
సాక్షి, హైదరాబాద్: అసిఫాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 18 మంది సర్పంచులు చేసిన రాజీనామా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు చెంపపెట్టు అని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే చైతన్యం రావాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్‌టీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కేంద్రం ఇచ్చే నిధులను దొంగచాటు గా కాజేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బుధవారం ఆమె ట్విట్టర్ వేదికగా ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టు ఉంది కేసీఆర్ తీరు’ అని ఎద్దేవా చేశారు. నిధులు విడుదల చేయక ఇప్పటికే రాష్ట్రంలో 11 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment