సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీక్ వ్యవహారంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా, పేపర్ లీక్ నేపథ్యంలో వైఎస్సార్‌టీపీ శ్రేణులు టీఎస్‌పీఎస్సీ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. పోలీసులు, వైఎస్సార్‌టీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం, షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పేపర్ లీక్‌లో పెద్ద వ్యక్తులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. నేను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని బయటకు వచ్చాను. ఒక హోటల్ రూమ్‌లో తలదాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు లుక్ అవుట్ ఆర్డర్ నోటీసులు ఇచ్చారు. నేను క్రిమినల్‌నా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment