‘స్ట్రెంచ్’ పనులు అడ్డుకున్న పోడు రైతులు
- మేడపల్లి బీట్ పరిధిలో రైతుల బైఠాయింపు
- పోడు భూముల్లో చెట్లు పెంచడాన్ని విరమించుకోవాలి
- హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్
నల్లబెల్లి : పోడు భూముల్లో ఫారెస్ట్ అధికారులు స్ట్రెంచ్ కటింగ్ పనులు చేయడాన్ని నిరసిస్తూ పోడు రైతులు ఫారెస్ట్ అధికారులపై శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడపల్లి బీట్ పరిధిలో ఫారెస్టు అధికారులు స్ట్రెంచ్ కటింగ్ పనులు చేస్తుండగా జేసీబీ వాహనానికి అడ్డంగా బైఠాయించి పనులను అడ్డుకున్నారు. మేడపల్లి ఫారెస్టు బీట్ పరిధిలోని రామారావుతండా, వీర్యతండా, గొల్లపల్లి, లచ్చితండా, దబ్బిరిపేట గ్రామాలకు చెందిన పోడు రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. నర్సంపేట ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌ఓ యాకయ్య పోడు రైతులకు నచ్చజెప్పినా వారు వినలేదు. దీంతో పనులు నిలిపి వేసి ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 40 ఏళ్లు పోడు భూములు సాగు చేసుకుంటు జీవిస్తున్న తమను భూముల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఆలోచన వెంటనే విరమించుకోవాలన్నారు. అర్హులైన రైతులకు హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రామారావుతండా, వీర్యతండా, గొల్లపల్లి, లచ్చితండా, దబ్బిరిపేట గ్రామాలకు చెందిన పోడు రైతులు పాల్గొన్నారు.
పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలి
ఖానాపురం : పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పోడు రైతులు డివూండ్ చేశారు. ఈ మేరకు వుండలంలోని దబ్బీర్‌పేట శివారులో పోడు భూమూలకు ట్రెంచ్ కట్ కొడుతున్న అటవీశాఖ అధికారులు డీఆర్వో యూకయ్యు, బీట్ ఆఫీసర్ సాంబు, లక్ష్మణ్‌ను పోడు రైతులు అడ్డుకున్నారు. మిషన్‌ను నిలిపివేసి గ్రావూనికి తరలించారు.
అనంతరం వారు వూట్లాడుతూ గత 20 ఏళ్లుగా పోడు సాగు చేసుకుని జీవిస్తున్న తవుకు పట్టాలు ఇవ్వకుండా భూవుులను స్వాధీనం చేసుకోవాలనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోడు భూవుులకు పట్టాలు అందించాలని కోరారు. కార్యక్రవుంలో పోడు రైతులు పాల్గొన్నారు.