సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, ఇది దేశంలోనే పెద్ద స్కామ్ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దీనిపై తక్షణమై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ సుబోధ్‌కుమార్ జైస్వాల్‌తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దానిపై విచారణ జరిపించాలంటూ లేఖ అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంతవరకు ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేకపోయారన్నారు. అవినీతి సొమ్ముతోనే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ పెడుతున్నారని షర్మిల ఆరోపించారు. అధికారంలో కొనసాగేందుకు ఆయన అనర్హుడని అన్నారు. కేసీఆర్‌కు పాలించే హక్కు లేదని, రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment