సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పోడు పట్టాలు ఇవ్వడమేంటని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. పదేళ్లుగా దొర అమలు చేసిన ప్రతి పథకం తీరిదేనని ట్విట్టర్ వేదికగా ఆమె మండిపడ్డారు. పేదలకు దక్కాల్సిన పథకాలన్నీ బీఆర్‌ఎస్ దొంగల పాలవుతున్నాయని విమర్శించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నుంచి, దళితబంధు వరకు అన్నీ అక్రమాలేనన్నారు. 9 ఏళ్లుగా ఊరించి.. ఊరించి ఇస్తున్న పోడుపట్టాలను సైతం కేసీఆర్ అండ్‌కో వదిలిపెట్టడం లేదన్నారు. గిరిజనులకు దక్కాల్సిన భూముల విషయంలో అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. గిరిజనులకు బదులు గిరిజనేతరులకు ఎలా పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు ఈ విషయంలో వెంటనే ఒక విచారణ కమిటీ వేసి పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని షర్మిల డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment