
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ఇక్కడ పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు.
తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సంక్రాంతి తర్వాత పాదయాత్ర కొనసాగిస్తానని షర్మిల పేర్కొన్నారు.