బైక్‌పై.. కాలినడకన కలెక్టర్‌ తనిఖీలు | Khammam Collector Survey Of Podu Lands | Sakshi
Sakshi News home page

బైక్‌పై.. కాలినడకన కలెక్టర్‌ తనిఖీలు

Published Wed, Oct 12 2022 2:35 AM | Last Updated on Wed, Oct 12 2022 2:35 AM

Khammam Collector Survey Of Podu Lands - Sakshi

రఘునాథపాలెం: అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయకుండా క్షేత్రస్థాయిలో పనులెలా జరుగుతున్నాయో పరిశీలించారు ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌. రఘునాథపాలెం మండలం పంగిడి రెవెన్యూ పరిధిలో పోడు భూముల సర్వే పనులను మంగళవారం డీఎఫ్‌వో సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌తో కలిసి కలెక్టర్‌ గౌతమ్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అయితే, భూ­ముల వద్దకు వెళ్లేందుకు సరైన మార్గంలేకపోవడంతో ఆయన ద్విచక్రవాహనం నడుపుతూ బురద దారిలో మూడున్నర కిలో­మీటర్లకు పైగా ప్రయాణించారు. ఆ­తర్వాత ముందుకెళ్లడానికి సాధ్యం కాకపోవడంతో మరో మూడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లి గుట్టలపై భూముల సర్వేను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement