పోడుభూములకు పట్టాలివ్వాలి  | Telangana: BJP President Bandi Sanjay Demands On CM KCR Over Podu Lands | Sakshi
Sakshi News home page

పోడుభూములకు పట్టాలివ్వాలి 

Published Mon, May 30 2022 2:26 AM | Last Updated on Mon, May 30 2022 10:16 AM

Telangana: BJP President Bandi Sanjay Demands On CM KCR Over Podu Lands - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పోడుభూములకు పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఈ భూముల్లో హరితహారం చేపడితే ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోడుభూమి పట్టాలకోసం పోరాడుతున్న గిరిజనులు, ఆదివాసీలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ హరితహారానికి వ్యతిరేకం కాదని కేవలం పోడుభూముల్లో ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. గిరిజనుల హక్కులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాయడం క్షమించరాని నేరమని లేఖలో మండిపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement