల్లి, వేముల, తుంకినీపూర్, మూసాపేట, జానంపేట వరకు కొనసాగింది.
ఆమె జానంపేటలో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ అవినీతిని ఎండగట్టడంలో విఫలమయ్యాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు తో కమీషన్లు దండుకుంటున్నారని, అందుకే కేసీఆర్‌కు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు బంగారు తెలంగాణ అయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment