
ఐనవోలు మండలంలో దివ్యాంగుడితో మాట్లాడుతున్న షర్మిల
చిల్పూరు/ఐనవోలు: ఆర్థికమంత్రి హరీశ్‌రావు కొత్త సంవత్సరం బడ్జెట్ కదా అని కొత్త సీసాను మామ కేసీఆర్ ఉంటున్న ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తే.. అందులో పాత సారా పోసి పంపినట్లు ఉందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నా రు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం జనగా మ, హనుమకొండ జిల్లాలో సాగింది. ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చేరుకోవడంతో షర్మిల యాత్ర 3,600 కిలోమీటర్ల మార్క్‌కు చేరు కుంది.
అంతకుముందు జనగామ జిల్లా చిల్పూరు మండలం వంగాలపల్లి నైట్ పాయింట్ వద్ద ఉదయం విలేకరులతో, ఆయాచోట్ల పాదయాత్రలో ఆమె మాట్లాడారు. గత బడ్జెట్ లో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు, దళితబంధుకు రూ.17 వేల కోట్లు కేటాయించారని, ఈసారి బడ్జెట్‌లో గత బడ్జెట్‌ను కాపీ పేస్ట్ చేశారన్నారు. హామీలు నెరవేర్చని కేసీఆర్ 420 అని విమర్శించారు. అంతకుముందు ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహం ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment